epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

డ్రగ్స్ నిర్మూలనలో దేశంలోనే ముందంజలో తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి

కాకతీయ, ఢిల్లీ : తెలంగాణ అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికలు, పెట్టుబడులు, యువత నైపుణ్యాలు, క్రీడలు, పర్యావరణం, రవాణా రంగాలపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీలో జరిగిన పబ్లిక్ ఎఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా (పి ఏ ఎఫ్ ఐ) 12వ వార్షిక సదస్సులో కీలక ప్రసంగం చేశారు. రాష్ట్ర పరిపాలనకు రాజకీయ సంకల్పం అవసరమని, భవిష్యత్ తరాల కోసం అవకాశాలు సృష్టించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. దేశంలోనే కొత్త రాష్ట్రం అయినా తెలంగాణకు, హైద్రాబాద్‌కు గొప్ప చరిత్ర ఉందని గుర్తుచేశారు.

రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం తెలంగాణ విజన్ డాక్యు మెంట్ – 2047 రూపొందించామని తెలిపారు. రాష్ట్రాన్ని కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్ ప్రాంతాలుగా విభజించి అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. కోర్ అర్బన్ ప్రాంతాల్లో కాలుష్య కారక పరిశ్రమలను నగరానికి వెలుపలికి తరలిస్తున్నామని చెప్పారు. మెట్రో రైలును 70కి.మీ.ల నుంచి 150కి.మీ.లకు విస్తరించి, రోజూ ప్రయాణికులను 5 లక్షల నుంచి 15 లక్షల వరకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. మూసీ నదిని సబర్మతి తీరంలా అభివృద్ధి చేయాలని, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం, ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహం, రీజినల్ రింగ్ రోడ్, విమానాశ్రయం నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ అనుసంధానం వంటి ప్రాజెక్టులను అమలు చేస్తున్నామని తెలిపారు.

పెట్టుబడిదారులను తెలంగాణలో పెట్టుబడులకు ఆహ్వానిస్తూ.. మీ పెట్టు బడులకు పూర్తి భద్రత ఇస్తాం, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లుగా మారండి అని పిలుపునిచ్చారు. డ్రగ్స్ నియంత్రణలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని గర్వంగా తెలిపారు. యువత నైపుణ్యాభివృద్ధి కోసం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, క్రీడల్లో ప్రతిభ పెంపు కోసం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ స్థాపించినట్లు చెప్పారు. 2025, డిసెంబర్ 9న తెలంగాణ విజన్ డాక్యుమెంట్ విడుదల చేస్తాం అని ప్రకటించారు.

బల్క్ డ్రగ్స్ ఉత్పత్తిలో 40% వాటా తెలంగాణ దేనని, వ్యాక్సిన్ తయారీలో హైద్రాబాద్ ప్రపంచవ్యాప్తంగా ముందంజలో ఉందని గుర్తుచేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ పై వ్యాఖ్యానిస్తూ.. ట్రంప్ ఒక రోజు మోదీ నా ఫ్రెండ్ అంటాడు, మరో రోజు సుంకాలు వేస్తాడు. అలాంటి ట్రంప్ ఒకప్పుడు తెలంగాణలో కూడా ఉన్నాడు, కానీ ప్రజలు పక్కన పెట్టారు అని ఎద్దేవా చేశారు. రాత్రి వచ్చిన ఆలోచన తెల్లారే అమలు కాదు, భవిష్యత్ దృష్టితోనే తెలంగాణను తీర్చిదిద్దుతాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌ హసన్‌పర్తిలో ముఠా గుట్టురట్టు.. 56...

బాధ్యతాయుతమైన జర్నలిజంతోనే సమాజానికి మేలు

బాధ్యతాయుతమైన జర్నలిజంతోనే సమాజానికి మేలు వార్త ప్రచురించే ముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలి ప్ర‌జాప్ర‌యోజ‌నాన్ని దృష్టిలో...

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో 22 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ..

కమిషనరేట్‌లో భారీగా సీఐల బదిలీలు 22 మంది ఇన్‌స్పెక్టర్లకు స్థానచలనం కీలక పోలీస్‌స్టేషన్లకు కొత్త...

ములుగు ఇసుక క్వారీల్లో వివాదం

ములుగు ఇసుక క్వారీల్లో వివాదం త‌న‌పై హ‌త్యాయ‌త్నం జ‌రిగిందంటూ బీఆర్ఎస్ చ‌క్ర‌పాణి ఆరోప‌ణ‌ మూడు...

దమ్ముంటే రేవూరితో రాజీనామా చేయించి రండి

దమ్ముంటే రేవూరితో రాజీనామా చేయించి రండి రేవంత్‌ వచ్చినా.. రేవూరి తాత వచ్చినా...

వాహ్‌.. కమిషనర్‌ జీ! చిన్నారి వైద్యానికి అండగా అభిషేక్‌ అగస్త్య

వాహ్‌.. కమిషనర్‌ జీ! చిన్నారి వైద్యానికి అండగా అభిషేక్‌ అగస్త్య రూ.14 లక్షల సాయం...

స్వాంతంత్య్ర వేడుకలకు దూరంగా విద్యార్థులు

స్వాంతంత్య్ర వేడుకలకు దూరంగా విద్యార్థులు సెయింట్‌ థెరిస్సా పాఠశాలపై తల్లిదండ్రుల ఆగ్రహం బస్సు ఫీజులు...

వ్యూహకర్త కాదు… విజేత..!

వ్యూహకర్త కాదు... విజేత..! బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ సంచలనం ప్రత్యక్ష రాజకీయాల తొలి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.