ఆవుల సుమలతకు పీహెచ్‌డీ పట్టా
చైతన్య విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ ప్రదానం
వ్యవసాయ నేల లక్షణాల అంచనాపై పరిశోధన
ఫౌండర్, ఛాన్సలర్ సీహెచ్‌వీ పురుషోత్తం రెడ్డి చేతుల మీదుగా పట్టా స్వీకరణ
కాకతీయ, వరంగల్ : వరంగల్ నగరంలోని ఎల్లంబజార్‌కు చెందిన ఆవుల సుమలత విద్యారంగంలో విశేష ఘనత సాధించారు. చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు. విశ్వవిద్యాలయ ఫౌండర్, ఛాన్సలర్ సీహెచ్‌వీ పురుషోత్తం రెడ్డి చేతుల మీదుగా డాక్టరేట్ అందుకున్నారు. “ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ మెథడ్స్ ఫర్ ప్రిడిక్షన్ ఆఫ్ అగ్రికల్చర్ సాయిల్ ప్రాపర్టీస్” అనే అంశంపై డాక్టర్ జి. మాధవి పర్యవేక్షణలో పరిశోధన పూర్తి చేశారు. మెషిన్ లెర్నింగ్ పద్ధతులతో వ్యవసాయ నేల లక్షణాలను అంచనా వేసే అంశంపై ఆమె అధ్యయనం చేశారు. కంప్యూటర్ సైన్స్‌ను వ్యవసాయ రంగానికి అనుసంధానించే దిశగా సాగిన ఈ పరిశోధన ప్రాధాన్యత సంతరించుకుంది. సుమలత డాక్టరేట్ సాధించడంపై కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు.

