అడవి పంది మాంసం విక్రయించిన వ్యక్తిపై కేసు నమోదు
వన్యప్రాణులకు హాని కలిగిస్తే చర్యలు తప్పవు
తొర్రూర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విజయలక్ష్మి
కాకతీయ, ఇనుగుర్తి : వన్య ప్రాణులకు హాని కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని తొర్రూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విజయలక్ష్మి అన్నారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ అడవి పంది మోసం విక్రయించిన
కోమటిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని మూల స్తంభం ప్రాంతానికి చెందిన నూనావత్ వెంకన్న పై విచారణ జరిపి, వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972 వైల్డ్ లైఫ్ ప్రొడక్షన్ యాక్ట్ నిబంధనల ప్రకారం కేసు నమోదు చేయడం జరిగిందని,వన్యప్రాణుల సంరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని వన్యప్రాణులకు హాని కలిగించే చర్యలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వన్యప్రాణులను వేటాడటం, అక్రమంగా రవాణా చేయడం, చంపడం, విద్యుత్ తీగలు అమర్చడం, ఉచ్చులు వేయడం వంటి చర్యలు చట్టరీత్యా నేరాలు. అదేవిధంగా, వన్యప్రాణుల మాంసాన్ని అక్రమంగా విక్రయించడం లేదా చట్టవిరుద్ధంగా కలిగి ఉండటం కూడా నేరమే. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై సంబంధిత చట్టాలు, నిబంధనల ప్రకారం కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎఫ్ ఆర్ వో తెలిపారు.

