epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఘనంగా ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు

  • కరీంనగర్ లో స్వయంసేవకుల భారీ కవాతు
  • పాల్గొన్న కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి బండి సంజ‌య్ కుమార్‌

కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ బ్యూరో : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శతాబ్ది ఉత్సవాలు కరీంనగర్ పట్టణంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నగరంలోని ప్రధాన వీధుల్లో స్వయంసేవకులు క్రమశిక్షణతో భారీ కవాతు (పథ సంచలన్) నిర్వహించారు. ఈ కవాతులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్వయంసేవకుడిగా పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల నుంచి ప్రారంభమైన రూట్ మార్చ్ కరీంనగర్ పలు ప్రధాన రహదారుల మీదుగా రాంనగర్ వరకు కొనసాగింది. అనంతరం శ్రీ చైతన్య జూనియర్ కళాశాల మైదానంలో సంచలన్ ముగింపు కార్యక్రమం (సమరోప్) జరిగింది.

సభలో ముఖ్య వక్తగా హాజరైన విద్యా భారతి దక్షిణ మధ్య క్షేత్ర కార్యదర్శి అయచితుల లక్ష్మణరావు మాట్లాడుతూ, ఆర్ఎస్ఎస్ ను అర్థం చేసుకోవాలంటే దాన్ని మత లేదా రాజకీయ కోణంలో కాకుండా, నిస్వార్థ సేవా దృక్పథంతో చూడాలని చెప్పారు. సంఘ్ స్థాపకులు డాక్టర్ కేశవ్ బలిరాం హెడ్గేవార్ దేశంలో ఉన్న సామాజిక విభజన వల్లే సమస్యలు తలెత్తుతున్నాయని భావించి, జాతిని సంఘటితం చేయాలనే లక్ష్యంతో 1925లో విజయదశమి రోజున ఆర్ఎస్ఎస్‌ను ప్రారంభించారని వివరించారు. దేశ సేవా భావన, సామాజిక స్పృహ, పర్యావరణ పరిరక్షణ, స్వదేశీ ఆచరణ, కుటుంబ ప్రబోధన్, పౌర కర్తవ్యాలపై అవగాహన కలిగించే కార్యక్రమాల ద్వారా సమాజాన్ని మారుస్తున్న సంస్థగా ఆర్ఎస్ఎస్ నిరంతరం పని చేస్తోందన్నారు. ఆఎస్ఎస్ ను విమర్శించాలంటే ముందు దానిలో పనిచేయాలన్న సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ మాటలను ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఆరు నెలలు సంఘంలో పని చేస్తేనే దాని అసలు తత్వం అర్థమవుతుందని తెలిపారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సిద్ధార్థ స్కూల్స్ అధినేత దాసరి శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ.. సమాజం కోసం పనిచేస్తున్న స్వయంసేవకులు అభినందనీయులని, దేశానికి ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు అవసరమని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత కార్యవర్గ సభ్యులు బూర్ల దక్షిణామూర్తి, నగర సంఘ్ చాలక్ హనుమండ్ల శ్రీనివాస్ రెడ్డి, కార్యవాహ చామ మహేశ్వర్, నగరానికి చెందిన వందలాది మంది స్వయంసేవకులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.