epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కవిత రాజీనామా ఆమోదానికి అడ్డెవరు..?

కవిత రాజీనామా ఆమోదానికి అడ్డెవరు..?
ఎమ్మెల్సీ పదవికి నాలుగు నెలల క్రితమే రాజీనామా
చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డికి ఫార్మెట్‌లో లేఖ
ప్రతిపక్ష ఎమ్మెల్సీ విషయంలో మౌనం ఎందుకు?
కేసీఆర్‌ను ఇరకాటంలో పెట్టేందుకేనా ఈ ఆలస్యం?
కవితకు సపోర్ట్ చేస్తున్నట్లుగా సంకేతమా?
తాజా సభలో భావోద్వేగ ప్రసంగం వెనుక వ్యూహం?

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాజకీయాల్లో కవిత రాజీనామా వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఎమ్మెల్సీ పదవికి ఆమె నాలుగు నెలల క్రితమే రాజీనామా చేసినప్పటికీ, ఇప్పటివరకు ఆమోదం పొందకపోవడం అనేక ప్రశ్నలకు దారి తీస్తోంది. ముఖ్యంగా ఈ రాజీనామాను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డికి స్వయంగా ఫార్మెట్‌లో సమర్పించినప్పటికీ, ఎందుకు పెండింగ్‌లో ఉంచారన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా రాజీనామాల విషయంలో చైర్మన్‌కు విచక్షణాధికారాలు ఉంటాయి. కానీ అవి కూడా నిబంధనల పరిధిలోనే. సందేహాలు ఉంటే సభ్యుడిని పిలిపించి వివరణ కోరవచ్చు. అలాంటిదేమీ జరగకుండానే నాలుగు నెలల పాటు మౌనం పాటించడం సహజమేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ప్రతిపక్ష ఎమ్మెల్సీ కాబట్టేనా ఈ వైఖరి?

ఇక్కడ కీలక అంశం—కవిత అధికార పార్టీ ఎమ్మెల్సీ కాదు. ప్రధాన ప్రతిపక్షానికి చెందిన నాయకుడి కుమార్తె. అధికార పక్షానికి చెందిన ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తే అవి రాజకీయ సమన్వయాలతో మేనేజ్ అవడం సాధారణమే. కానీ ప్రతిపక్ష ఎమ్మెల్సీ విషయంలో ఇదే తీరుగా వ్యవహరించడం రాజకీయ ఉద్దేశాలతోనేనా? అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ ఆలస్యం వెనుక కేసీఆర్‌ను రాజకీయంగా ఇరకాటంలో పెట్టాలన్న వ్యూహముందా? లేక కవితను సపోర్ట్ చేస్తున్నట్లుగా సంకేతం ఇవ్వాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచనా? అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వ్యవహారంలో చూపుతున్న విచిత్రమైన వైఖరి మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.

ఇందుకోసమే ఇన్నాళ్లు ఆగారా?

తాజాగా శాసనమండలిలో కవిత చేసిన భావోద్వేగ ప్రసంగం ఈ చర్చలకు మరింత ఆజ్యం పోసింది. “ఇదే చివరి సారి సభలో మాట్లాడుతున్నా” అన్న వ్యాఖ్యలు, గులాబీ పార్టీని ఇరకాటంలో నెట్టేలా చేసిన వ్యాఖ్యానాలు… ఇవన్నీ ముందస్తు రాజకీయ వ్యూహంలో భాగమేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందుకేనా ఇన్నాళ్లూ రాజీనామా ఆమోదాన్ని ఆపి ఉంచారు? సభా వేదికగా ఆమెకు పూర్తి స్థాయిలో మాట్లాడే అవకాశం ఇచ్చేందుకే ఈ ఆలస్యం జరిగిందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయాల్లో వ్యూహాలు సాధారణమే అయినా, సంవిధానబద్ధమైన పదవుల్లో ఉన్నవారు నిబంధనలకు అతీతంగా వ్యవహరించారా? అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్నగా మారింది. మొత్తానికి కవిత రాజీనామా కంటే… ఆ రాజీనామా చుట్టూ కొనసాగుతున్న మౌనం, ఆలస్యం, రాజకీయ సంకేతాలే ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

నీటి కష్టాలకు కేసీఆర్‌ వైఫల్యాలే కార‌ణం

నీటి కష్టాలకు కేసీఆర్‌ వైఫల్యాలే కార‌ణం రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినా...

ఇనుగాల‌కు అవ‌మానం

ఇనుగాల‌కు అవ‌మానం కుడా మాజీ చైర్మ‌న్‌కు నో ఫేర్‌వెల్ ఆఘ మేఘాల మీద నూత‌న...

కాంగ్రెస్‌కు కొండా గుడ్‌బై..?

కాంగ్రెస్‌కు కొండా గుడ్‌బై..? బీఆర్ఎస్‌తో దంప‌తుల‌ మంతనాలు! కేటీఆర్‌ నేరుగా కొండా సురేఖకు ఫోన్‌ గత...

ఇదేం అన్యాయం..!?

ఇదేం అన్యాయం..!? కుడా చైర్‌ప‌ర్స‌న్‌గా సుధారాణి నియామ‌కంపై కాంగ్రెస్‌లో అసంతృప్తి పార్టీ అధికారంలోకి వ‌చ్చాక...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.