epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

బీజేపీ పగ్గాలు నితిన్ నబిన్‌కే!

బీజేపీ పగ్గాలు నితిన్ నబిన్‌కే!
జనవరి 20న అధికారిక ప్రకటనకు ముహూర్తం
యువ నేతకు అధిష్ఠానం పెద్దపీట
అగ్రనేతల సంపూర్ణ మద్దతుతో ఏకగ్రీవం

కాకతీయ, నేష‌న‌ల్ డెస్క్ : భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్ష పదవిపై ఉత్కంఠకు తెరపడనుంది. పార్టీ నూతన సారథిగా యువనేత నితిన్ నబిన్ ఎంపిక దాదాపు ఖరారైనట్లు బీజేపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. జనవరి 20న కొత్త అధ్యక్షుడి పేరును అధికారికంగా ప్రకటించేందుకు అధిష్ఠానం సిద్ధమైంది. పార్టీ భవిష్యత్ అవసరాలు, యువతలో పట్టు పెంచుకునే వ్యూహంలో భాగంగా నితిన్ నబిన్‌కు కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు ముందు జరగాల్సిన సంస్థాగత ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇప్పటికే మెజారిటీ చోట్ల అంతర్గత ఎన్నికలు పూర్తయ్యాయి. నిబంధనల ప్రకారం అవసరమైన సంఖ్యకు మించి రాష్ట్రాల్లో ప్రక్రియ ముగియడంతో జాతీయ అధ్యక్ష ఎన్నికకు మార్గం సుగమమైంది. జనవరి 15 తర్వాత రాష్ట్ర అధ్యక్షులను ఢిల్లీకి పిలవనుండగా, 18 నుంచి 20 మధ్య ఎన్నికల తంతు పూర్తికానుంది.

మోదీ–షా ఆశీస్సులు

నితిన్ నబిన్ అభ్యర్థిత్వానికి పార్టీ అగ్రనేతల సంపూర్ణ మద్దతు లభించినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా నామినేషన్‌పై సంతకం చేసే అవకాశం ఉందని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతిపాదకుడిగా వ్యవహరించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ కౌన్సిల్ సభ్యులు నామినేషన్ల ద్వారా మద్దతు తెలపనున్నారు. బీజేపీ సంప్రదాయం ప్రకారం ఈసారి కూడా జాతీయ అధ్యక్ష ఎన్నిక ఏకగ్రీవంగానే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నితిన్ నబిన్ ఒక్కరే నామినేషన్ వేయనున్నారని, పోటీ ఉండే పరిస్థితి లేదని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. నామినేషన్ల పరిశీలన అనంతరం ఆయన ఎన్నికను అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ కీలక ఘట్టానికి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, రాష్ట్ర అధ్యక్షులు హాజరుకానున్నారు.

కొత్త అధ్యాయానికి ఆరంభం

యువ నాయకత్వంతో పార్టీని మరింత బలోపేతం చేయడం, రానున్న ఎన్నికలకు దూకుడు వ్యూహం రూపొందించడం నితిన్ నబిన్ ముందున్న ప్రధాన సవాలుగా మారనుంది. జనవరి 20తో బీజేపీలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వ్యూహకర్త కాదు… విజేత..!

వ్యూహకర్త కాదు... విజేత..! బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ సంచలనం ప్రత్యక్ష రాజకీయాల తొలి...

పురుగులు ప‌రుగులు పెట్టించాయి

పురుగులు ప‌రుగులు పెట్టించాయి ఢిల్లీని కదిలించిన జెన్‌జీ జోరు! హేళనగా పుట్టిన 'కాక్రోచ్ జనతా...

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు పాఠశాల ఆవరణలోనే జరిగిన...

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన ‘మెలోడీ’ జోడీ

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన 'మెలోడీ' జోడీ ఎవియన్‌లో ముచ్చటించుకున్న మోదీ, మెలోనీ సోషల్...

భార్యకు పెళ్లి చేసిన భర్త

భార్యకు పెళ్లి చేసిన భర్త పన్నెండేళ్లు చిన్నవాడైన యువకుడితో వివాహిత ఎఫైర్ మహిళను కలిసేందుకు...

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్ దోపిడీలు, భూకబ్జాల కేసుల్లో అరెస్టయిన ‘ఫాల్తా...

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా! బెంగళూరు అభివృద్ధి శాఖ ఇస్తామని మాటిచ్చి త‌ప్పారు సాగునీటి శాఖ...

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు సీపీఎం నుంచి తృణమూల్ మీదుగా బీజేపీ వైపు నయా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.