epaper
Wednesday, November 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

భట్టి పర్యటన వేళ.. వినయ్‌ భాస్కర్‌ గృహ నిర్బంధం!

భట్టి పర్యటన వేళ.. వినయ్‌ భాస్కర్‌ గృహ నిర్బంధం!
వైఎస్సార్‌ నగర్‌ గుడిసెవాసులకు న్యాయం చేయాలని డిమాండ్‌
మూడు ప్రశ్నలు.. మూడు డిమాండ్లతో ప్రభుత్వాన్ని నిలదీసిన మాజీ ఎమ్మెల్యే
అర్ధరాత్రి అరెస్టు చేసిన నాయకులను విడుదల చేయాలని డిమాండ్‌
ప్రభుత్వ భూముల పరిరక్షణకు పోరాటం కొనసాగిస్తాం : దాస్యం వినయ్‌ భాస్కర్‌

కాకతీయ, హనుమకొండ : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటన నేపథ్యంలో ప్రభుత్వ మాజీ చీఫ్‌విప్‌, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌ను పోలీసులు బుధవారం ఉదయం గృహ నిర్బంధం చేశారు. వైఎస్సార్‌ నగర్‌ గుడిసెవాసులకు న్యాయం చేయకపోతే ఉప ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకుంటామని ఆయన ప్రకటించిన నేపథ్యంలో ఈ చర్య చేపట్టారు. ఈ సందర్భంగా వినయ్‌ భాస్కర్‌ మాట్లాడుతూ.. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని అడిగితే అరెస్టులు, గృహ నిర్బంధాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. కాజీపేటలో సీలింగ్‌, ప్రభుత్వ భూములంటూ కాంగ్రెస్‌ నాయకులే గతంలో పేదలతో గుడిసెలు వేయించారని వినయ్‌ భాస్కర్‌ పేర్కొన్నారు. గుడిసెవాసులకు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఇప్పుడు మాట మార్చారని విమర్శించారు. ఈ భూముల వ్యవహారంలో కోట్లాది రూపాయలు చేతులు మారాయన్న ఆరోపణలపై సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాజీపేట బ్రిడ్జి నిర్మాణానికి తాము రూ.76 కోట్ల నిధులు తీసుకొచ్చి 80 శాతం పనులు పూర్తి చేశామని, 100 రోజుల్లో పూర్తిచేస్తానన్న నాయిని మూడేళ్లు కావస్తున్నా ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు. రైల్వే స్టేడియంలో బస్టాండ్‌ నిర్మిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు.

మూడు డిమాండ్లతో ప్రభుత్వానికి హెచ్చరిక

వైఎస్సార్‌ నగర్‌ గుడిసెవాసుల తరఫున పోరాడుతున్న బీఆర్‌ఎస్‌ నాయకులపై కేసులు తొలగించాలని, గుడిసెవాసులపై దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని వినయ్‌ భాస్కర్‌ డిమాండ్‌ చేశారు. బాధితులకు పట్టాలు ఇవ్వాలని లేదా ఆ భూమి పేదలకు దక్కేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అర్ధరాత్రి అరెస్టు చేసిన బీఆర్‌ఎస్‌ నాయకులు, మహిళలు, కాలనీవాసులను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. చెరబండరాజు కాలనీలో దళితులు, వైఎస్సార్‌ నగర్‌ గుడిసెవాసులపై దాడులు, న్యూ శాయంపేట అభయాంజనేయ స్వామి ఆలయ భూమి, ఎన్‌ఐటీ సమీప భూమి, బాలసముద్రంలోని కుడా భూమి, మైనార్టీలకు కేటాయించిన భూముల వ్యవహారాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వ భూములపై కాంగ్రెస్‌ నాయకులు కన్నేశారని ఆరోపించారు. కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ, రైల్వే డివిజన్‌ సాధన కోసం తాము పోరాడినప్పుడు నాయిని ఎక్కడున్నారని విమర్శించారు. పేదలకు ఇళ్ల పట్టాలు, పక్కా ఇళ్లు కల్పించే వరకు బీఆర్‌ఎస్‌ అండగా నిలిచి పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. అరెస్టయిన వారిలో మాజీ కార్పొరేటర్‌ సంకు నర్సింగరావు, తండమళ్ల వేణు, సుంచు కృష్ణ, కాటాపురం రాజు, దువ్వ కనకరాజు, బేధరకోట రంజిత్‌కుమార్‌, బరిగెల వినయ్‌, పాలడుగుల శివకుమార్‌, నయీమ్‌ జుబేర్‌, మహమ్మద్‌ హుస్సేన్‌, సిద్ధు, కొండ్ర శంకర్‌తో పాటు వైఎస్సార్‌ నగర్‌ వాసులు హరినాథ్‌, మంజుల, సతీష్‌ ఉన్నారు. తొలుత కాజీపేట పోలీస్‌స్టేషన్‌లో ఉంచిన వారిని బుధవారం ఉదయం హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అర్ధ‌రాత్రి బీఆర్ఎస్ నేత‌ల అరెస్టు

అర్ధ‌రాత్రి బీఆర్ఎస్ నేత‌ల అరెస్టు డిప్యూటీ సీఎం రాక నేప‌థ్యంలో పోలీసుల చ‌ర్య‌ పోలీసుల...

భట్టి సారూ మీరైనా ప‌ట్టించుకోండి

భట్టి సారూ మీరైనా ప‌ట్టించుకోండి కాజీపేట ఆర్వోబీపై ఎడ‌తెగ‌ని నిర్ల‌క్ష్యం ఏడేళ్లుగా కొలిక్కిరాని ఫాతిమానగర్‌...

పరకాల రాజకీయాల్లో ఫ్లెక్సీ ఫైట్‌!

పరకాల రాజకీయాల్లో ఫ్లెక్సీ ఫైట్‌! పోచంపల్లి వర్సెస్‌ చల్లా వ‌ర్గీయుల మ‌ధ్య రాజ‌కీయ...

ఒకచోట పరీక్షలు.. మరోచోట చెల్ల‌వంట‌

ఒకచోట పరీక్షలు.. మరోచోట చెల్ల‌వంట‌ ఖమ్మంలో ప్రైవేటు ఆసుపత్రుల ఇష్టారాజ్యం రోగులపై అదనపు ఆర్థిక...

రఘునాథపల్లిలో భారీ చోరీ

రఘునాథపల్లిలో భారీ చోరీ అంగన్‌వాడీ టీచర్‌ ఇంట్లో దొంగల బీభత్సం బంగారు...

చిన్ననాగారంలో ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు

చిన్ననాగారంలో ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు జన నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద...

పాకాల సరస్సులో ఇద్దరు చిన్నారులతో కలిసి వివాహిత ఆత్మహత్య

పాకాల సరస్సులో ఇద్దరు చిన్నారులతో కలిసి వివాహిత ఆత్మహత్య *మృతురాలు గీసుగొండ మండలం...

రామప్ప బొగ్గు గనిపై ఎన్‌జీటీ సుమోటో కేసు!

రామప్ప బొగ్గు గనిపై ఎన్‌జీటీ సుమోటో కేసు! వారసత్వ కట్టడం సమీపంలో గని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.