epaper
Friday, November 13, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఉద్యమకారుల హక్కుల సాధనకు మరో ఉద్యమం!

ఉద్యమకారుల హక్కుల సాధనకు మరో ఉద్యమం!
రేపు హనుమకొండలో రెండో దశ ఉద్యమకారుల ఓదార్పు యాత్ర
కులమత, రాజకీయ, వర్గ విభేదాలకు అతీతంగా పాల్గొనాలి
ములుగురోడ్డు చౌరస్తా నుంచి ఉదయం 10.30 గంటలకు ర్యాలీ ప్రారంభం
తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్‌ గుడిమల్ల రవికుమార్‌ పిలుపు
కాకతీయ, హనుమకొండ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏకతాటిపైకి వచ్చి పోరాడిన ఉద్యమకారులు.. ఇప్పుడు తమ హక్కుల సాధన కోసం మరోసారి ఐక్యంగా కదలాలని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్‌ గుడిమల్ల రవికుమార్‌ పిలుపునిచ్చారు. ఉద్యమకారుల హక్కులను సాధించుకునేందుకు పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ఈ క్రమంలో శుక్రవారం హనుమకొండలో నిర్వహించనున్న రెండో దశ ఉద్యమకారుల ఉదార యాత్రకు పెద్ద సంఖ్యలో తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. ఉదయం 10.30 గంటలకు ములుగురోడ్డు చౌరస్తా నుంచి యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. 1969 తొలి దశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారితోపాటు, మలిదశ ఉద్యమంలో వివిధ సందర్భాల్లో భాగస్వాములైన ఉద్యమకారులు ఈ యాత్రలో పాల్గొననున్నారని రవికుమార్‌ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంత నిబద్ధతతో పోరాడామో.. అదే పట్టుదలతో మన హక్కులను సాధించుకోవడానికి ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. హక్కుల కోసం అడగకపోతే ఎవరూ పట్టించుకోరని, మన గొంతుకకు పదును పెట్టకపోతే సమస్యలు పరిష్కారానికి నోచుకోవని పేర్కొన్నారు. ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ తమ హక్కుల పరిరక్షణ కోసం ముందుకు రావాలని కోరారు. కులమతాలకు, రాజకీయ పార్టీలకు, వర్గ విభేదాలకు అతీతంగా ఉద్యమకారులంతా ఒకే వేదికపైకి రావాలని పిలుపునిచ్చారు. ఎక్కడివారు అక్కడి నుంచి స్వచ్ఛందంగా బయలుదేరి యాత్రకు చేరుకోవాలని సూచించారు. ప్రయాణానికి అవసరమైన వాహనాలను ఎవరికి వారే సమకూర్చుకోవాలని కోరారు. మూడు నుంచి నాలుగు గంటలపాటు జరిగే ఈ యాత్రలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.
ములుగురోడ్డు నుంచి మడికొండ వరకు..
హనుమకొండలోని ములుగురోడ్డు చౌరస్తా నుంచి ప్రారంభమయ్యే యాత్ర హనుమకొండ చౌరస్తా, పోలీసు కమిషనర్‌ కార్యాలయం, అంబేడ్కర్‌ సెంటర్‌, కాళోజీ విగ్రహం, అదాలత్‌ సెంటర్‌, ఫాతిమానగర్‌ మీదుగా మడికొండ వరకు కొనసాగుతుందని రవికుమార్‌ వివరించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఈ యాత్రలో క్రమశిక్షణతో పాల్గొనాలని కోరారు. తమకు తెలిసిన ఇతర ఉద్యమకారులను కూడా యాత్రకు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యమకారుల ఐక్యతను చాటుతూ హక్కుల సాధన దిశగా ముందడుగు వేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్‌ గుడిమల్ల రవికుమార్‌ పిలుపునిచ్చారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సాఫ్ట్‌బాల్‌ క్రీడలో సత్తా చాటాలి

సాఫ్ట్‌బాల్‌ క్రీడలో సత్తా చాటాలి రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ నిరూపించుకోవాలి కరీమాబాద్‌ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు...

ఘనంగా సింగపురం ఇందిరా జన్మదిన వేడుకలు!

ఘనంగా సింగపురం ఇందిరా జన్మదిన వేడుకలు! క్యాంపు కార్యాలయంలో కేక్‌ కట్‌ చేసి...

తమ్ముడిని హత్య చేసిన అన్నకు జీవిత ఖైదు!

తమ్ముడిని హత్య చేసిన అన్నకు జీవిత ఖైదు! వరంగల్‌ ప్రధాన జిల్లా న్యాయస్థానం...

పీఎం రాహత్‌ పథకం అమలులో నిర్లక్ష్యం వద్దు

పీఎం రాహత్‌ పథకం అమలులో నిర్లక్ష్యం వద్దు రోడ్డు ప్రమాద బాధితులకు నగదు...

ఐఎల్‌పీఏ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి!

ఐఎల్‌పీఏ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి! నవంబర్‌ 14న హనుమకొండలో ఆరో రాష్ట్ర...

తరగతి గదుల నుంచి ఆసుపత్రి వరకు

తరగతి గదుల నుంచి ఆసుపత్రి వరకు ఐటీడీఏ పీఓ క్షేత్రస్థాయి పరిశీలన రైనిగూడెం ఆశ్రమ...

దొడ్ల కొత్తూరులో భారీగా నాటుసారా నిల్వలు

దొడ్ల కొత్తూరులో భారీగా నాటుసారా నిల్వలు పోలీసుల కార్డన్‌ సెర్చ్‌లో 4 వేల...

బియ్యం ధరలపై అధికారుల కొరడా

బియ్యం ధరలపై అధికారుల కొరడా ఏటూరునాగారంలో రకాలను బట్టి గరిష్ఠ ధరల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.