epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ల‌క్కు కిక్కెవ‌రికో?

ల‌క్కు కిక్కెవ‌రికో?
రేపే మ‌ద్యం షాపుల‌కు ల‌క్కీడ్రా
కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు ప్రక్రియ
మొత్తం 2,620 షాపులకు 95 వేలకుపైగా అప్లికేషన్లు
హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో ఫుల్ డిమాండ్‌
అత్య‌ధికంగా శంషాబాద్‌లో 100 వైన్స్‌ల‌కు 8,536 ..
అత్య‌ల్పంగా వ‌న‌ప‌ర్తిలో 37 వైన్స్‌ల‌కు 757 ద‌ర‌ఖాస్తులు
రాష్ట‌వ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాలకు 95,137 దరఖాస్తులు

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : తెలంగాణ నూతన మద్యంపాలసీ 2025-27 సంవత్సరాలకు సంబంధించి లక్కీడ్రా సోమవారం తీయనున్నారు. వ‌చ్చే రెండేళ్ల కోసం మ‌ద్యం దుకాణాలు నిర్వ‌హించే అవ‌కాశం ఎవ‌రికి ద‌క్క‌నుందో వెల్ల‌డికానుంది. జిల్లాలవారీగా దరఖాస్తుదారులు, ఎక్సైజ్ అధికారుల సమక్షంలో కలెక్టర్ల ఆధ్వర్యంలో మద్యం దుకాణాలకు రేపు ఉదయం 11 గంటలకు విజేత‌ల‌ను ప్ర‌క‌టించ‌నున్నారు. మద్యం దుకాణాల టెండర్ల విషయంలో హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్రంలో మద్యం దుకాణాల ఏర్పాటుకు లక్కీ డ్రా నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర‌వ్యాప్తంగా మొత్తం 2,620 మద్యం దుకాణాలకు 95,137 దరఖాస్తులు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వైన్స్‌కు భారీగా డిమాండ్ నెలకొంది. శంషాబాద్ పరిధిలో అత్యధికంగా 100 దుకాణాలకు 8,536, సరూర్‌నగర్‌లో 134 షాపులకు 7,845 దరఖాస్తులు రాగా.. వ‌న‌ప‌ర్తిలో 34 వైన్స్‌ల‌కు అత్య‌ల్పంగా 757 ద‌ర‌ఖాస్తులు మాత్ర‌మే రావ‌డం గ‌మ‌నార్హం.

హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో ..

హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో మ‌ద్యం దుకాణాల‌కు డిమాండ్ భారీగా ఉంది. శంషాబాద్‌లో అత్యధికంగా 100 దుకాణాలకు 8, 536 దరఖాస్తులు.. సరూర్‌న‌గర్‌లో 134 షాపులకు 7845 దరఖాస్తులు వచ్చాయి. మేడ్చల్లో 114 షాపులకు 6,063 దరఖాస్తులు, మల్కాజిగిరిలో 88 షాపులకు 5168 దరఖాస్తులు దాఖలు అయ్యాయి. అదేవిధంగా జిల్లాల వారీగా చూస్తే తక్కువ సంఖ్యలో షాపులు ఉన్న జిల్లాల్లో సైతం అప్లికేషన్ల జోరు తగ్గలేదు. మహబూబాబాద్ జిల్లాలో 59 వైన్స్‌ల‌కు 1800 దరఖాస్తులు, భూపాలపల్లిలో 60 వైన్స్‌ల‌కు 1863 వికారాబాద్ లో 59 వైన్స్లకు 1808 దరఖాస్తులు దాఖలయ్యాయి. త‌క్కువ‌గా జోగులాంబ గ‌ద్వాల జిల్లాలో 36 దుకాణాల‌కు 774, ఆదిలాబాద్‌లో 40 షాపుల‌కు 771, వ‌న‌ప‌ర్తిలో 37 వైన్స్‌ల‌కు 757 అప్లికేష‌న్లు వ‌చ్చాయి.

సెప్టెంబరు 25న నోటిఫికేషన్‌

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,620 మద్యం దుకాణాల కేటాయింపునకు సంబంధించి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ.. గత సెప్టెంబరు 25న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆ మరసటి రోజు నుంచి మద్యం షాపులకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలుపెట్టింది. గ‌తంలో మద్యం షాపుల దరఖాస్తులకు సంబంధించి.. దాదాపు 1.32 లక్షల అప్లికేషన్ల విక్రయం ద్వారా ఎక్సైజ్‌ శాఖకు దాదాపు రూ.2,645 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే ఈసారి మాత్రం దరఖాస్తుల సంఖ్య భారీగా తగ్గింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,620 మద్యం షాపులకు ఈసారి కేవలం 95,436 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. మద్యం దుకాణాల అప్లికేషన్ల విక్రయం ద్వారా రూ.3 వేల కోట్ల ఆదాయం ఆర్జించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈసారి అప్లికేషన్ల సంఖ్య తగ్గినా.. దరఖాస్తు రుసుమును పెంచడంతో ప్రభుత్వం అనుకున్న లక్ష్యం చేరింది. గతంలో దరఖాస్తు రుసుం రూ.2 లక్షలు ఉండగా.. ఈసారి ఆ మొత్తాన్ని రూ.3 లక్షలకు పెంచారు.

95 వేల పైచిలుకు దరఖాస్తులు

ఈసారి ఎక్సైజ్‌ శాఖ అధికారులు.. ఎక్కువ సంఖ్యలో జనాలు.. మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకునేలా విస్తృతంగా ప్రచారం కూడా చేశారు. ఈనెల 18 అర్ధరాత్రి వరకు 89,344 మంది దరఖాస్తు చేశారు. అయితే అదే రోజు తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్‌కు పిలుపునివ్వడంతో.. ఎక్కువ మంది దరఖాస్తు చేసుకోలేకపోయారు. దీంతో పలువురు వ్యాపారుల అభ్యర్థన మేరకు ప్రభుత్వం నెల 23 వరకు గడువు పొడిగించింది. దీంతో 95 వేల పైచిలుకు దరఖాస్తులు వచ్చాయి. ఇక ఈనెల అనగా అక్టోబర్ 27న డ్రా తీసి వ్యాపారులను ఎంపిక చేయనున్నారు. డిసెంబర్ ఒకటి నుంచి కొత్త దుకాణాలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాలు ఉన్నాయి.

శంషాబాద్ ఎక్సైజ్ డివిజన్ టాప్‌

ఈసారి ఒక్కో అప్లికేషన్‌కు రూ.3 లక్షల ఫీజు తీసుకున్నారు. ఇది నాన్ రిఫండబుల్. అలానే 2023లో వచ్చిన అప్లికేషన్ల సంఖ్య 1.31 లక్షలుకాగా ఈసారి దాదాపు అదేస్థాయిలో అప్లికేషన్లు తగ్గాయి. ఫీజు రూ.3 లక్షలు చేయడంతో ఈసారి అప్లికేషన్లు తగ్గినా ఆదాయం క్రితంసారి వచ్చింద‌ని అధికారులు అంచనా వేశారు. ఒక్కో మద్యం దుకాణానికి సగటున 36 దరఖాస్తులు వచ్చాయ‌ని అధికారులు వెల్ల‌డించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

నీటి కష్టాలకు కేసీఆర్‌ వైఫల్యాలే కార‌ణం

నీటి కష్టాలకు కేసీఆర్‌ వైఫల్యాలే కార‌ణం రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినా...

ఇనుగాల‌కు అవ‌మానం

ఇనుగాల‌కు అవ‌మానం కుడా మాజీ చైర్మ‌న్‌కు నో ఫేర్‌వెల్ ఆఘ మేఘాల మీద నూత‌న...

కాంగ్రెస్‌కు కొండా గుడ్‌బై..?

కాంగ్రెస్‌కు కొండా గుడ్‌బై..? బీఆర్ఎస్‌తో దంప‌తుల‌ మంతనాలు! కేటీఆర్‌ నేరుగా కొండా సురేఖకు ఫోన్‌ గత...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.