epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

బ‌ల్దియాపై బీఆర్ఎస్ ఫోక‌స్‌

బ‌ల్దియాపై బీఆర్ఎస్ ఫోక‌స్‌

గేర్ మార్చ‌నున్న కారు పార్టీ

వ‌రుస ప‌రాజ‌యాల‌తో కేడ‌ర్ డీలా

ఉప ఎన్నిక‌ల్లోనూ నిరాశప‌ర్చిన ఫ‌లితాలు

సెంటిమెంట్ కూడా వ‌ర్కౌట్ కాని ప‌రిస్థితి

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న పార్టీ

వ‌రుసగా రెండు ప‌ర్యాయాలు మేయ‌ర్ పీఠం

ఈసారి ఎలాగైనా ద‌క్కించుకోవాల‌ని గ‌ట్టి ప‌ట్టుద‌ల‌

గ్రేట‌ర్ హైద‌రాబాద్ నేత‌ల‌తో కేటీఆర్ భేటీ

ఎన్నికలు ఎప్పుడు పెట్టినా సిద్ధంగా ఉండాలని పిలుపు

కార్పొరేట‌ర్లు, ప్ర‌జాప్ర‌తినిధుల‌కు దిశానిర్దేశం

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై భారత రాష్ట్ర సమితి ఫోకస్ పెట్టింది. జూబ్లీహిల్స్ ఓట‌మితో ర‌గిలిపోతున్న పార్టీ ఎలాగైనా జీహెచ్ఎంసీపై గులాబీ జెండా ఎగుర‌వేయాల‌న్న గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్ప‌టి నుంచే రాబోయే ఎన్నికలకు వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ గ్రేట‌ర్ హైద‌రాబాద్‌కు చెందిన ముఖ్య నేత‌ల‌తో తెలంగాణ భ‌వ‌న్‌లో స‌మావేశం నిర్వ‌హించారు. ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా దిశానిర్దేశం చేశారు. ఈ మీటింగ్‌కు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు హాజ‌ర‌య్యారు. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ కార్యకలాపాలు, జీహెచ్ఎంసీలోని సమస్యల మీద పోరాటాలు, ఎన్నిక‌ల‌ల్లో గెలుపు వంటి.. అంశాల‌పై నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.

వ‌రుస‌గా రెండు ప‌ర్యాయాలు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ విజ‌యం సాధించింది. తొలి గ్రేట‌ర్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ఏకంగా 99 సీట్లు దక్కించుకొని గులాబీ పార్టీ సంచలనం సృష్టించింది. కాగా 2020లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ కొంత వెనుక‌బ‌డింది. పార్టీ బలం 65 స్థానాలకు తగ్గింది. అదే సమయంలో బీజేపీ బలం 42 స్థానాలకు పెరిగింది. ఎంఐఎం పార్టీ కూడా 42 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. మరోవైపు 2023 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గ్రామీణ ప్రాంత ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. అదే సమయంలో గ్రేటర్ హైదరాబాద్ ఓటర్లు ఈ పార్టీకి మెజారిటీ స్థానాలు కట్టబెట్టారు.

వ‌రుస ప‌రాయ‌జ‌యాలు

కానీ ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను ప్రజలు తిర‌స్క‌రించారు. ఒక్క పార్లమెంట్ స్థానాన్ని కూడా కట్టబెట్టలేదు ప్రజలు. అటు రాజ‌ధానిలోని కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లోనూ ఆ పార్టీ సిట్టింగ్ స్థానాల్లో ఓడిపోయింది. ఎమ్మెల్యేలు చనిపోయిన సెంటిమెంట్ కూడా వర్కౌట్ కాలేదు. అటు మధ్యలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎలాంటి ప్రభావాన్ని చూపించలేకపోయింది. అందుకే రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటి హైదరాబాద్ నగరంలో మ‌రోమారు పట్టు నిలుపుకోవాలని ప్రయత్నం చేస్తుంది. అందుకు ఇప్పటి నుంచే ప్రచార కార్యక్రమాలను ముమ్మురం చేయాలనే ఉద్దేశ్యంతో ఈ రోజు తన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. నైరాశ్యంలో కూరుకుపోయిన పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపనున్నారు.

ప‌దేళ్లు అద్బుతంగా ప‌నిచేశాం

గ్రేటర్‌ హైదరాబాద్‌ నేతలతో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సమావేశమయ్యారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, మాజీ ప్రజా ప్రతినిధులతో తెలంగాణ భవన్‌లో భేటీ అయ్యారు. మంగళవారం జరుగనున్న గ్రేటర్‌ మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహం, జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సన్నద్ధతపై చర్చించారు. ఈసందర్భంగా కార్పొరేటర్లకు వివిధ అంశాలపై కేటీఆర్‌ మార్గదర్శనం చేశారు. పది సంవత్సరాలపాటు అధికారంలో ఉండి ఎలాంటి అవినీతికి తావు లేకుండా అద్భుతంగా పదవీకాలం పూర్తి చేసుకోబోతున్నారని పార్టీ తరపున వారికి అభినందనలు తెలిపారు. ముఖ్యంగా రెండోసారి జీహెచ్ఎంసీలో గెలిచిన తర్వాత కరోనా వంటి తీవ్ర సంక్షోభంలోనూ అద్భుతమైన సేవలను అందించిన విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాష్ట్రంలో ప్రజలు పార్టీకి ప్రతిపక్షంగా బాధ్యత ఇచ్చిన తర్వాత హైదరాబాద్ నగరంలో ఉన్న కార్పొరేటర్లు ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై పోరాటం చేసిన తీరును అభినందించారు.

ఎన్నిక‌ల‌కు సిద్ధంగా ఉండాలి

పార్టీ వెంటే నిలబడిన ప్రతి ఒక్క కార్పొరేటర్‌కి భవిష్యత్తులో మరిన్ని పదవులు వస్తాయని కేటీఆర్ హామీ ఇచ్చారు. కార్పొరేటర్లు భవిష్యత్తులో జరిగే ఎన్నికను తమ ఎన్నికగా తీసుకొని పార్టీ అందరినీ తిరిగి గెలిపించుకుంటుందని భరోసా ఇచ్చారు. కార్పొరేటర్లకి రానున్న కాలంలో మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాల నేపథ్యంలో మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ఎప్పుడు పెట్టినా సిద్ధంగా ఉండాలని సూచించారు. కౌన్సిల్‌ సమావేశంలో బల్దియాలోని సమస్యలు ప్రస్తావించాలన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పారిశ్రామిక భూముల అమ్మకంపై నిలదీయాలని సూచించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

నీటి కష్టాలకు కేసీఆర్‌ వైఫల్యాలే కార‌ణం

నీటి కష్టాలకు కేసీఆర్‌ వైఫల్యాలే కార‌ణం రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినా...

ఇనుగాల‌కు అవ‌మానం

ఇనుగాల‌కు అవ‌మానం కుడా మాజీ చైర్మ‌న్‌కు నో ఫేర్‌వెల్ ఆఘ మేఘాల మీద నూత‌న...

కాంగ్రెస్‌కు కొండా గుడ్‌బై..?

కాంగ్రెస్‌కు కొండా గుడ్‌బై..? బీఆర్ఎస్‌తో దంప‌తుల‌ మంతనాలు! కేటీఆర్‌ నేరుగా కొండా సురేఖకు ఫోన్‌ గత...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.