epaper
Thursday, October 29, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఆర్టీఏ చెక్ పోస్టుల్లో ఏసీబీ రైడ్‌..!

  • ఏక కాలంలో 12 చోట్ల దాడులు
  • బోరజ్ చెక్‌పోస్టులో రూ.1.26వేల ప‌ట్టివేత‌
  • సలాబత్ పూర్, కృష్ణ చెక్ పోస్టుల్లోనూ న‌గ‌దు ప‌ట్టివేత‌
  • చెక్‌పోస్టులు ఎత్తేసినా కొన‌సాగిస్తున్న అధికారులు
  • వ‌సూళ్ల‌కు పాల్ప‌డుతూ వేధిస్తున్న‌ట్లుగా ఏసీబీకి ఫిర్యాదులు
  • ప‌కడ్బందీగా ఏక కాలంలో దాడులు
  • ఉలిక్కిప‌డిన ఆర్టీఏలోని అవినీతి అధికారులు

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : అక్ర‌మ వ‌సూళ్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారిన ఆర్టీఏ చెక్‌పోస్టుల‌పై ఆదివారం ఏసీబీ అధికారులు ఏక కాలంలో దాడులు నిర్వ‌హించారు. శ‌నివారం అర్ధ‌రాత్రి నుంచి మొద‌లైన ఏసీబీ బృందాల దాడులు ఆదివారం ఉద‌యం వ‌ర‌కు కొన‌సాగాయి. ఏక కాలంలో ఏసీబీ అధికారులు చెక్ పోస్టుల‌పై త‌నిఖీలు నిర్వ‌హించ‌డంతో అవినీతి లింకులున్న అధికారుల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తాయి. రోజూ ఒక్కో చెక్ పోస్టులో ల‌క్ష‌లాది రూపాయాల మాముళ్లు మాములుగానే వ‌సూళ్లు చేస్తున్న‌ట్లుగా ఆరోప‌ణ‌లున్నాయి. ఈ క్ర‌మంలోనే ట్రాన్స్‌పోర్టు వెహికిల్ య‌జ‌మానుల నుంచి ఏసీబీ అధికారుల‌కు ఫిర్యాదులు అంద‌డంతో ప‌క‌డ్బందీగా ఏక కాలంలో దాడులు నిర్వ‌హించ‌డం గ‌మ‌నార్హం.

12 ఆర్టీఏ చెక్ పోస్టుల‌పై దాడులు

ఆర్టీఏ చెక్ పోస్టుల్లో అడ్డగోలుగా అధికారులు, సిబ్బంది వ‌సూళ్ల‌కు పాల్ప‌డుతున్న‌ట్లుగా సామాన్య ప్ర‌జ‌లు, వాహ‌న‌దారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఏసీబీ అధికారులు ఏక కాలంలో దాడులు నిర్వ‌హించారు. మొత్తం 12 చోట్ల దాడులు నిర్వ‌హించిన అధికారులు రూ.4ల‌క్ష‌ల 18వేల 880ను స్వాధీనం చేసుకున్నారు. అధికారులు దాడులు నిర్వ‌హించిన చెక్ పోస్టుల్లో తెలంగాణ‌-ఆంధ్ర‌ప్ర‌దేశ్ అంత‌రాష్ట్ర స‌రిహ‌ద్దు ప్రాంత‌మైన న‌ల్గొండ జిల్లాలోని విష్ణుపురం (వాడేప‌ల్లి), సూర్య‌పేట జిల్లాలోని కోదాడ చెక్ పోస్టు, తెలంగాణ‌-క‌ర్ణాట‌క స‌రిహ‌ద్దులోని నారాయ‌ణ‌పేట జిల్లాలోని కృష్ణ అంత‌రాష్ట్ర‌చెక్ పోస్టు, తెలంగాణ‌- మ‌హారాష్ట్ర స‌రిహ‌ద్దు ప్రాంత‌మైన ఆదిలాబాద్ జిల్లాలోని బోర‌జ్ అంత‌రాష్ట్ర చెక్ పోస్టు, నిర్మ‌ల్ జిల్లాలోని బైంసా చెక్ పోస్టు, అసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి చెక్‌పోస్టు, కామారెడ్డి జిల్లా మ‌ద్నూర్ మండ‌లంలోని స‌లాబ‌త్పూర్‌, పెందూర్తి చెక్‌పోస్టు, సంగారెడ్డి జిల్లాలోని జ‌హీరాబాద్ చెక్ పోస్టు, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలోని పాల్వంచ‌, అశ్వారావుపేట, ఖ‌మ్మం జిల్లాలోని ముత్తుగూడెం(పెనుబ‌ల్లి)లు ఉన్నాయి.

బోరజ్ చెక్‌పోస్టులో రూ.1.26వేల ప‌ట్టివేత‌

ఆదిలాబాద్ జిల్లా బోరజ్ అంతర్రాష్ట్ర రవాణా శాఖ చెక్‌పోస్టు రాత్రి 12 గంటల నుంచి ఉదయం వరకు సోదాలు నిర్వహించిన అధికారులు పెద్ద మొత్తంలో వ‌సూళ్ల‌కు పాల్ప‌డుతున్న‌ట్లుగా గుర్తించారు.ఏసీబీ అధికారుల‌ను గుర్తించిన సిబ్బంది పారిపోయేందుకు ప్ర‌య‌త్నించిన‌ట్లుగా తెలుస్తోంది. సిబ్బంది నుంచి రూ.1.26 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.అలాగే కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సలాబత్ పూర్ ఆర్టీఏ చెక్ పాయింట్ వద్ద ఏసీబీ అధికారులు అర్ధరాత్రి సోదాలు నిర్వహించారు. వాహ‌న‌దారుల నుంచి వ‌సూలు చేసిన‌ట్లుగా గుర్తించిన అధికారులు సిబ్బందిని రూ. 36 వేలను స్వాధీనం చేసుకున్నారు.

చెక్ పోస్టులు ఎత్తేసినా.. వ‌సూళ్ల కోస‌మే కొన‌సాగింపు..!!

చెక్​పోస్టుల తొలగింపు వల్ల వాహనాల సగటు వేగం పెంచ‌డంతో పాటు.. ట్రాఫిక్​ సమస్యను త‌గ్గించే ల‌క్ష్యంతో చెక్ పోస్టులను రాష్ట్ర ప్ర‌భుత్వం ఎత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వం అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులను తొలగిస్తూ ఆగ‌స్టు నెల‌లోనే ఉత్తర్వులు జారీ చేసింది. అంతర్రాష్ట్ర సరిహద్దు ఉండే జిల్లాలో ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం కొంతమంది రవాణా శాఖ అధికారులకు మాత్రం మింగుడు పడటం లేదు. చెక్‌పోస్టుల్లో ఎంవీఐ(మోటార్ వెహికల్ ఇన్​స్పెక్టర్), ఏఎంవీఐలతోపాటు కానిస్టేబుల్స్, సిబ్బంది 24 గంటల పద్ధతిలో పనిచేస్తుంటారు. అయితే ఇక్కడ అందించే సేవలన్నీ ఇకపై ఆన్‌లైన్‌లోనే సమకూర్చాలని నిర్ణయించారు. త‌ద‌నుగుణంగానే సర్వర్‌లో మార్పులు చేశారు. అయితే ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీచేసినా ఆర్టీఏ అధికారులు మాత్రం త‌నిఖీల పేరుతో వాహ‌న‌దారుల‌ను ఇబ్బందుల పాలు చేయ‌డ‌మే కాకుండా వ‌సూళ్ల‌కు పాల్ప‌డుతున్నారు. తాజాగా ఫిర్యాదులు వెల్లువెత్త‌డంతో ఏసీబీ త‌నిఖీలు చేప‌ట్ట‌డం గ‌మనార్హం.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎల్‌నినోను ఎదుర్కొంటాం

ఎల్‌నినోను ఎదుర్కొంటాం విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు రానివ్వం! డిమాండ్‌కు అనుగుణంగా పంపిణీ వ్యవస్థ బలోపేతం ఎన్‌పీడీసీఎల్‌...

పేదలకు ఇళ్లు.. రైతులకు రహదారులు

పేదలకు ఇళ్లు.. రైతులకు రహదారులు రెండో విడతలో మరో 1,100 ఇందిరమ్మ ఇళ్లు పొలాల...

తుమ్మిడిహెట్టిపై మ‌హారాష్ట్ర సానుకూలం!

తుమ్మిడిహెట్టిపై మ‌హారాష్ట్ర సానుకూలం! 152 మీటర్ల ఎత్తు ప్రతిపాదనపై పునఃపరిశీలనకు సీఎం ఫ‌డ్న‌వీస్‌...

మెడికవర్‌పై ఉన్న శ్రద్ధ.. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులపై ఏదీ?

మెడికవర్‌పై ఉన్న శ్రద్ధ.. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులపై ఏదీ? 17 వేల మంది ఉద్యోగుల...

కాంగ్రెస్‌ తెచ్చిన కరువు!

కాంగ్రెస్‌ తెచ్చిన కరువు! దేవాదుల, కల్వకుర్తి నుంచి ఎందుకు నీళ్లు ఎత్తడం లేదు? తమ్మిడిహట్టి...

కరువును వదిలి ఢిల్లీ పర్యటనలా?

కరువును వదిలి ఢిల్లీ పర్యటనలా? ఖర్గే వ్యాఖ్యలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం ఓటర్ల ప్రత్యేక...

బౌద్ధ స్తూపానికి పూర్వ వైభవం!

బౌద్ధ స్తూపానికి పూర్వ వైభవం! అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక కేంద్రంగా నేలకొండపల్లి 10 రోజుల్లో...

రేడియ‌ల్ రోడ్ టెండ‌ర్ల‌లో అక్ర‌మాలు

రేడియ‌ల్ రోడ్ టెండ‌ర్ల‌లో అక్ర‌మాలు రోడ్‌–2 ప్రాజెక్టులో ఆర్థిక అవకతవకలు జ‌రిగాయి బినామీల‌కు కాంట్రాక్ట‌ర్ల‌కు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.