epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ద‌స‌రా..! దావ‌త్ కా బాప్‌..!!

ద‌స‌రా..! దావ‌త్ కా బాప్‌
స‌రదాల ద‌సార‌కు ఈసారి ఎన్నిక‌ల హైప్
గ్రామ‌మే కుటుంబంగా మారిపోయే తెలంగాణ పండుగ‌
ఎన్నిక‌ల కోల‌హాలంతో ఈ సారి గ్రామాల్లో డ‌బుల్ ద‌స‌రే

కాకతీయ, స్పెషల్:  తెలంగాణ‌లో ద‌స‌రా అంటేనే ధూం ధాం..! ద‌స‌రా అంటే దావ‌త్‌.. దావ‌త్ అంటే ద‌స‌రా.. అన్న‌ట్లుగా ఉంటుంది. మాములుగా పండుగ‌ల స‌మ‌యాల్లో జ‌రిగే దావ‌త్‌ల‌కు.. ఈ పండుగ దావ‌త్ కా బాప్ అన్నమాట‌. తొమ్మ‌ది రోజుల బ‌తుక‌మ్మ పండుగ త‌ర్వాత వ‌చ్చే విజ‌య ద‌శ‌మిన జ‌రుపుకునే ద‌స‌రాకు తెలంగాణ‌లోని ఊళ్ల‌న్నీ కోలాహ‌లంతో నిండిపోతుంటాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రాదాయాల‌కు నిద‌ర్శ‌నంగా ఉండే ద‌స‌రా పండుగ‌రోజున కంచంలో ముక్కా.. నోట్లో సుక్క ప‌డంది అది ద‌స‌రా ఎట్లావుతుందిరా..?! అంటూ ముస‌లోళ్లు నిలేసి అడుగుతుంటారు. ద‌స‌రా రోజున నాలిక‌కు బొక్క‌కూర రుచి తగ‌ల‌కుంటే..! సారా సుక్క ప‌డ‌కుంటే దాన్ని ద‌స‌రెందుకు అంట‌రా బై అంటూ స‌ర‌దాగా వ్య‌గ్య‌కీరిస్తారు. అవుమ‌ల్ల.. అందుకే ద‌స‌రా పండుగ అంటేనే సంతోషం.. సంబురం.. ఏడాదంతా ర‌ద్దీని ఒక్క దినం మ‌రించి తాగుతూ..తూగుతూ.. మ‌దినిండా ధైర్యం నింపుకుంటూ కొత్త ఆశ‌ల‌తో జీవితంలో ముందుకు సాగ‌డ‌మే..! ద‌స‌రా సందేశం అంటారు మ‌రికొంద‌రు. అందుకే ద‌సరా రోజున వేళ్ల మీద లెక్కించ‌గ‌లిగే సామాజిక వ‌ర్గాల కుటుంబాలు మిన‌హా ఆ రోజున‌ నీసు అండ‌ని ఇల్లు ఉండ‌దంటే అతిశేయోక్తి కాదు.

జ‌మ్మి చెట్టు కాడ అల‌య్ బ‌ల‌య్‌..

మిగ‌తా ఏ పండుగ‌ల‌కు సొంత ఊరికి రాకుండా ప‌ట్నంలోనే ఉండిపోయినా… ఈ పండుగ‌కు మాత్రం రెక్క‌లు క‌ట్టుకుని వాలిపోతుంటారు. ఎందుకంటే ఈ పండుగ‌కు స‌ర‌దాలు అలా ఉంటాయి మ‌రి. ఊరే కుటుంబంగా మారి చేసే వేడుక క‌నుక‌.. సొంతూరిని ఓ సారి క‌ళ్లారా చూసి వ‌ద్దామ‌ని వ‌స్తుంటారు. ఫ్రెండ్స్‌తో జ‌రుపుకునే దావ‌త్‌ల మ‌జా మాములుగా ఉండ‌దు మ‌రి. అందుకే ద‌స‌రాకు నెల రోజుల ముందు నుంచే పార్టీల‌కు, ప్ర‌య‌ణానికి ప్లానింగ్‌లు జ‌రిగిపోతుంటాయి. ఎక్క‌డెక్క‌డో స్థిర‌ప‌డిపోయిన వాళ్లంతా కూడా ద‌స‌రా రోజున జ‌మ్మిచెట్టు కాడ ప్ర‌త్య‌క్ష్య‌మ‌వుతుంటారు.

మ‌న‌మంతా ఒకే గ్రామ‌వాసులం అన్న ఫీలింగ్ వారి ముఖాల్లో తొనికిస‌లాడుతుంది. జ‌మ్మి ఆకు ఒక‌రికొక‌రు ఇచ్చుకుంటూ అల‌య్ బ‌ల‌య్ తీసుకుంటూ మ‌న‌స్ప‌ర్థాలను తొల‌గించుకుంటూ అనుబంధాల‌ను పెన‌వేసుకుంటుంటారు..! గుమ్మ‌డి కాయ కొట్టేప్పుడు లేకుంటే.. ఆ ఊరి మ‌నిషే కాద‌న్న‌ట్లుగా చూస్తారు జ‌నాలు. సొంతూరు అన్నందుకు ఊళ్లో ఓటు ఉంచుకునుడు కాదు..ద‌స‌రాకు హాజ‌రు ప‌డాల్సిందేన‌న్న‌మాట‌. జ‌మ్మిచెట్టు కాడ క‌న‌బ‌డుడే వ‌చ్చిండు అన్న‌దానికి రుజువన్న‌మాట‌.అందుకే గ్రామ‌మంతా కుటుంబంగా మారే ఈ పండుగ‌లో హైద‌రాబాద్‌లో ఉన్నా.. అమెరికాలో ఉన్నా రెక్క‌లు క‌ట్టుకుని వాలిపోతుంటారు. ద‌స‌రా పండుగలో దొరికే కిక్కు అట్లుంట‌ది మ‌రి.

ఈసారి డ‌బుల్ ద‌స‌రే..!
మాములుగానే.. మాములుగా ఉండ‌దు ద‌స‌రా.. మ‌రి ఈసారి ఎన్నిక‌ల పండుగ కూడా జ‌తైంది కాబ‌ట్టి డ‌బుల్ ద‌స‌రాకు ఊళ్లల్లో జ‌నం సిద్ధ‌మ‌య్యారు. బాపూ..నేనున్నా..అన్నా.. అక్కా నేను నిల‌బడుతున్నానంటూ కాళ్లు, చేతులు, గ‌డ్డం గ‌దువ, క‌డుపుతో త‌ల‌కాయ పెడుతూ ఆశ‌వ‌హులు ఇప్ప‌టికే క‌న‌బ‌డ్డ ఓట‌ర్ల‌ను ప‌ల‌క‌రిస్తున్నారు. ఎన్నిక‌ల నేపథ్యంలో ప‌ట్నంలో ఉన్న వారికి సైతం ప‌నిగ‌ట్టుకుని ఫోన్ చేసి.. బావా కూర‌చెప్పినా.. క‌ళ్లు ఒక్క గొల‌దే.. ఆర్మీమందు నీకోసం దాచి పెట్టి ఉంచినా.. ఫారిన్ లిక్క‌ర్‌కూడా తెప్పిచ్చిపెట్టి ఉంచినా.. నీ రాక ఆల‌స్యం.. అచ్చిదంటే షూరువు చేద్దాం.. ఎప్పుడు బ‌య‌ల్దేరుతాన‌వు అంటూ దావ‌త్ ఆఫ‌ర్లు చేసేస్తున్నారు. అక్క‌ను, కోడ‌లు, అల్లుడిని కూడా తీసుకునిరా.. అంటూ మ‌ర్యాద ముచ్చ‌ట్లతో ఫోన్లుకొడుతున్నరు.

ఈ లెక్క‌న స‌ర్పంచ్‌, ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల హైప్ ఎట్లుందో సూసుకోర్రి..! ఊళ్ల‌కు పోయే ప‌ట్నమేల్లు.. ప‌ట్నం నుంచి వ‌చ్చే వారి కోసం ప‌ల్లెల్లోని జ‌నాలు కాస్త రెండు మూడు రోజులు దాకా ఆలోడి కూడా ఉండేందుకే ప్లాన్ చేసుకున్నంటున్నారు. పండుగ‌లో..ప‌నిగా.. ఎల‌క్ష‌న్ల‌లో ఎవ‌రెవ‌రు నిల‌బడుతున్నారు.. ఎవ‌రెల్ల చేరిక అవుతుంద‌న్న ముచ్చ‌ట్ల‌న్నీ కూడా చెవిలో వేసుకుని మ‌ళ్లీ ప‌ట్నం పోయేందుకు జ‌నాలు సిద్ధ‌మ‌వుతున్నారు.

గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా వైన్ షాపులు బంద్ ప్ర‌క‌టించ‌డంతో.. జ‌నాలంతా మందుచూపుతో ముందుగానే కొనుగోలు చేసుకుంటున్నరు.. మ‌రి మీ సంగేతేందో జ‌ర చూసుకోండ్రి..!!

కాక‌తీయ ఎడిట‌ర్‌
అరెల్లి కిర‌ణ్ గౌడ్‌
7396604266

 

 

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కరెంటు లేక రైతుల అవస్థలు

కరెంటు లేక రైతుల అవస్థలు కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండుతున్నాయి ఎల్‌నినో ముప్పు...

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌ రూ.650 కోట్ల బొగ్గు నిధుల మళ్లింపుపై సోదాలు! హైదరాబాద్‌లో ఏఎంఆర్‌...

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..!

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..! నాపై వార్తలు రాసిన వాళ్లపై కేసులు పెట్టండి ‘కాకతీయ’ స్టాఫర్‌పై...

మా కుటుంబాన్ని వేధించొద్దు

మా కుటుంబాన్ని వేధించొద్దు సుమంత్ విష‌యంలో వాస్తవాలను ప‌రిశీలించండి 20 రోజులుగా మా కుటుంబంపై...

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.