పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవబోతున్నాం!
ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలిస్తే రాబోయే ఎన్నికల్లో అధికారం మనదే
రేవంత్ రెడ్డివి అన్నీ లంగా మాటలే: మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
కాకతీయ, గీసుగొండ: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించబోతోందని, ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలిస్తే రాబోయే ఎన్నికల్లో అధికారం తమదేనని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలన్నీ ఆచరణకు నోచుకోవడం లేదని విమర్శించారు. ఆదివారం గీసుగొండ మండలం పీడీఆర్ గార్డెన్స్‌లో వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియపై నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలతో పాటు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. రైతులకు సాగునీరు, విద్యుత్ అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్లను నింపాలని, రైతుల సాగు, తాగునీటి అవసరాలను తీర్చాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుబంధు, ఉచిత విద్యుత్ వంటి పథకాలతో రైతులకు అండగా నిలిచామని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను పట్టభద్రుల దృష్టికి తీసుకెళ్లి, నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించాలని, ఇప్పటికే నమోదైన వారు ఓటరు జాబితాలో తమ వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి ఓటరు నమోదు ప్రక్రియను విజయవంతం చేయాలని,ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల బిఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి,ఎమ్మెల్సీ ఎన్నికల పరకాల ఇంచార్జ్ సాంబారి సమ్మారావు, నిమ్మగడ్డ వెంకన్న, గీసుకొండ మాజీ జడ్పిటిసి పోలీసు ధర్మారావు, మండల నాయకులు చల్ల వేణుగోపాల్ రెడ్డి,జయపాల్ రెడ్డి,బోడకుంట్ల ప్రకాష్, ముంత రాజయ్య యూత్ నాయకులు సిరిసే శ్రీకాంత్, పెండ్లి పురుషోత్తం,మంద రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

