epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ప్రతి రైతుకు కాంగ్రెస్ రూ. 75 వేలు బాకీ..

  • ప్రతి మహిళకు బాకీపడ్డ రూ. 44 వేలిచ్చి ఓట్లు అడగాలి
  • తాగుబోతుల తెలంగాణగా మారుస్తున్నారు
  • అబద్ధపు హామీలతో నమ్మించి గొంతు కోసిండ్రు
  • గ్యారంటీలకు టాటా చెప్పిండు.. లంక బిందెలకు వేట పట్టిండు

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : తెలంగాణ‌లోని ప్రతి రైతుకు కాంగ్రెస్ పార్టీ రూ. 75 వేల రైతుబంధు బాకీ పడింద‌ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గ్యారంటీల‌కు టాటా చెప్పిండు.. లంకె బిందెల‌కు వేట‌ప‌ట్టిండు అని సెటైర్లు వేశారు. అబద్ధపు హామీలతో నమ్మించి గొంతు కోసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని ధ్వ‌జ‌మెత్తారు. సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ బాకీ కార్డు విడుదల కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని ప్ర‌సంగించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం బాకీ పడింది? ఒక్కొక్క మహిళకు ఎంత బాకీ పడింది? ఒక్కొక్క రైతుకు ఎంత బాకీ పడింది? ఒక్కొక్క ఇంటికి ఎంత బాకీ పడ్డదో తెలిసేలా బాకీ కార్డు విడుదల చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు.

అన్నీ ఎగొట్టుడే..

రైతుబంధు ఇప్పుడైతే రూ. 10, 000.. మేము వస్తే రూ. 15000 ఇస్తామన్నారు. పోయిన వానకాలం రైతు బంధు మొత్తానికే ఎగ్గొట్టిండు. యాసంగిలో మూడెకరాల వారికి ఇచ్చిండు మిగతా వాళ్లందరికీ ఎగ్గొట్టిండు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు ఉన్నాయని రూ. 12,000 ఇచ్చిండు. మిగతా మూడు వేలు ఎగ్గొట్టిండు. ప్రతి రైతుకు కాంగ్రెస్ పార్టీ రూ. 75 వేల రైతుబంధు బాకీ పడింది. రైతుబంధు రైతుకి ఇస్తాం. కౌలు రైతుకి ఇస్తామన్నారు. ఒక రూపాయి అయినా కౌలు రైతుకు ఇచ్చారా? అని ష‌రీష్ ప్ర‌శ్నించారు. పెద్ద రైతులకు మాత్రమే కేసీఆర్ రైతుబంధు ఇస్తున్నాడ‌ని అన్నాడు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు. 25 ఎకరాలు క‌లిగిన‌వాళ్లు మూడు శాతం మాత్రమే ఉన్నారు. 97 శాతం మంది రైతులు 10 ఎకరాలలోపే ఉన్నారు. కుర్చీలో కూర్చుంటే కేసీఆర్ చేసింది కరెక్ట్ అని రేవంత్ రెడ్డికి అర్థమైంది అని హ‌రీశ్‌రావు అన్నారు.

గ్యారంటీలకు చట్టబద్ధత లేదు

రూ.200 ఉన్న పెన్షన్‌ని కేసీఆర్ 2000 చేసిండు. కాంగ్రెస్ 4000 పెన్షన్ ఇస్తా అన్నది ఈరోజు వరకు లేదు. అత్తకు, కోడలు ఇద్దరికీ ఇస్తామన్నారు. ఇంటికొక మహిళకు రేవంత్ రెడ్డి రూ. 44 వేల బాకీ పడిండు. రూ. 44000 ఇచ్చినంకనే కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా ఓటు అడగాలి. రేవంత్ రెడ్డి సంతకం, భట్టి విక్రమార్క సంతకం పెట్టి గ్యారంటీ పేపర్లు పంచిర్రు. 100 రోజుల్లో ఇస్తామని చెప్పి 700 రోజులైనా ఇప్పటివరకు ఒక్క హామీ నెరవేర్చలేదు. మొదటి క్యాబినెట్‌లోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత తెస్తామన్నారు 30 క్యాబినెట్‌లైనా ఊసే లేదు అని హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు. 18 ఏళ్లు నిండిన ప్రతి అక్కకు చెల్లెకు మహాలక్ష్మి కింద రూ. 2,500 ఇస్తామన్నారు. మాట్లాడితే మహిళలను కోటీశ్వరులని చేస్తామంటారు. ఎవరైనా అయ్యారా? ఈ బాకీ కార్డు లోకల్ బాడీ ఎన్నికల్లో బ్రహ్మాస్త్రం. ఇది కాంగ్రెస్ పాలిట ఉరితాడు అవుతుంది అని హ‌రీశ్‌రావు తెలిపారు.

ఊరుకో మద్యం దుకాణం పెడతాడట

యూరియా బస్తాలు ఇచ్చే తెలివి లేదు కానీ ఊరుకో మద్యం దుకాణం పెడతాడట. మొత్తానికి తాగుబోతుల తెలంగాణ చేస్తా అంటున్నడు రేవంత్ రెడ్డి. తులం బంగారం ఏమైంది రేవంత్ రెడ్డి? కనీసం కల్యాణ లక్ష్మి చెక్కుల పైసలు ఇస్తలేవు. విద్యార్థులకు 5 లక్షల భరోసా ఏమైంద‌ని ప్ర‌శ్నించారు. విద్యార్థుల ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ 9 ఏళ్లలో రూ. 20వేల కోట్ల డబ్బు చెల్లించాడు కేసీఆర్. విద్యార్థులను నిర్లక్ష్యం చేసి ఒక రూపాయి ఇయ్యని దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. రెండేళ్లలో ఒక్క రూపాయి ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ డబ్బులు ఇవ్వలేదు అని హ‌రీశ్‌రావు దుయ్య‌బ‌ట్టారు. ఆరోగ్యశ్రీ డబ్బులు ఇవ్వ‌క‌పోవ‌డంతో దావఖానాలో సేవలు బంద్ అయ్యాయ‌ని మండిప‌డ్డారు. ఫ్యూచర్ సిటీ అని లేని సిటీకి ఆరు లైన్ల రోడ్ వేస్తాడట. ఉన్న రోడ్లను మాత్రం పట్టించుకోరంట. ఢిల్లీకి మూటలు కట్టడానికి, కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు తీసుకోవడానికి, బీహార్ ఎన్నికలకు పంపడానికి పైసలు ఉన్నాయి గానీ.. ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయడానికి పైసలు లేవా అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. గోదారి నీళ్లు కాళేశ్వరం ద్వారా కాలువల్లో పారుతుంటే కళ్ళుండి చూడలేని కబోదులు కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్ ప్రజలను ఇంత దగా చేస్తుందని, ఇంత మోసం చేస్తుందని ప్రజలకు వివరించాలి అని హ‌రీశ్‌రావు చెప్పారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.