epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

“ట్విట్టర్ టిల్లు …! ముందు నీ ఇంటిని చక్కబెట్టుకో!!”

“ట్విట్టర్ టిల్లు …! ముందు నీ ఇంటిని చక్కబెట్టుకో!!”
ద‌మ్ముంటే జూబ్లీహిల్స్ ఎన్నిక‌ల్లో గెలిచి చూపించు
వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి నువ్వు ఎక్క‌డుంటావో తెలియ‌దు
కేటీఆర్ పై మంత్రి పొంగులేటి ఫైర్

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : ట్విట్టర్ టిల్లు …! “నీకు విజన్ ఉందా? నీ నాన్నకు ఉందా తెలుసుకో కేటీఆర్ … ముందు నీ ఇంటిని, నీ పార్టీని చక్కబెట్టుకో… మూడున్నరేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో నువ్వు అమెరికాలో ఉంటావా… ఇండియాలో ఉంటావా అన్నది కూడా రాష్ట్ర ప్రజలకు సందేహమే. దమ్ముంటే రానున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో మీ పార్టీ సత్తా చూపించండి” అంటూ రాష్ట్ర‌ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కేటీఆర్ కు సవాల్ విసిరారు. గురువారం ఖ‌మ్మంలోని వరంగల్ క్రాస్ రోడ్‌లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన 80కుటుంబాలకు చెందిన వారు కాంగ్రెస్‌లో చేరగా వారికి మంత్రి స్వయంగా కండువా కప్పి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు జ‌రిగిన స‌భ‌లో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ… రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు ఎప్పటికీ మరవలేనివని గుర్తుచేశారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాటు ప్రజల కలలను ఛిద్రము చేసిందని మండిపడ్డారు. వారి హయంలో “ఒకే ఒక లక్ష ఇళ్లు ప్రతి సంవత్సరం కట్టివుంటే, పది లక్షల పేద కుటుంబాలకు గృహాలు అందేవి. కానీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల కమీషన్లలో మునిగిపోయింది. పాము కొర్రల్లో విషం పెట్టుకున్నట్టే, వీరంతా ఒళ్ళంతా విషం నింపుకుని తిరుగుతున్నారని” ఘాటుగా విమర్శించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రజలు బీఆర్‌ఎస్‌కు గట్టి బుద్ధి చెప్తారని, అసెంబ్లీ , లోక్ సభ ఎన్నికల్లోనే ప్రజలు వారిని పక్కన పెట్టేశారని మంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పేదలకు ఇళ్లు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు కాంగ్రెస్ పార్టీ వచ్చాక జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మద్దినేని బేబీ స్వర్ణకుమారి, టీపీసీసీ నాయకులు ధరావత్ రామ్మూర్తి నాయక్, బొర్రా రాజశేఖర్, మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాథ్ బాబు, కళ్ళెం వెంకట్ రెడ్డి, మద్ది మల్లారెడ్డి, బండి జగదీష్, ప్రతాపనేని రఘు, భూక్యా సురేష్ నాయక్, వెంపటి రవి, భుజంగ రెడ్డి, వీరా రెడ్డి, భాస్కర్ నాయక్, ప్రద్యుమ్న చారి, సంగయ్య, వెంకటనారాయణ, తోట వీరభద్రం, కర్లపూడి భద్రకాళి, బానోత్ దివ్య, బానోత్ హరి, తిప్పిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఆ అవ‌మాన‌మే న‌న్ను ఎమ్మెల్యేను చేసింది

ఆ అవ‌మాన‌మే న‌న్ను ఎమ్మెల్యేను చేసింది బిజినెస్‌మెన్ కావాల‌నేది నా చిన్న‌ప్ప‌టి క‌ల‌ అన్న...

పది పార్టీలు మారిన చరిత్ర నీది

పది పార్టీలు మారిన చరిత్ర నీది నువ్వా కాంగ్రెస్‌ను విమర్శించేది? సీఎం రేవంత్‌ను తిడుతుంటే...

ఖమ్మం బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్‌

ఖమ్మం బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్‌ మంత్రి తుమ్మల నాయకత్వానికి జై కొట్టిన మహిళా...

మేడ్చల్ డీసీసీపై కసరత్తు షురూ

మేడ్చల్ డీసీసీపై కసరత్తు షురూ రంగంలోకి టీపీసీసీ పరిశీలకులు జనవరి 1 వరకు క్షేత్రస్థాయిలో...

గాంధీ పేరే బీజేపీకి భయం!

గాంధీ పేరే బీజేపీకి భయం! ఉపాధి హామీ నుంచి పేరు తొలగింపు అప్రజాస్వామికం లౌకిక...

బీజేపీలోకి పేరం గోపికృష్ణ‌.. రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద‌ర్‌రావు స‌మక్షంలో చేరిక‌

బీజేపీలోకి పేరం గోపికృష్ణ‌ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద‌ర్‌రావు స‌మక్షంలో చేరిక‌ ఉన్న‌త విద్యావంతుడు పార్టీలోకి...

ప‌ల్లె పోరు షూరు

ప‌ల్లె పోరు షూరు పంచాయ‌తీ ఎన్నిక‌ల‌తో రాజ‌కీయ వేఢీ ఉమ్మ‌డి కరీంన‌గ‌ర్ జిల్లాలో 1224...

కాంగ్రెస్ అరాచకాలపై ‘విద్యార్థి రణభేరి’

కాంగ్రెస్ అరాచకాలపై ‘విద్యార్థి రణభేరి’ ఫీజు రీయింబర్స్‌మెంట్, గురుకుల సమస్యలపై పోరుబాట వచ్చే నెల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.