epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సమ్మక్క, సారలమ్మ జాతరకు రూ.236 కోట్ల మాస్టర్ ప్లాన్..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే వనదేవతల సమ్మక్క-సారలమ్మ మహాజాతర ఖ్యాతి ఖండాంతరాలు దాటాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వెల్ఫేర్ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఈసారి జాతరను గతం కంటే మరింత ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.

రాష్ట్ర సచివాలయంలో బుధవారం మేడారం మాస్టర్ ప్లాన్‌పై సమీక్షా సమావేశం జరిగింది. మంత్రులు సురేఖ, సీతక్క, లక్ష్మణ్ కుమార్‌తో పాటు ఎండోమెంట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, ములుగు కలెక్టర్ దివాకర్ తదితరులు పాల్గొన్నారు. రెండు కుంభమేళాలను నిర్వహించిన సంస్థకే మాస్టర్ ప్లాన్ రూపకల్పన బాధ్యతలు అప్పగించినట్టు అధికారులు తెలిపారు. మేడారం మహా జాతరలోపు అన్ని పనులు పూర్తి చేయాలని మంత్రులు ఆదేశించారు.

పూజారుల సూచనల మేరకు ఆలయ ప్రాంగణ డిజైన్లలో మార్పులు చేయాలని, అమ్మవారి గద్దెల ఎత్తు పెంచి, సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలు ఒకే వరుసలో ఉండేలా చూడాలని సూచించారు. భక్తులకు అసౌకర్యం లేకుండా దర్శన ఏర్పాట్లు చేయాలని మంత్రులు స్పష్టం చేశారు. జాతర సందర్భంగా వలంటీర్లను నియమించి సేవలు అందించాలని, వాహనాల నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

క్రౌడ్ మేనేజ్‌మెంట్ కోసం ఏఐ కెమెరాలు, బ్యాటరీ వాహనాలు, త్రాగునీరు వంటి సౌకర్యాలు కల్పించాలని సూచించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా తినుబండారాలు, విశ్రాంతి సదుపాయాలు కల్పించాలని, అవసరమైతే అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లను ఉపయోగించాలని నిర్ణయించారు.
జాతర అభివృద్ధికి మొత్తం రూ. 236.2 కోట్లతో మాస్టర్ ప్లాన్ రూపొందించారు.

అందులో.. గద్దెల అభివృద్ధికి రూ. 58.2 కోట్లు, కళాకృతి పనులకు రూ. 6.8 కోట్లు, జంపన్న వాగు అభివృద్ధికి రూ. 39 కోట్లు, భక్తుల వసతి కోసం రూ. 50 కోట్లు, రోడ్ల విస్తరణ, అభివృద్ధికి రూ. 52.5 కోట్లు, మిగిలినవి ఇతర ఖర్చుల కోసం కేటాయించారు. జాతర విజయవంతం కావడానికి రహదారుల విస్తరణ కీలకమని మంత్రులు పేర్కొన్నారు.

ఇందుకోసం మేడారం-ఊరట్టం, మేడారం -కన్నెపల్లి మార్గాలతో పాటు మరో నాలుగు మార్గాలను విస్తరించాలని అధికారులు తెలిపారు. మాస్టర్ ప్లాన్ పనులను రెండు ఫేజ్‌లలో పూర్తి చేస్తామని వివరించారు. మేడారం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ మేడారం జాతరకు రూ. 150 కోట్లు కేటాయించామని, అవసరమైతే మరిన్ని నిధులు కేటాయిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. పూజారుల భాగస్వామ్యంతో జాతర అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కరెంటు లేక రైతుల అవస్థలు

కరెంటు లేక రైతుల అవస్థలు కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండుతున్నాయి ఎల్‌నినో ముప్పు...

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌ రూ.650 కోట్ల బొగ్గు నిధుల మళ్లింపుపై సోదాలు! హైదరాబాద్‌లో ఏఎంఆర్‌...

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..!

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..! నాపై వార్తలు రాసిన వాళ్లపై కేసులు పెట్టండి ‘కాకతీయ’ స్టాఫర్‌పై...

మా కుటుంబాన్ని వేధించొద్దు

మా కుటుంబాన్ని వేధించొద్దు సుమంత్ విష‌యంలో వాస్తవాలను ప‌రిశీలించండి 20 రోజులుగా మా కుటుంబంపై...

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.