epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సీజేఐపై దాడి ..

సీజేఐపై దాడి ..
30 కోట్ల దళితులపై దాడే..

దాడులకు పాల్పడే వారిని వ‌దిలిపెట్టం

ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తే గుణపాఠం త‌ప్ప‌దు

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దళితుల ఆత్మగౌరవ సభ

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: సుప్రీం కోర్టు చీఫ్ జస్టీస్ బీఆర్ గవాయి మీద జరిగిన దాడి దేశంలోని ముప్ఫై కోట్ల మంది దళిత ప్రజల మీద జరిగిన దాడే అని, దళితుల మీద దాడులకు పాల్పడే వారికి చట్టాలు వర్తించకపోవడం అత్యంత దారుణమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ధ్వ‌జ‌మెత్తారు. గవాయిపై జరిగిన పాశవిక దాడిని నిరసిస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దళితుల ఆత్మగౌరవ సభ జరిగింది. ముఖ్య అతిథిగా పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ హాజ‌రై మాట్లాడుతూ “చట్టం ముందు అందరూ సమానులే అని రాజ్యాంగం చెప్తుంటే అందుకు విరుద్ధంగా చట్టపరమైన వ్యవస్థలు దళితుల మీద దాడులకు పాల్పడుతున్న వారి మీద చర్యలు తీసుకోవడంలేదని అన్నారు. ధర్మం ముసుగులో విశ్వాసాల ముసుగులో దాడులకు పాల్పడే వారికి చట్టాలు వర్తించవా ? వారి మీద చర్యలు తీసుకోరా అని ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థ, జాతీయ మానవ హక్కుల కమిషన్ తమ కర్తవ్యాలను అమలు చేయడంలో పూర్తి వివక్షతను చూపెట్టయని అన్నారు.

మౌన‌మెందుకు?

ఎన్నో సంఘటనల మీద పత్రికల్లో వచ్చిన వార్తలను ఆధారంగా చేసుకొని సుమోటోగా కేసులు తీసుకున్న వ్యవస్థలు దేశంలోనే అత్యున్నతమైన సుప్రీంకోర్టుకు చీఫ్ జస్టీస్ గా ఉన్న గవాయి మీద జరిగితే ఎందుకు మౌనం వహించాయి ? అని ప్రశ్నించారు. ఘటన జరిగి నెల రోజులు గడిచినా కనీసం చట్టపరంగా ఒక చర్య కూడా ఎందుకు తీసుకోలేదు అని ప్రశ్నించారు. ఇది వివక్షతను చూపుతున్న చర్య, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తి విరుద్ధమైన చర్య అని అన్నారు. దళితుల మీద దాడులకు పాల్పడితే సహించే రోజులు పోయాయని అన్నారు. ధర్మం ముసుగులో విశ్వాసాల ముసుగులో దాడులు పాల్పడే వారికి తగిన గుణపాఠం నేర్పుతామని అన్నారు. మా పోరాటం దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడానికి, న్యాయవ్యవస్థ స్వతంత్రను కాపాడుకోవడానికి, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికే జరుగుతుందని అన్నారు. రాజ్యాంగం ద్వారానే దళితులకు మానవ హక్కులు లభించి మనుష్యులుగా గుర్తించబడ్డారని అన్నారు.

రాజ్యాంగమే కారణం

దళితులు ఉన్నత స్థాయికి ఎదగడానికి రాజ్యాంగమే కారణం. ఇలా ఉన్నత స్థాయిలోకి ఎదగడకపోవడం కొంత మంది జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. అందుకే రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని కుట్రలు చేస్తున్నారని అన్నారు. ఇలాంటి గొప్ప రాజ్యాంగాన్ని తొలగించి మను ధర్మాన్ని ప్రజల మీద రుద్దాలని చేసే వారెవరైనా మాకు బద్ద శత్రువులే అని ప్రకటించారు. ప్రజాస్వామ్య స్థానంలో రాచరిక వ్యవస్థ తీసుకొచ్చే మను ధర్మాన్ని సహించేది లేదని అన్నారు. ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం సమానత్వం కోసం రాజ్యాంగ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

నీటి కష్టాలకు కేసీఆర్‌ వైఫల్యాలే కార‌ణం

నీటి కష్టాలకు కేసీఆర్‌ వైఫల్యాలే కార‌ణం రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినా...

ఇనుగాల‌కు అవ‌మానం

ఇనుగాల‌కు అవ‌మానం కుడా మాజీ చైర్మ‌న్‌కు నో ఫేర్‌వెల్ ఆఘ మేఘాల మీద నూత‌న...

కాంగ్రెస్‌కు కొండా గుడ్‌బై..?

కాంగ్రెస్‌కు కొండా గుడ్‌బై..? బీఆర్ఎస్‌తో దంప‌తుల‌ మంతనాలు! కేటీఆర్‌ నేరుగా కొండా సురేఖకు ఫోన్‌ గత...

ఇదేం అన్యాయం..!?

ఇదేం అన్యాయం..!? కుడా చైర్‌ప‌ర్స‌న్‌గా సుధారాణి నియామ‌కంపై కాంగ్రెస్‌లో అసంతృప్తి పార్టీ అధికారంలోకి వ‌చ్చాక...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.