epaper
Tuesday, October 27, 2026
epaper
BREAKING NEWS
Loading News...

భూసార పరిరక్షణకు ‘ఖేత్‌ బచావో అభియాన్‌’

భూసార పరిరక్షణకు ‘ఖేత్‌ బచావో అభియాన్‌’
నేల తల్లిని కాపాడితేనే భవిష్యత్‌ తరాలకు ఆహార భద్రత!
రసాయనాల వినియోగం.. శాస్త్రీయ పద్ధతుల్లోనే ఉండాలి
వ్యవసాయ, మార్కెటింగ్‌, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

కాకతీయ, హైదరాబాద్‌: నేల తల్లిని సంరక్షించుకుంటేనే భవిష్యత్‌ తరాలకు ఆహార భద్రత కల్పించగలమని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. భూసార పరిరక్షణ, సుస్థిర వ్యవసాయమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఖేత్‌ బచావో అభియాన్‌’ కార్యక్రమాన్ని గురువారం రైతు నేస్తం కార్యక్రమంలో ఆయన ప్రారంభించారు. భూసార పరీక్షలు చేయించుకొని, నేలలోని పోషకాల ఆధారంగా ఎరువులు వినియోగించాలని సూచించారు. రసాయన ఎరువులు, పురుగుమందులను వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించిన మోతాదుల్లోనే వాడాలని, అధిక వినియోగంతో నేల ఆరోగ్యం, పర్యావరణం దెబ్బతింటాయని పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావం, వాతావరణ మార్పులు, అసమాన వర్షపాతాన్ని దృష్టిలో పెట్టుకొని పంటల ఎంపికలో ముందస్తు ప్రణాళిక అవసరమన్నారు. నీటి లభ్యతను బట్టి స్వల్పకాలిక పంటలు, అపరాలు సాగు చేయాలని, సూక్ష్మ సేద్య పద్ధతులను ప్రోత్సహించాలని సూచించారు. సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయం, పంట మార్పిడి, జీవ ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. పంట వ్యర్థాలను కాల్చకుండా మల్చింగ్‌కు వినియోగించాలని, వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించుకోవాలని తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా అర్హులైన రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు వ్యవసాయ పనిముట్లు అందిస్తామని వెల్లడించారు. ‘ఖేత్‌ బచావో అభియాన్‌’ను నిరంతర ఉద్యమంగా చేపట్టి, నేల సారం, నీటి వనరులను కాపాడాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఓటు చోరీపై సమరభేరి!

ఓటు చోరీపై సమరభేరి! నవంబర్‌ 1న ఢిల్లీ నిరసనకు సన్నాహాలు గల్లీగల్లీలో ఓటు హక్కుల...

బ్రిక్స్‌ వేదికపై తెలంగాణ గొంతు

బ్రిక్స్‌ వేదికపై తెలంగాణ గొంతు ఢిల్లీ సమావేశాలకు బయలుదేరిన శాసనసభాపతి రాష్ట్ర ప్రగతి, కీలక...

నీటి వృథాపై జలమండలి కొరడా

నీటి వృథాపై జలమండలి కొరడా ప్యారడైజ్‌ హోటల్‌కు రూ.20 వేల జరిమానా తనిఖీల్లో తాగునీటి...

నీటి పొదుపే.. భవిష్యత్తుకు భరోసా!

నీటి పొదుపే.. భవిష్యత్తుకు భరోసా! ప్రతి ఇంట్లో 20 శాతం నీటి వినియోగం...

గచ్చిబౌలిలో లెదర్ కామన్ ఫెసిలిటీ సెంటర్

గచ్చిబౌలిలో లెదర్ కామన్ ఫెసిలిటీ సెంటర్ డిజైనింగ్ నుంచి బ్రాండింగ్ వరకు ఆర్టిజన్లకు...

పేదల బియ్యంతో.. మిల్లులో దందా!

పేదల బియ్యంతో.. మిల్లులో దందా! ఇబ్రహీంపట్నం రైస్‌ మిల్లులో 829 బస్తాలు పట్టివేత న్యూ...

హనీట్రాప్‌లో ఏసీపీ, ఇన్‌స్పెక్టర్‌!

హనీట్రాప్‌లో ఏసీపీ, ఇన్‌స్పెక్టర్‌! మాజీ ప్రియురాలి సాయంతో సైబర్‌ నేరగాడి వలపు వల వెయ్యి...

సంక్షేమ పథకాలపై సీఎం, మధుయాష్కీ చర్చ!

సంక్షేమ పథకాలపై సీఎం, మధుయాష్కీ చర్చ! ప్రభుత్వ ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్లడంపై సమాలోచన రూ.8...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.