epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

దిక్కుమాలిన ప్ర‌భుత్వం

  • విద్యా వ్య‌వ‌స్థ‌ను భ్ర‌ష్టు ప‌ట్టించింది
  • విద్యార్థుల‌కు స్కాల‌ర్‌షిప్స్‌.. అధ్యాప‌కులకు జీతాలు లేవ్‌
  • పిల్ల‌లు క‌లెక్ట‌రేట్ల ద‌గ్గ‌ర ధ‌ర్నా చేసే దుస్థితి దాపురించింది
  • వెంట‌నే ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించాలి
  • మ‌ల్కాజ్‌గిరి ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్‌

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని హస్తినాపురం సెంట్రల్ దగ్గర విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యదర్శి నరేష్ యాదవ్ చేపట్టిన 48 గంటల నిరాహార దీక్షలో పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. కాలేజీ, స్కూలు యాజమాన్యాలు అనేకసార్లు అల్టిమేటం ఇచ్చినా ఈ ప్రభుత్వానికి సెన్సిటివిటీ లేద‌న్నారు. ప్రజల పట్ల బాధ్యత, నిజాయితీ లేదు.
లక్షల మంది విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఆక్రందన కాబట్టి మేము కూడా సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నాం. ఈ వేదిక నుండి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.. తాత్సారం చేయకుండా.. శషబిశలు లేకుండా వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలి. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వడానికి నీకు నిధులు ఉన్నాయి. కానీ వీరికి ఇవ్వడానికి లేవా ?
కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తే మీకు కమిషన్లు వస్తాయి. వాటిని ఢిల్లీకి పంపించుకోవచ్చు అనుకుంటున్నారు. అంటూ మండిప‌డ్డారు.

నిల‌దీస్తాం..

కాలేజీ, స్కూలు యాజమాన్యాలు జీతభత్యాలు ఇచ్చే పరిస్థితి లేద‌ని ఈట‌ల ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. విద్యార్థులు ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత మాస్టర్స్ కోసం, ఉద్యోగాల కోసం వెళ్దామంటే సర్టిఫికెట్లు రాక సొంత డబ్బులు అప్పులు చేసి కట్టుకొని సర్టిఫికెట్ తీసుకుంటున్నార‌న్నారు. అంత గంభీరమైన సమస్య అయినా ప్రభుత్వం ఆలోచన చేయడం లేద‌న్నారు. గ్రామాలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లలో పనిచేసే ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేద‌న్నారు. పిల్లలకు డైట్ చార్జీలు లేవు.
ఏజెన్సీలకు డబ్బులు ఇవ్వకపోవడంతో అన్నం పెట్టలేక కలెక్టరేట్ల ముందట ధర్నా చేసే పరిస్థితి వచ్చింద‌ని మండిప‌డ్డారు. విద్యావ్య‌వ‌స్థ‌పై రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుంద‌న్నారు. విద్యా వ్యవస్థలో పదివేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయ‌న్నారు. రీ యంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోతే రాబోయే కాలంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాన్ని నిలదీస్తామ‌ని హెచ్చ‌రించారు.

దుర్మార్గ‌మైన స‌ర్కార్‌

మధ్యతరగతి పేద పిల్లలు పెద్ద పెద్ద కాలేజీలో చదువుకోవడానికి పెట్టిన స్కీం ఫీజు రియంబర్స్మెంట్.
కేసీఆర్ ప్రభుత్వంలో రెండు సంవత్సరాలు బకాయిలు పెట్టారు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రెండేళ్లయినా చెల్లించలేదు. నాలుగు సంవత్సరాలుగా ఫీజు రీఎంబర్స్మెంట్ లేకపోవడం వల్ల పిల్లల‌పై చదువులకు పోవడానికి ఉద్యోగాలు చేసుకోవడానికి తల్లిదండ్రులే మళ్లీ ఆ డబ్బులు కట్టి అప్పులు చేసి బజారున పడే పరిస్థితి వచ్చింది. గత్యంతరం లేక సమ్మెకు నోటు ఇస్తే పదివేల కోట్లలో 600 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పి ప్రైవేట్ యాజమాన్యాల కు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు. ప్రైవేటు కాలేజీల్లో పనిచేస్తున్న టీచర్లకు స్టాఫ్ కు జీతభత్యాలు లేవు. ప్రైవేటు రెసిడెన్షియల్ స్కూళ్లలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ల పేరుట కొన్ని వేల మందికి అడ్మిషన్లు ఇస్తారు. ఆ పిల్లలకు సంవత్సరానికి 42 వేల రూపాయలు ఇస్తారు. వాళ్లకు కూడా డబ్బులు ఇవ్వకపోతే పిల్లల్ని ఇంటికి పంపిస్తున్నారు. ఎంత దిక్కుమాలిన ప్రభుత్వమంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లలో డైట్ చార్జీలు చెల్లించకపోతే సప్లయర్స్ కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

నీటి కష్టాలకు కేసీఆర్‌ వైఫల్యాలే కార‌ణం

నీటి కష్టాలకు కేసీఆర్‌ వైఫల్యాలే కార‌ణం రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినా...

ఇనుగాల‌కు అవ‌మానం

ఇనుగాల‌కు అవ‌మానం కుడా మాజీ చైర్మ‌న్‌కు నో ఫేర్‌వెల్ ఆఘ మేఘాల మీద నూత‌న...

కాంగ్రెస్‌కు కొండా గుడ్‌బై..?

కాంగ్రెస్‌కు కొండా గుడ్‌బై..? బీఆర్ఎస్‌తో దంప‌తుల‌ మంతనాలు! కేటీఆర్‌ నేరుగా కొండా సురేఖకు ఫోన్‌ గత...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.