epaper
Sunday, November 15, 2026
epaper
BREAKING NEWS
Loading News...

వ్యాపారి లింగారెడ్డిపై కేసు నమోదు

వ్యాపారి లింగారెడ్డిపై కేసు నమోదు
ఎనుమాముల మార్కెట్‌ కార్యదర్శిని బెదిరించిన ఫ‌లితం
నోటీసుల జారీపై బహిరంగంగా దుర్భాషలాడినట్లు ఫిర్యాదు
విధులకు ఆటంకం కలిగించి, ప్రాణభయం సృష్టించారని కార్యదర్శి ఆరోపణ

కాకతీయ, వరంగల్‌ ప్రతినిధి: వరంగల్‌ వ్యవసాయ మార్కెట్‌లో నోటీసుల జారీ వ్యవహారం పోలీస్‌ కేసుకు దారితీసింది. మార్కెట్‌ కార్యదర్శి విధులకు ఆటంకం కలిగిస్తూ, బహిరంగంగా దుర్భాషలాడి బెదిరించారన్న ఫిర్యాదుతో అడ్తి సెక్షన్‌ అధ్యక్షుడు ఎస్‌.ఎన్‌.రెడ్డి లింగారెడ్డిపై ఎనుమాముల పోలీసులు కేసు నమోదు చేశారు. మార్కెట్‌లో తూకాల వ్యత్యాసాలపై వ్యాపారులకు నోటీసులు జారీ చేసినందుకు తనను అవమానించారని కార్యదర్శి ఎన్‌.శ్రీనివాస్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. రైతులు మార్కెట్‌కు తీసుకొచ్చిన సరుకును కొనుగోలు చేసే సమయంలో కొందరు అడ్తిదారులు తక్కువ తూకం నమోదు చేస్తూ చెల్లింపుల్లో మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని కార్యదర్శి తెలిపారు. ఈ వ్యవహారంపై కార్యాలయ విధుల్లో భాగంగా ఈ నెల 10న సంబంధిత అడ్తిదారులకు నోటీసులు జారీ చేసినట్లు ఫిర్యాదులో వివరించారు. ఆ నోటీసుల కారణంగా గురువారం ఉదయం పత్తి యార్డులో జెండాపాట జరుగుతున్న సమయంలో లింగారెడ్డి తనను అడ్డుకున్నారని ఆరోపించారు. వేలాది మంది రైతులు, వ్యాపారులు, గుమాస్తాలు, మార్కెట్‌ చైర్‌పర్సన్‌, సిబ్బంది సమక్షంలోనే దుర్భాషలాడుతూ అవమానించారని పేర్కొన్నారు.

‘ఇది మా మార్కెట్‌.. మేము చెప్పినట్టే నడవాలి’

‘నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఏ మార్కెట్‌ నుంచి వచ్చావు? ఇది మా మార్కెట్‌.. మేము చెప్పినట్టే నడవాలి. నువ్వు నోటీసులు ఎలా ఇస్తావు?’ అంటూ బెదిరించారని కార్యదర్శి ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా తనను అక్కడి నుంచి కదలనివ్వకుండా అడ్డుకుని, ప్రాణభయం కలిగించారని ఆరోపించారు. ఉన్నతాధికారులతో చర్చించిన అనంతరం శుక్రవారం ఎనుమాముల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కార్యదర్శి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు క్రైమ్‌ నంబర్‌ 242/2026గా కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహితలోని 126(2), 221, 224, 352, 351 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఏనుమాముల సీఐ జవ్వాజి సురేష్  తెలిపారు. మార్కెట్‌ లావాదేవీల్లో అవకతవకలపై అధికారులు తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఘనంగా గుట్టయ్యగౌడ్ జన్మదిన వేడుకలు

ఘనంగా గుట్టయ్యగౌడ్ జన్మదిన వేడుకలు కాకతీయ, నెల్లికుదురు:మండలంలోని నైనాల గ్రామానికి చెందిన కాంగ్రెస్...

యాసంగిలో వరికి స్వస్తి

యాసంగిలో వరికి స్వస్తి ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం! ఎల్‌-నినో ప్రభావంతో నీటి ఎద్దడి,...

మార్కెట్‌ను ఏఎంసీకి అప్పగించండి

మార్కెట్‌ను ఏఎంసీకి అప్పగించండి నాలుగేళ్లుగా అసంపూర్తిగా ఇంటిగ్రేటెడ్‌ ఫ్రూట్స్‌ మార్కెట్‌ రూ.24 కోట్ల పనులు...

పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్‌ దాడి

పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్‌ దాడి ముగ్గురి అరెస్టు..పరారీలో ఒక‌రు.. రూ.36,670 నగదు, 3 సెల్‌ఫోన్లు...

పీహెచ్‌సీలో డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీ!

పీహెచ్‌సీలో డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీ! మందుల నిల్వలు, వ్యాక్సిన్ల నిర్వహణపై క్షేత్రస్థాయి పరిశీలన అర్హులైన...

రాష్ట్రంలో ఉద్యమకారులకు గుర్తింపేది?

రాష్ట్రంలో ఉద్యమకారులకు గుర్తింపేది? ఆర్థిక ఇబ్బందులతో ఉద్యమకారుల కుటుంబాల అవస్థలు తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల...

చిన్నారుల ప్రతిభను ప్రోత్సహించాలి

చిన్నారుల ప్రతిభను ప్రోత్సహించాలి నెహ్రూ ఆశయాలతో సమానత్వ సమాజ నిర్మాణం నర్సంపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌...

చిన్న నాగారంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

చిన్న నాగారంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు కాకతీయ, ఇనుగుర్తి : ఇనుగుర్తి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.