epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ

మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ
డీజీపీ ఎదుట 41 మంది మావోయిస్టుల లొంగుబాటు
24 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న కీలక నేత ఎర్రగొల్ల రవి లొంగుబాటు
ఆయుధాలతో సహా 24 తుపాకుల అప్పగింత
లొంగిపోయిన వారిపై రూ.1.46 కోట్ల రివార్డు

కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హైదరాబాద్‌లోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 24 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న కీలక నేత ఎర్రగొల్ల రవి అలియాస్ సంతోష్ (డివిజనల్ కమిటీ సభ్యుడు)తో పాటు మంచిర్యాలకు చెందిన కనికారపు ప్రభంజన్ ఉన్నారు. మిగతా వారు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారని అధికారులు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులు తమ వద్ద ఉన్న ఆయుధాలతో సహా మొత్తం 24 తుపాకులను పోలీసులకు అప్పగించారు. వీటిలో ఎల్‌ఎంజీ, ఏకే–47 రైఫిల్స్, ఎస్‌ఎల్‌ఆర్‌, ఇన్‌సాస్ రైఫిల్స్, గ్రెనేడ్ లాంచర్, 303 రైఫిల్స్, సింగిల్ షాట్ రైఫిల్స్, ఎయిర్ గన్స్ ఉన్నాయి. ఇవన్నీ పోలీసుల నుంచి కొల్లగొట్టిన ఆయుధాలేనని డీజీపీ వెల్లడించారు.

ఏడాదిలో 509 మంది లొంగుబాటు
ఈ ఏడాది ఇప్పటి వరకు రాష్ట్రంలో 509 మంది మావోయిస్టులు లొంగిపోయారని డీజీపీ తెలిపారు. పార్టీ నాయకత్వంపై అసంతృప్తి, అనారోగ్య సమస్యలు, ప్రభుత్వ పునరావాస పథకాలపై నమ్మకంతోనే మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వస్తున్నారని చెప్పారు. 2026 మార్చి 31 వరకు కొత్త ప్రాంతాలకు వెళ్లాలన్న ఆదేశాలే లొంగుబాటుకు ప్రధాన కారణమని పేర్కొన్నారు.అక్టోబర్ 21న పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకే ఈ లొంగుబాట్లు జరిగాయని డీజీపీ తెలిపారు. లొంగిపోయిన 41 మందిపై మొత్తం రూ.1.46 కోట్ల రివార్డు ఉందని వెల్లడించారు. తక్షణ సాయం కింద ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున అందించినట్లు తెలిపారు. క్యాడర్ ప్రకారం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి వారికి రావాల్సిన పరిహారాన్ని అందిస్తామని చెప్పారు.

ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో మొత్తం 54 మంది మాత్రమే తెలంగాణకు చెందిన వారు ఉన్నారని, వీరిలో ఆరుగురు మాత్రమే రాష్ట్రంలో పనిచేస్తున్నారని డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. ఆస్ట్రేలియాలో జరిగిన బోండీ బీచ్ కాల్పుల ఘటనపై స్పందించిన డీజీపీ, ఆ ఘటనకు హైదరాబాద్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కాల్పులు జరిపిన సాజిద్ అక్రమ్ గతంలో ఉపాధి కోసం ఆస్ట్రేలియా వెళ్లాడని, అతడు భారత్‌కు పలుమార్లు వచ్చినప్పటికీ ఈ ఉగ్రదాడికి తెలంగాణతో ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.