epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఇల్లు లేని ప్రతి పేదవాడికి 80 గజాల స్థలం

ఇల్లు లేని ప్రతి పేదవాడికి 80 గజాల స్థలం
సంగారెడ్డి ప్ర‌జ‌ల‌కు టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హామీ

కాకతీయ, సంగారెడ్డి : సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో 2012–13లో ఇళ్ల పట్టాలు పొందినవారితో పాటు ఇప్పటికీ ఇంటి స్థలం లేని పేదలతో సంగారెడ్డి గంజ్ మైదాన్‌లో టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల ముఖా ముఖాముఖి సమావేశం నిర్వహించారు. సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ… తాను 22 సంవత్సరాలు కిరాయి ఇంట్లోనే నివసించానని, అందుకే పేదలకు సొంత ఇంటి స్థలం ఉండాలనే బాధ తనకు ఎక్కువగా ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2013లో అప్పటి సీఎం *కిరణ్ కుమార్ రెడ్డి*తో మాట్లాడి సంగారెడ్డిలో 5,500 మంది పేదలకు 80 గజాల చొప్పున ఇంటి స్థలాలు ఇప్పించానని గుర్తు చేశారు. ఆ రోజు అలియాబాద్, తోగర్‌పల్లిలో పేదలకు ఇచ్చిన స్థలాలను బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో వేరే పనులకు వినియోగించారని ఆరోపించారు. ఇచ్చిన స్థలాలపై పదేళ్లలో ఒక్కరూ ఎందుకు ప్రశ్నించలేదని ప్రజలను ప్రశ్నించారు. ఇప్పుడు మళ్లీ సంగారెడ్డి, కంది మండలాల్లో 200 ఎకరాల భూసేకరణకు కలెక్టర్‌తో చర్చించామని, ఈ జనవరి నుంచే ప్రక్రియ ప్రారంభించి నవంబర్ నాటికి ఒక కొలిక్కి తీసుకొస్తామని తెలిపారు. భూసేకరణ పూర్తయ్యాక మళ్లీ ప్రజలతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. సర్టిఫికెట్లు లేని వారు కూడా మున్సిపల్ కమిషనర్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వెయ్యి నోటు, క్వార్టర్ సీసా కోసం జీవితాలను నాశనం చేసుకోకండని హితవు పలికారు. నెలకు రూ.5,000 కిరాయి చెల్లిస్తే ఏడాదికి రూ.60 వేలు, పదేళ్లకు రూ.6 లక్షలు నష్టపోయారని, ఆ రోజే సరైన నిర్ణయం తీసుకుంటే ఆ డబ్బు మిగిలేదని అన్నారు. తాను ఓడిపోయానని ఎప్పుడూ బాధపడలేదని, అదే ఓటమి వల్ల తన భార్య నిర్మల కార్పొరేషన్ చైర్‌పర్సన్ అయ్యిందని వ్యాఖ్యానించారు. నాలుగున్నరేళ్లు తన వద్ద డబ్బులు ఉంటాయని, ఎన్నికల సమయానికే ఉండవని చమత్కరించారు. తాను ఓటుకు డబ్బులు ఇచ్చే రాజకీయాలు చేయనని స్పష్టం చేశారు.
పదేళ్లు అధికారంలో లేకపోయినా, ఇప్పుడు అధికారంలో ఉన్నామని, తన మాటకు విలువ ఉందని, సీఎం రేవంత్ రెడ్డి తాను చెప్పేది వింటారని చెప్పారు. “జగ్గారెడ్డి గా మాట ఇస్తున్నా… సంగారెడ్డిలో ఇల్లు లేని ప్రతి పేదవాడికి 80 గజాల స్థలం తప్పకుండా ఇస్తాను” అని ఆయన స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు అందె...

రైతులకు సరిపడా యూరియా అందించాలి

రైతులకు సరిపడా యూరియా అందించాలి ఎరువుల విక్రయాల్లో అవినీతిని అరికట్టాలని డిమాండ్‌ ఎమ్మార్పీ ధరలకే...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి * పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఏబీవీపీ...

జీవో 97 రద్దు చేయాలి

జీవో 97 రద్దు చేయాలి పాలిటెక్నిక్‌ విద్యార్థుల ధర్నా, ర్యాలీ కాకతీయ, చేర్యాల: పాలిటెక్నిక్‌...

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి..

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి.. *ప్రజా సమస్యలపై 11 ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు కాకతీయ,చేర్యాల:...

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ బయోమెట్రిక్‌ హాజరుపై ఆరా.. సిబ్బంది...

కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి ఆరోగ్యం మెరుగయ్యే వరకు మెరుగైన వైద్యం...

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ ఇంటింటా జాతీయ జెండా ఎగురవేయాలి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.