epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

Future City: భవిష్యత్తు అంతా ఫ్యూచర్ సిటీలోనే ఉంది: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

కాకతీయ, తెలంగాణ బ్యూరో: ఐటీ, ఫార్మా, వ్యవసాయ రంగానికి సంబంధించిన పరిశ్రమలు, అంతర్జాతీయ స్టేడియం వంటి వాటితో అద్భుతమైన నగరంగా ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరగబోతోందని.. భవిష్యత్తు అంతా ఇక్కడే ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఈ దేశ భవిష్యత్తు అంతా ఈ ఫ్యూచర్ సిటీ చుట్టే తిరగబోతుందేమో అన్న భావన తనకు కలిగిందని డిప్యూటీ సీఎం అన్నారు. ఎలివేటెడ్ కారిడార్ లతో అద్భుతమైన రోడ్లు, మధ్యన మెట్రో రైలు దేశంలోని ఏ నగరానికి ఈ వ్యవస్థ లేదు అన్నారు.

హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీని కలుపుతూ రోడ్డు వేయడం, ఫ్యూచర్ సిటీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని కలుపుతూ బందర్ పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు ఢిల్లీ వెళ్లినప్పుడు కేంద్ర మంత్రి తో మాట్లాడి మంజూరు చేయించుకుని వచ్చానని సీఎం రేవంత్ రెడ్డి చెబుతుంటే.. ఆ పనులకు సంబంధించిన ఫోటోలు చూస్తుంటే చాలా సంతోషం వేసింది అన్నారు. ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరుకు రోడ్డు ఈ పనులన్నీ చూస్తుంటే ఇది ఒక మహా అద్భుతంగా మారే నగరంగా రూపు దిద్దుకోబోతుందని అన్నారు.

హైదరాబాద్ ఓల్డ్ సిటీ కాదు ఒరిజినల్ సిటీ అని దీన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నామని నిన్న సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించి తెల్లవారుజామునే భవిష్యత్తు నగరానికి శంకుస్థాపన చేసే కార్యక్రమాన్ని చేపట్టారని వివరించారు. 436 ఏళ్ల కిందట కులీ కుతుబ్ షా ల పాలనా కాలంలో ఇరాన్ ఆర్కిటెక్ట్ హైదరాబాద్ నగరానికి పునాదులు వేశారని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. ఆనాటి రాజ్యం అవసరాలకు దక్షిణ మూసి అనువైన ప్రాంతంగా గుర్తించి 436 సంవత్సరాల క్రితం సుసంపన్నమైన, ప్రపంచ పటంలో స్థానం దక్కించుకున్న హైదరాబాద్ నగరం రూపుదిద్దుకుంది అన్నారు.

ఈ నగర నిర్మాణ సమయంలో కులీకుతుబ్షా దేవుని ప్రార్థిస్తూ దేవా నదులన్నిటిని చేపలతో నింపినట్టు నా నగరాన్ని జనాభాతో నింపండి అని ప్రార్థించాడు అని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. కులి కుతుబ్ షా హైదరాబాద్ నగరాన్ని ఎలా నిలబెట్టారో.. ఫ్యూచర్ సిటీని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం ఈరోజు శంకుస్థాపన చేస్తూ పిలుపునిచ్చింది అన్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ తో కూడిన అనేక కార్యక్రమాలతో ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరుగుతోంది ఆశీర్వదించమని సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానంతో అంతా కదిలి వచ్చాం అన్నారు. వారి ఆహ్వానంతో కులీ కుతుబ్ షా నాటి రోజులు గుర్తుకు వస్తున్నాయి అన్నారు. ఫ్యూచర్ సిటీ దేశానికే కాదు ప్రపంచానికే తలమానికం కాబోతోంది. ఈ సిటీ ద్వారా ఈ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప వైద్య, విద్యాసంస్థలు రాబోతున్నాయి అన్నారు.

పనుల కోసం దేశ, విదేశాల్లో తిరిగి మంచి శాంతి భద్రతలతో స్థిర నివాసం ఎక్కడ అంటే ఫ్యూచర్ సిటీ అని చెప్పుకునే భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనడం తనకు సంతోషంగా ఉంది అన్నారు. గొప్ప సంకల్ప బలంతో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం మొదలు పెట్టిన ఫ్యూచర్ సిటీ నిర్మాణ కార్యక్రమం త్వరితగతిన పూర్తి కావాలని ఆ దేవుని కోరుకుంటున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ సిటీ నిర్మాణంలో ఈ పరిసర ప్రాంత ప్రజలు పాల్గొనాలని, చరిత్రలో నిలిచిపోయే నగరం దేశానికే కాదు ప్రపంచానికే తలమానికం అన్నారు.

 

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కరెంటు లేక రైతుల అవస్థలు

కరెంటు లేక రైతుల అవస్థలు కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండుతున్నాయి ఎల్‌నినో ముప్పు...

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌ రూ.650 కోట్ల బొగ్గు నిధుల మళ్లింపుపై సోదాలు! హైదరాబాద్‌లో ఏఎంఆర్‌...

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..!

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..! నాపై వార్తలు రాసిన వాళ్లపై కేసులు పెట్టండి ‘కాకతీయ’ స్టాఫర్‌పై...

మా కుటుంబాన్ని వేధించొద్దు

మా కుటుంబాన్ని వేధించొద్దు సుమంత్ విష‌యంలో వాస్తవాలను ప‌రిశీలించండి 20 రోజులుగా మా కుటుంబంపై...

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.