పర్వతగిరి మండలంపర్వతగిరి మండలంలో మహిళ హత్య
హర్జ తండాకు చెందిన పాత్య పూలమ్మ మృతి
కాకతీయ, పర్వతగిరి:వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం గడ్డపార తండా శివారులోని హర్జ తండాకు చెందిన పాత్య పూలమ్మ ఆదివారం హత్యకు గురైనట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
మృతురాలు పాత్య పూలమ్మకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆమె హత్యకు గురికావడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.హత్యకు గల కారణాలు, ఘటన ఎలా జరిగింది, నిందితుల వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

