epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మ‌హిళా అధికారుల‌కు మంత్రుల‌ వేధింపులు

  • ఇంటికి పిలిపించుకుని అవ‌మానిస్తున్నారు
  • ఈ విష‌యంపై సీఎం రేవంత్ రెడ్డి నివేదిక తెప్పించుకోవాలి
  • సంబంధిత మంత్రుల‌ను కేబినేట్ నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయాలి
  • రాష్ట్రంలో క్షీణించిన శాంతి భ‌ద్ర‌త‌లు
  • యూపీ తరహాలో రౌడీషీటర్లపై ఉక్కు పాదం మోపాలి
  • కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్

కాక‌తీయ‌, క‌రీంన‌గర్ బ్యూరో : రాష్ట్ర కేబినెట్ లోని కొందరు మంత్రులు మహిళా అధికారులను ఇంటికి పిలిపించుకుని ఇబ్బంది పెడుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన ఆరోప‌ణ‌లు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశం పై విచారణ జరిపి నివేదిక తెప్పించుకోవాలని, బాధ్యులైన మంత్రులను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అవినీతి అరాచకాలు పెరిగిపోయాయని మహిళలపై అవమానకరమైన ప్రవర్తన చోటుచేసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు నెలకు రూ.2500, తులం బంగారం, స్కూటీ ఇస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. సర్దార్ వల్లభాయి పటేల్ 150 జయంతి నేపథ్యంలో సోమ‌వారం కరీంనగర్ లోని మేరా యువ భారత్ కార్యాలయంలో మాజీ మేయర్ సునీల్ రావు, బీజేపీ కరీంనగర్, సిరిసిల్ల అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, రెడ్డబోయిన గోపి తదితరులతో కలిసి బండి సంజ‌య్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని, శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని బండి సంజయ్ విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటు బ్యాంకు రాజకీయాలు మానుకొని శాంతి భద్రతల పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో శాంతి చట్టవ్యవస్థను కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు.

యూపీ త‌ర‌హాలో ఉక్కుపాదం మోపాలి

ఎంఐఎంకు చెందిన రౌడీషీటర్లు పోలీసులపై దాడులు, హత్యాయత్నాలు చేసే స్థాయికి పెట్రేగి పోతున్నారని నిజామాబాద్‌లో కానిస్టేబుల్ హత్య, హైదరాబాద్‌లో డీసీపీ చైతన్య పై హత్యాయత్నం జరిగినా ప్రభుత్వం మౌనంగా చూస్తోందని బండి సంజ‌య్ విమ‌ర్శించారు. గో రక్షులపై కూడా దాడులు జరుగుతున్నా పాలకులు మౌనం వహిస్తున్నారని మండిపడ్డారు. ఎంఐఎంకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని ఓట్ల కోసం జూబ్లీహిల్స్‌లో ఆ పార్టీ కాళ్లు పట్టుకునే స్థాయికి దిగజారిందని విమర్శించారు. యూపీ తరహాలో రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపాలని కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి డిమాండ్ చేశారు. అక్కడి ప్రభుత్వంలా రౌడీషీటర్లకు బెయిల్ వచ్చినా బయటకు రానీయకుండా ఉండే విధంగా చట్టాలను కఠినతరం చేయాలన్నారు.

31నుంచి దేశ‌మంతా ఐక్య‌తా మార్చ్‌..!

సర్దార్ వల్లభాయి పటేల్ 150వ జయంతి సందర్భంగా అక్టోబర్ 31 నుంచి నవంబర్ 25 వరకు దేశవ్యాప్తంగా సర్దార్@150 ఐక్యతా మార్చ్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో జరిగే పాదయాత్రలో తానూ పాల్గొంటునున్న‌ట్లు తెలిపారు. సర్దార్ పటేల్ దేశ ఐక్యతకు ప్రతీక అని ఆయన స్ఫూర్తిని యువతలో నింపడం లక్ష్యమని తెలిపారు. తెలంగాణ విముక్తికి సర్దార్ పటేల్ చేసిన కృషిని గుర్తుచేస్తూ ఆయన లేక పోతే తెలంగాణ నేడు పాకిస్తాన్ లేదా బంగ్లాదేశ్‌లా మారిపోయేదన్నారు. ఆయన స్ఫూర్తితో దేశ ఐక్యతను కాపాడుకోవాలని బండి పిలుపునిచ్చారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.