బీటీపీఎస్‌లో మూడో యూనిట్ నిలిచిపోవడం ప్రభుత్వ వైఫల్యమే
విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న వేళ కీలక యూనిట్ నిలిపివేత
ముందస్తు తనిఖీల్లో నిర్లక్ష్యంపై సమాధానం చెప్పాలి
మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
కాకతీయ, ఖమ్మం : విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న సమయంలో భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లోని మూడో యూనిట్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడం ప్రభుత్వ విద్యుత్ నిర్వహణలో నిర్లక్ష్యానికి నిదర్శనమని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రోజుకు 270 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని, ఇప్పటివరకు సుమారు 15.5 కోట్ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలిగిందని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తి సంస్థల్లో కీలక పరికరాల నిర్వహణ, ముందస్తు తనిఖీలు, స్పేర్ పార్ట్స్ అందుబాటులో ఉంచడంలో ఎందుకు నిర్లక్ష్యం వహించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిలిచిపోయిన మూడో యూనిట్‌ను వెంటనే పునరుద్ధరించేందుకు తీసుకుంటున్న చర్యలను ప్రభుత్వం వెల్లడించాలని పువ్వాడ అజయ్‌కుమార్ కోరారు.

