epaper
Saturday, November 7, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అమరవీరుల ఆశయాల సాధన కోసం పోరాడాలి

అమరవీరుల ఆశయాల సాధన కోసం పోరాడాలి

కామ్రేడ్ మండల వెంకన్న

కామ్రేడ్ సురేష్, గణపతిల స్తూపంపై జెండావిష్కరణ ఘనంగా నివాళులు

కాకతీయ, నెల్లికుదురు: అమరవీరుల ఆశయ సాధన కోసం ప్రజా ఉద్యమాలను కొనసాగించాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండల వెంకన్న అన్నారు. నెల్లికుదురు మండలం లోని రావిరాల గ్రామంలో కామ్రేడ్స్ సురేష్ అన్న, గణపతిల స్తూపంపై సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో శుక్రవారం జెండావిష్కరణ చేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మండల వెంకన్న మాట్లాడుతూ, భూమి కోసం, భుక్తి కోసం, దేశ విముక్తి కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల ఆశయాలను కొనసాగించడమే వారికి అర్పించే నిజమైన నివాళి అని, స్వాతంత్ర్యం వచ్చి దాదాపు 80 సంవత్సరాలు గడిచినా దేశంలో భూసమస్య పరిష్కారం కాలేదని, పేదల బతుకుల్లో ఆశించిన మార్పు రాలేదని విమర్శించారు. ప్రభుత్వాలు మారుతున్నా ప్రజల జీవన పరిస్థితులు మారడం లేదని, ఒకవైపు కార్పొరేట్ శక్తులకు పాలకులు అండగా నిలుస్తుంటే మరోవైపు కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు కనీస హక్కుల కోసం పోరాడాల్సిన దుస్థితి కొనసాగుతోందని, గ్రామీణ పేదలు నేటికీ ఉపాధి హామీ పనులపైనే ఆధారపడాల్సి రావడం పాలకుల అభివృద్ధి విధానాల వైఫల్యానికి నిదర్శనమని, అమరవీరుల సంస్మరణ సభలు కేవలం నివాళులకే పరిమితం కాకుండా, వారు ఆశించిన సమసమాజ స్థాపన కోసం ప్రజలను చైతన్యపరచాలని పిలుపునిచ్చారు. విప్లవ పార్టీల నిర్మాణాన్ని బలోపేతం చేస్తూ కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, పేదలను ఐక్యం చేసి దోపిడీ, పీడన, అసమానతలకు వ్యతిరేకంగా బలమైన ప్రజా ఉద్యమాలను చేపట్టాలన్నారు.
ఈ కార్యక్రమంలో తొర్రూరు డివిజన్ కార్యదర్శి ఊడుగుల లింగన్న, జిల్లా నాయకులు
చిర్ర యాదన్న, బట్టు చైతన్య, డివిజన్ నాయకులు నక్క యాకన్న, పల్లె రమేష్, గుగులోతు వీరన్న, తారమ్మ, మైబు, వెంకన్న, రమేష్, భూలక్ష్మి, యశోద, యాదమ్మ, సరూప, సరిత, గాద విజయ, చిన్నా, రేణుక, టోనికే వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

విద్యార్థుల విజ్ఞాన వికాసానికి గ్రంథాలయం దోహదం

విద్యార్థుల విజ్ఞాన వికాసానికి గ్రంథాలయం దోహదం శాయంపేట పాఠశాలలో బమ్మెర పోతన గ్రంథాలయం...

అంగన్వాడి సెంటర్ల సేవలు వినియోగించుకోవాలి

అంగన్వాడి సెంటర్ల సేవలు వినియోగించుకోవాలి ----- సర్పంచి అశోక్ కుమార్ కాకతీయ,నెల్లికుదురు : అంగన్వాడి...

ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి

ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి ప‌ట్టుద‌ల‌తో చ‌దివి తల్లిదండ్రుల కలలను నిజం చేయండి :...

ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నాయనమ్మ కన్నుమూత

ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నాయనమ్మ కన్నుమూత నేడు స్వగ్రామం శాలిగౌరారంలో...

‘ఎల్ నినో’ను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి!

'ఎల్ నినో'ను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి! - మండల ప్రత్యేక అధికారి వై...

సమయపాలన పాటించని లక్షెట్టిపేట రెవెన్యూ సిబ్బంది.

  కాకతీయ,మంచిర్యాల జిల్లా: రెవిన్యూ అధికారులు స‌మ‌య పాల‌న పాటించ‌డం లేదు. మంచిర్యాల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.