epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రెండేళ్లుగా మల్లంపల్లి మండలం కాగితాల మీదే

రెండేళ్లుగా మల్లంపల్లి మండలం కాగితాల మీదే
బిఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు

కాకతీయ, ములుగు ప్రతినిధి: ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తవుతున్నా మల్లంపల్లి మండలాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని తీవ్రస్థాయిలో విమర్శించారు. మల్లంపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ ఆకాంక్ష, స్థానిక ప్రజల డిమాండ్ మేరకు కేసీఆర్ ప్రభుత్వం మల్లంపల్లి మండలాన్ని ఏర్పాటు చేసింది అని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లు గడిచినా ఈ మండలం ఇప్పటికీ కాగితాల మీదే ఉన్నది అని, మండల నిర్మాణంలో తీవ్రమైన నిర్లక్ష్యం వల్ల ఇప్పటికీ ఇన్చార్జ్ ఎమ్మార్వో ఉన్నాడు అని,రిజిస్ట్రేషన్ కూడా ములుగు మీదే జరుగుతోంది అని,
పోలీస్ స్టేషన్ ఏర్పాటు కాలేదు అని అన్నారు. మండలం ఉన్నా, సేవలు లేవు అని, ప్రజలు రోజూ ములుగుకే వెళ్లాల్సి వస్తోంది అని, ఇది ప్రజలను మోసం చేయడమే అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు దేవ్‌నగర్–మల్లంపల్లి రెండు మాత్రమే సెంటర్లు ఉండటంతో మహమ్మద్ గౌస్‌పల్లి వంటి గ్రామాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, వెంటనే అవసరమైన సెంటర్లను ఏర్పాటు చేయాలని మంత్రి, జిల్లా కలెక్టర్‌లను కోరారు.బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ కుట్ర చేస్తుంది అని, 42% బీసీ రిజర్వేషన్ ఇస్తామని మాట ఇచ్చి అమలు చేయకముందే ఎన్నికలకు వస్తున్న కాంగ్రెస్ పార్టీ బీసీ వర్గంపై కుట్ర చేస్తోంది అని ఆరోపించారు. బీఆర్ఎస్ మాత్రమే బీసీలకు ఇచ్చిన మాట నెరవేర్చిన పార్టీ అని, గత జడ్పీ ఎన్నికల్లో జనరల్ సీటులో బీసీ నాయకుడు కుసుమ జగదీష్ ని చైర్మన్‌గా చేశింది కేసీఆర్ ప్రభుత్వం అన్నారు. ములుగు జిల్లా అభివృద్ధి బాటలో నడుస్తుందనే భ్రమలో పడొద్దు అని, ఇక్కడ రెండు సంవత్సరాల్లో చెప్పుకోదగ్గ ఒక్క అభివృద్ధి పనిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు అని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. రామప్ప దేవాలయాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టింది బిఆర్‌ఎస్ ప్రభుత్వం అని, మెడికల్ కాలేజ్‌ను ములుగుకు తీసుకువచ్చింది కేసీఆర్ ప్రభుత్వం అని, కనెక్టివిటీ రోడ్లు, పర్యాటక అభివృద్ధి టీఆర్‌ఎస్ హయాంలోనే జరిగాయి అని అన్నారు. పాము కాటుకు గురైన ఏడేళ్ల బాలుడికి యాంటీవెనం ఇంజెక్షన్ కూడా అందుబాటులో లేని పరిస్థితి. ఇది ఎంత దారుణం? మంత్రి ఏం చేస్తున్నారు?” అని ప్రశ్నించారు.బిఆర్‌ఎస్ ప్రభుత్వం పెట్టిన డయాలసిస్ యూనిట్లు, మొబైల్ హెల్త్ సపోర్ట్ ఇంకా పనిచేస్తున్నాయన్న విషయాన్ని గుర్తుచేస్తూ, ప్రజల ప్రాణాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో మల్లంపల్లి మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్, మల్లంపల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడు చీదర్ల సంతోష్, మాజీ గ్రంథాలయ చైర్మన్ గోవింద నాయక్, మాజీ సర్పంచ్ చంద కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.