ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లు చేపట్టాలి.. తహసీల్దార్‌కు బీజేపీ నాయకుల వినతి
కాకతీయ,శంకరపట్నం:మండలంలోని అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని బీజేపీ మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో శంకరపట్నం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద వేచి ఉండే పరిస్థితి రాకుండా చూడాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు కొమురయ్య, జిల్లా అధికార ప్రతినిధి అలివేలు సమ్మిరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు జంగ జైపాల్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు దాసరపు నరేందర్, సీనియర్ నాయకులు కొయ్యడ అశోక్, కాంతాల రాజిరెడ్డి, జానపట్ల రాజిరెడ్డి, చెర్ల శ్రీనివాస్, దాసరి సంపత్, మండల ఉపాధ్యక్షులు కనకం సాగర్, రాసమల్ల శ్రీనివాస్, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కనకం కుమార్, మండల కోశాధికారి బోడ తిరుపతి, బీజేవైఎం మండల అధ్యక్షుడు బొజ్జ సాయిప్రకాష్, సోషల్ మీడియా కన్వీనర్ కునారపు శ్రీనాథ్ యాదవ్, బొంతల రవితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

