epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రియ‌ల్ వ్యాపారి ఆగ‌డాలు.. అధికారి అండ‌దండ‌లు

రియ‌ల్ వ్యాపారి ఆగ‌డాలు.. అధికారి అండ‌దండ‌లు
చేసేది అక్ర‌మ దందా..ప్ర‌శ్నిస్తే బెదిరింపులు..!
అనుమ‌తులున్నాయ‌ని బెదిరింపులు
ధ‌ర్మ‌సాగ‌ర్ మండ‌లంలో రియ‌ల్ వ్యాపారి లీల‌లు
ప‌ద‌కొండు ఎక‌రాల్లో అక్ర‌మ వెంచ‌ర్‌
అందులోనూ ఎక‌రం భూమి వివాదంలోనే
య‌థేచ్చ‌గా ప్లాట్ల క్ర‌య విక్ర‌యాలు
ప్ర‌భుత్వ ఆదాయానికి భారీగా గండి
అమాయ‌క ప్ర‌జ‌ల‌ను బురిడీకొట్టిస్తున్న య‌జ‌మాని
అక్ర‌మ దందాకు రెవెన్యూ అధికారి స‌హ‌కారం !
కాక‌తీయ వ‌రుస క‌థ‌నాల‌తో క‌ల‌క‌లం
వెంచ‌ర్ య‌జ‌మానికి నోటీసులు జారీచేసిన కుడా
ఐదు రోజుల్లో అనుమ‌తి పొందాల‌ని ఆదేశం
వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బాధితుల డిమాండ్‌
నాన్ లేఔట్ వెంచ‌ర్‌పై కాక‌తీయ ప్ర‌తినిధికి ఫిర్యాదులు

కాక‌తీయ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : హ‌న్మ‌కొండ జిల్లా ధ‌ర్మ‌సాగ‌ర్ మండ‌లం ఎల్కుర్తిలోని అక్ర‌మ వెంచ‌ర్ బాగోతంపై కాక‌తీయ ప‌త్రిక‌లో ప్ర‌చురిత‌మ‌వుతున్న వ‌రుస క‌థ‌నాలు జిల్లాలో సంచ‌ల‌నంగా మారాయి. ఇటు కుడా.. అటు రెవెన్యూ అధికారుల్లో క‌ల‌కలం రేపుతున్నాయి. జాతీయ ర‌హ‌దారికి స‌మీపంలో 11 ఎక‌రాల్లో ఎలాంటి అనుమ‌తులు లేకుండా వ్య‌య‌సాయ భూమిని ద‌ర్జాగా ప్లాట్లు చేసి అమ్ముతున్నారు. అందులో ఎక‌రం వివాదంలోనే ఉండ‌గా.. ఎలాంటి డీటీసీపీ పర్మిషన్ లేకుండా.. కనీసం నాలా కన్వర్షన్ చేసుకోకుండా వెంచర్ చేసి అమాయకులకు అంటగడుతున్నాడు స‌ద‌రు య‌జ‌మాని. ఈ అక్ర‌మ దందాకు మండ‌లంలోని రెవెన్యూశాఖ‌లోని ఓ కీల‌క అధికారి పూర్తి స‌హాయ స‌హకారాలు అందిస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఈ విష‌యాన్ని కాక‌తీయ ప‌త్రిక వెలుగులోకి తేవ‌డంతో స్పందించిన కుడా అధికారులు గురువారం వెంచ‌ర్‌ను సంద‌ర్శించి ఓన‌ర్‌కు నోటీసులు అంద‌జేశారు. 5 రోజుల్లో అనుమ‌తులు పొందాల‌ని ఆదేశాలు జారీచేశారు. లేక‌పోతే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. అయితే.. నోటీసులు అందుకోడానికి తొలుత స‌సేమిరా అన్న య‌జ‌మాని.. త‌న‌కు అధికార పార్టీ నాయ‌కుల స‌పోర్ట్ ఉంద‌ని.. ఎవ‌రూ ఏం చేయ‌లేర‌ని ఆఫీస‌ర్ల‌ను సైతం బెదిరించారు. అంతేగాక‌.. అక్ర‌మ వెంచ‌ర్ వ్య‌వ‌హారాన్ని బ‌ట్ట‌బ‌య‌లు చేసిన విలేక‌రికి ఫోన్‌లో వార్నింగ్ ఇచ్చారు. ఈక్ర‌మంలోనే అక్ర‌మ వెంచ‌ర్‌కు సంబంధించి స్థానికుల నుంచి వ‌రుస‌గా ఫిర్యాదులు అందుతుండ‌టం గ‌మ‌నార్హం.

ఇవీ నిబంధ‌న‌లు..

వ్యవసాయ భూమిని రియల్ ఎస్టేట్ వెంచర్‌గా మార్చి ఇండ్ల స్థలాలుగా అమ్మాలంటే ఎకరానికి రూ.1.15 ల‌క్ష‌ల చొప్పున ప్రభుత్వానికి చెల్లించాలి. కలెక్టర్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. తర్వాత వెంచర్‌లోని మొత్తం ప్లాట్లలో 15శాతం మున్సిపల్ కమిషనర్ పేరుమీద మార్టిగేజ్ చేయాలి. 10శాతం భూమిని పార్కు కోసం కేటాయించాలి. కావలసిన కరెంట్ స్తంభాలు పాతి, మురుగు కాలువలు తవ్వించి, తాగునీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఆ తర్వాతే ఈ ప్లాట్లను కమిషనర్ నుంచి వెంచర్ యజమానులకు తిరిగివస్తాయి. కానీ ఎల్కుర్తిలోని 11 ఎక‌రాల వెంచ‌ర్ ఓన‌ర్ మాత్రం ఎలాంటి అనుమ‌తులు పొంద‌కుండానే త‌న‌కు అన్ని ప‌ర్మిష‌న్లు ఉన్నాయ‌ని బుకాయిస్తూ.. త‌ప్పుడు ప‌త్రాలు చూపుతూ య‌థేచ్చ‌గా ప్లాట్లు క్ర‌య‌విక్ర‌యాలు జ‌రుపుతున్నాడు.

ఆందోళ‌న‌లో బాధితులు

మొత్తం 11 ఎక‌రాల వ్యవసాయ భూమిలో స్థానిక రెవెన్యూ కార్యాల‌యంలోని ఓ కీల‌క అధికారి స‌హ‌కారంతో కొంత‌మేర మాత్ర‌మే నాలా క‌న్వ‌ర్ష‌న్ చేయించి ప్లాట్లు చేసి అమ్ముకుంటున్నాడ‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. వెంచ‌ర్‌లో రోడ్డు కోసం కొంత జాగా తీసి మొరంపోసి హద్దురాళ్లు పాతి వీటినే ప్లాట్లుగా ప్రచారం చేసి గజాల లెక్క‌న ఎక్కువ రేటుకు అమ్ముకుంటూ ద‌ర్జాగా సొమ్ము చేసుకుంటున్నాడ‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. సొంత ప్లాట్లలో ఇంటి పర్మిషన్ కోసం వెళ్ళిన సామాన్యుల నుంచి సవా లక్ష నిబంధన పేరుతో లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తున్న ఆఫీసర్లు అక్రమ వెంచర్లను మాత్రం చూసీచూడనట్లుగా వదిలేస్తుండ‌టం వెనుక ఆంత‌ర్య‌మేంట‌న్న‌ది అంతుబ‌ట్ట‌డంలేదు. ఇప్పటికే పలువురు కొనుగోలుదారులు అడ్వాన్స్‌లు చెల్లించగా, ఇప్పుడు వెంచ‌ర్‌కు అనుమ‌తి లేద‌ని తెలిసి తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు బాధితులు చెబుతున్నారు.

రెవెన్యూ అధికారిపైనే ఆరోప‌ణ‌లు !

ధ‌ర్మ‌సాగ‌ర్ మండ‌లంలోని రెవెన్యూ కార్యాల‌యంలో విధులు నిర్వ‌హిస్తున్న ఓ కీల‌క ఆఫీస‌ర్‌పై అవినీతి ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ కార్యాలయంలోని స‌ద‌రు అధికారి అండతోనే మండలంలో అక్రమ వెంచర్లు పుట్టుకొస్తున్నాయని, ఎల్కుర్తి వెంచర్ యజమానులకు కూడా ఆయ‌న సపోర్ట్ దండిగానే ఉందని విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ ర‌హ‌దారికి స‌మీపంలో 11 ఎకరాల్లో అక్ర‌మ వెంచర్ చేయ‌డం.. కుడా నుంచి ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండానే, తీసుకున్నట్లు తప్పుడు పత్రాలు చూపిస్తూ సదరు అధికారి సహకారంతో రిజిస్టేషన్స్ చెయ్యడం వెనుక ఆంత‌ర్యం ఏంట‌న్న ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. పైగా మండ‌ల‌కేంద్రానికి కూతవేటు దూరంలోనే ద‌ర్జాగా ప్లాట్లు అమ్మకాలు జరుగుతున్నా.. సంబంధిత అధికారుల మొద్దు నిద్రపై ప్రజలు మండిపడుతున్నారు. ఈ అక్రమ వెంచర్ వెనుక రెవెన్యూ అధికారుల ప్రమేయం ఉందని బహిరంగంగానే చెబుతున్నారు. అంతేకాదు.. ప్ర‌భుత్వ నిబంధ‌ల‌న‌కు పాత‌రేసి కాసుల‌కు క‌క్కుర్తిప‌డి వ్య‌వ‌సాయ భూముల‌ను రియ‌ల్ వెంచ‌ర్లుగా మార్చేందుకు ఇష్టారాజ్యంగా అనుమ‌తి ఇస్తున్నార‌ని మండిప‌డుతున్నారు.

కలెక్టర్‌ దృష్టి సారిస్తారా ?

ఎల్కుర్తిలోని అక్ర‌మ వెంచ‌ర్ వ్య‌వ‌హారంపై ప‌లువురు జిల్లా క‌లెక్ట‌ర్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు స‌మాచారం. అక్రమ దందాలో రెవెన్యూ అధికారుల పాత్ర ఉంటే విచారణ జరిపి, సంబంధిత ఆఫీస‌ర్ల‌పై కఠిన చర్యలు తీసుకోవాలి అని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మండ‌లంలో అనుమ‌తిలేని వెంచ‌ర్ల‌పై క‌లెక్ట‌ర్ దృష్టిసారించాల‌ని కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

నాటు సారా స్థావరాలపై ఎక్సైజ్‌ దాడులు

నాటు సారా స్థావరాలపై ఎక్సైజ్‌ దాడులు 1,900 లీటర్ల చక్కెర పానకం ధ్వంసం 55...

‘నార్మల్ లేదు… బ‌ల‌వంతంగా ప‌వ‌ర్ పెట్రోల్‌..?

'నార్మల్ లేదు... బ‌ల‌వంతంగా ప‌వ‌ర్ పెట్రోల్‌..? పెట్రోల్ బంకుల తీరుపై వాహనదారుల ఆగ్రహం అధిక...

రూ.180 కోట్ల డ్రైనేజీ టెండర్‌లో భారీ గోల్‌మాల్..?

రూ.180 కోట్ల డ్రైనేజీ టెండర్‌లో భారీ గోల్‌మాల్..? సర్ధార్ రవీందర్ సింగ్ భూగర్భ మురుగునీటి...

వ‌రంగ‌ల్ సీపీగా శ్వేత

వ‌రంగ‌ల్ సీపీగా శ్వేత సైబరాబాద్ క‌మిష‌న‌రేట్‌ ట్రాఫిక్ విభాగానికి సన్‌ప్రీత్ సింగ్ బ‌దిలీ...

ధాన్యం కాంట్రాక్టర్ల అసమర్థతకు మేం బ‌లికావాలా..?

ఇసుక లారీలను బలవంతంగా ఆపడం సరికాదు ధాన్యం కాంట్రాక్టర్ల అసమర్థతకు మేం బ‌లికావాలా..? వేధింపులు...

ఖమ్మంలో మంత్రి తుమ్మలకు మచ్చ తెచ్చే పని.. పీవీ కుమార్తె ఫిర్యాదుతో సీరియస్ అయిన అమాత్యుడు!

మంత్రి తుమ్మ‌ల‌కు మ‌చ్చ తెచ్చే ప‌ని 40ఏళ్ల మంత్రి అనుభ‌వాన్ని గుర్తించేలా పైలాన్...

బావిలో పడి తండ్రి–కొడుకు మృతి

బావిలో పడి తండ్రి–కొడుకు మృతి మంత్రి సీతక్క దిగ్బ్రాంతి కాకతీయ, ములుగు ప్రతినిధి :...

హత్య కేసులో నలుగురికి జీవిత ఖైదు

హత్య కేసులో నలుగురికి జీవిత ఖైదు సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి సంచలన...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.