epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

డిఫాల్ట్ మిల్లర్లపై జీవో అస్త్రం!

డిఫాల్ట్ మిల్లర్లపై జీవో అస్త్రం!
తేల‌నున్న పెండింగ్ సీఎంఆర్‌ లెక్క‌
90 రోజుల గ‌డువుతో మిల్ల‌ర్ల‌కు అల్టిమేటం
సీఏంఆర్ బకాయిల రికవరీపై ఫుల్ ఫోకస్
కాక‌తీయ క‌థ‌నాల‌తో క‌దులుతున్న‌ యంత్రాంగం

కాకతీయ, కరీంనగర్ బ్యూరో : డిఫాల్ట్ రైస్ మిల్లర్ల పెండింగ్ సీఏంఆర్ బకాయిల రికవరీకి సివిల్ సప్లయ్ శాఖ గట్టిగా నడుం బిగించింది. పేదల బియ్యం మాయం, కరీంనగర్ జిల్లాలో సీఏంఆర్ స్కామ్ అంటూ ఇటీవల వెలువడిన కథనాలతో జిల్లా యంత్రాంగం ఒక్కసారిగా యాక్టివ్ అయ్యింది. ఇప్పటివరకు నామమాత్రంగా సాగిన చర్యలకు బ్రేక్ వేస్తూ, తాజాగా జారీ చేసిన జీవోను ఆయుధంగా మార్చుకుని డిఫాల్ట్ మిల్లర్లపై దృష్టి కేంద్రీకరించింది. తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్, జిల్లా అధికారులు సమన్వయంతో రికవరీ డ్రైవ్ ప్రారంభించారు. కరీంనగర్ జిల్లాలో 2012–13 నుంచి 2023–24 వరకు ప్రభుత్వానికి అందాల్సిన సీఏంఆర్ (కస్టమ్ మిల్ల్డ్ రైస్) బియ్యం భారీగా పెండింగ్‌లోనే ఉంది. అధికారిక లెక్కల ప్రకారం 35,563 మెట్రిక్ టన్నుల బియ్యం డిఫాల్ట్‌గా నమోదై ఉండగా, ప్రస్తుత ధరల ప్రకారం దాని విలువ రూ.137 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఇంతకాలం డిఫాల్ట్‌లు కొనసాగినా కఠిన చర్యలు లేకపోవడం వెనుక అధికారుల అండదండలున్నాయన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజా జీవో అమలు నిజంగా రికవరీకి దారి తీస్తుందా? లేక మరోసారి కాగితాలకే పరిమితమవుతుందా? అన్న ఉత్కంఠ నెలకొంది.

సీఏంఆర్ బకాయిలపై జీవో కొరడా

సీఏంఆర్ బకాయిల నేపథ్యంలో వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & సివిల్ సప్లయ్ శాఖ 24-11-2025న మెమో నెం.2809 / సీఎస్.ఐ–సీసీఎస్ / 2025ను జారీ చేసింది. ఈ జీవో ప్రకారం కేఎంఎస్ 2014–15 నుంచి 2023–24 వరకు డిఫాల్ట్ అయిన మిల్లర్లు అసలు సీఏంఆర్ మొత్తంతో పాటు 25 శాతం పెనాల్టీ, 12 శాతం వడ్డీ కలిపి మొత్తం 125 శాతం విలువ చెల్లించాలి. నగదు గానీ, సన్నబియ్యం రూపంలో గానీ బకాయిలు తీర్చేందుకు కేవలం 90 రోజుల గడువు మాత్రమే ఇచ్చారు. ఈ గడువులోపే పూర్తి చెల్లింపులు చేసిన మిల్లర్లకే భవిష్యత్తులో తాజా వరి అలాట్ చేయాలని జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు. జీవో అమలులో భాగంగా జిల్లా సివిల్ సప్లయ్ అధికారి ఆధ్వర్యంలో డిఫాల్ట్ మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. సుమారు 22 మంది డిఫాల్ట్ మిల్లర్లను పిలిచినా, అర్ధహాజరే కనిపించడంతో అధికారుల్లో అసహనం వ్యక్తమైంది. జీవో నిబంధనలపై కౌన్సిలింగ్ ఇచ్చినా, మిల్లర్ల నిర్లక్ష్య ధోరణి అధికారులను మరింత అప్రమత్తం చేసినట్లు సమాచారం.

కఠిన చర్యల వైపు జిల్లా యంత్రాంగం

ఈసారి బకాయిల రికవరీలో వెనుకడుగు లేదన్న సంకేతాలు జిల్లా యంత్రాంగం నుంచి వస్తున్నాయి. డిఫాల్ట్ మిల్లర్లతో మరో కీలక సమావేశానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హాజరు కాకపోతే లైసెన్సుల రద్దు, ఆస్తుల జప్తు వంటి కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు పంపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జిల్లాలో 19 రైస్ మిల్లులు డిఫాల్ట్‌గా ఉండగా, అధికారికంగా 22 డిఫాల్ట్ ఎంట్రీలు నమోదయ్యాయి. కొన్ని మిల్లులు పునరావృతంగా బకాయిలు పెంచుకుంటుండటంతో పరిస్థితి తీవ్రంగా మారింది. ఇప్పటికైనా జీవో అమలుతో పేదల బియ్యం ప్రభుత్వ ఖాతాలోకి వస్తాయా? డిఫాల్ట్ మిల్లర్లపై నిజంగా చర్యలు పడతాయా? అన్నది రాబోయే 90 రోజుల్లో తేలనుంది. తదుపరి చర్యలపై జిల్లావ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.