epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ప‌తాక స్థాయికి పల్లె పోరు

ప‌తాక స్థాయికి పల్లె పోరు
ఓటుకు రూ. 2 వేలు !.. సుక్కా.. ముక్కా అద‌నం
ప్రత్యర్థులు ఎంతిస్తే అంతకు మించి పంపిణీ
పోల్​ మేనేజ్​మెంట్​పై పార్టీలు బ‌ల‌ప‌ర్చిన అభ్య‌ర్థుల‌ దృష్టి
వార్డుల వారీగా అత్యంత స‌న్నిహితుల‌కు బాధ్య‌త‌లు
తొలి దశ పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు సర్వం సిద్ధం
రేప‌టి ఉద‌యం 7 గంట‌ల నుంచి ఒంటి గంట వ‌ర‌కు పోలింగ్‌
మ‌ధ్యాహ్నం 2 నుంచి ఓట్ల లెక్కింపు.. ఫ‌లితాల వెల్ల‌డి
మొత్తం 3836 సర్పంచ్ స్థానాలు… 56,19,430 మంది ఓటర్లు
ఎన్నిక‌ల‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు : ఈసీ

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: పల్లె పోరు ప‌తాక‌స్థాయికి చేరింది. పోలింగ్‌కు ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉండటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రలోభాల పర్వానికి తెర తీశారు.ప్రధాన పార్టీల అభ్యర్థులు. వార్డులు, కాలనీలవారీగా బాధ్యులను నియమించి మ‌ద్యం, మ‌నీ పంపిణీ ముమ్మరం చేశారు. ప్రత్యర్ధులు ఎంత ఇస్తే అంతకు మించి పంపిణీ చేస్తున్నారు. పోలీసులు తనిఖీలు చేస్తున్నా కళ్ళు కప్పి గుట్టుచప్పుడు కాకుండా ఈ తతంగం కొనసాగుతోంది. ఈ ఎన్నికలో ప్రతీ ఓటు కీలకం కావ‌డంతో అభ్యర్థులు అత్యధిక మంది మద్దతు కూడగట్టేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. సామాజికవర్గాలు, మహిళా, యువ సంఘాలు, వలస ఓటర్ల వారీగా వారి బలాలను లెక్కగట్టుకుంటున్నారు. వారిని ఆకట్టుకునేలా ఎర వేస్తున్నారు. చాలాచోట్ల ఆన్​లైన్​ యాప్​లలో ఓటుకు ఇంత అని డబ్బు పంపిణీ చేస్తున్నారు. పోటీ గట్టిగా ఉన్న చోట ఓటుకు రూ.2000 నుంచి రూ.2500 వరకు ఇస్తున్నారు. అలాగే కొన్నిచోట్ల దీని డిమాండ్​ భారీగా పెరిగింది. ఒక కుటుంబంలో ఉన్న ఓట్ల ఆధారంగా రూ.4 నుంచి రూ.5 వేల వరకు పంపిస్తున్నారు. దీనికి తోడు ఇంటింటికీ చికెన్‌.. మ‌ద్యం బాటిళ్లు పంపుతుండ‌టంతో సుక్కా.. ముక్క‌తో గ్రామాలు ఊగిపోతున్నాయి.

ఆన్​లైన్​లో ఖాతాలకు మ‌నీ ట్రాన్స్‌ఫ‌ర్‌

గ్రామ పంచాయతీ తొలి దశ ఎన్నికల ప్రచారం మంగ‌ళ‌వారం ముగియడంతో అభ్యర్థులు పోల్​ మేనేజ్​మెంట్​పై దృష్టి సారించారు. నగదు, ఇంటింటికీ మద్యం సీసాల పంపిణీని ప్రారంభించారు. నగరాలు, పట్టణాల్లో ఉండే ఓటర్లకు పలువురు సర్పంచి అభ్యర్థులు వాహన ఏర్పాట్లు, ప్రయాణ ఖర్చులతోపాటు ఓటుకు డబ్బులను ఆన్​లైన్​లో వారి ఖాతాలకు బదిలీ చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో మంగళవారం రాత్రే నుంచే డబ్బు పంపిణీ మొదలైంది. మేజర్​ గ్రామ పంచాయతీల్లో అభ్యర్థుల ప్రచార ఖర్చు, పంపిణీ మొత్తాలను కలిపితే రూ.కోటి వరకు చేరుకుంటోంది. నగరాలు, పట్టణాలకు సమీపంలో, భూముల ధరలు భారీగా ఉన్న చోట్ల ఈ ఖర్చు మరింత ఎక్కువగా ఉంటోంది. మొదటి దశ ఎన్నిక‌లు జ‌రిగే పంచాయతీల్లో ఈసీ నిబంధనల ప్రకారం మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచే వైన్​షాపులు మూతపడ్డాయి. 12వ తేదీ వరకు ఈ నిబంధన అమల్లో ఉంటుంది. సర్పంచ్‌, వార్డు సభ్యుల అభ్యర్థులు ముందే భారీఎత్తున మద్యం కొనుగోలు చేసి గ్రామాల్లో డంప్​లు ఏర్పాటు చేశారు. గ్రామాల్లో ఓటర్లకు ఇంట్లో ఇద్దరు ఉంటే హాఫ్​ బాటిల్​, అదే నలుగురు ఉంటే ఫుల్​ బాటిల్​ ఇస్తున్నారు.

విధుల్లో ల‌క్ష‌మంది సిబ్బంది

తెలంగాణలో తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ గురువారం జరగనున్నాయని.. ఈ నేపథ్యంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటర్లకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) రాణి కుముదిని సూచించారు. గురువారం హైదరాబాద్‌లో ఎస్ఈసీ రాణి కుముదిని విలేకర్లతో మాట్లాడుతూ.. గురువారం ఉదయం 7 గంటల నుంచి ఈ పోలింగ్ ప్రారంభమవుతుందన్నారు. తొలి దశలో 56,19,430 మంది ఓటర్లు.. తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని చెప్పారు. 3836 సర్పంచ్ స్థానాలకు మొత్తం 13,127 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అబ్జర్వర్లు, మైక్రో అబ్జర్వర్లతో ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద సీసీ కెమెరా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ ఎన్నికల విధుల్లో లక్ష మందికి పైగా సిబ్బంది పాల్గొనున్నారని వివరించారు. ఈ ఎన్నికల్లో ఓటర్లు 18 రకాల ఐడీ కార్డులను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఏ రకమైన ఐడీ కార్డును పోలింగ్ బూత్ అధికారులకు చూపించిన ఓటు వేయవచ్చునన్నారు. మంగవారం నుంచి ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో వైన్ షాపులన్నీ మూసి వేసినట్లు చెప్పారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు మేజిస్ట్రియల్ పవర్స్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు ఎస్ఈసీ వివరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కరెంటు లేక రైతుల అవస్థలు

కరెంటు లేక రైతుల అవస్థలు కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండుతున్నాయి ఎల్‌నినో ముప్పు...

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌ రూ.650 కోట్ల బొగ్గు నిధుల మళ్లింపుపై సోదాలు! హైదరాబాద్‌లో ఏఎంఆర్‌...

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..!

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..! నాపై వార్తలు రాసిన వాళ్లపై కేసులు పెట్టండి ‘కాకతీయ’ స్టాఫర్‌పై...

మా కుటుంబాన్ని వేధించొద్దు

మా కుటుంబాన్ని వేధించొద్దు సుమంత్ విష‌యంలో వాస్తవాలను ప‌రిశీలించండి 20 రోజులుగా మా కుటుంబంపై...

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.