epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కాంగ్రెస్‌పై పల్లా పైర్‌..

కాంగ్రెస్ పై పల్లా పైర్

* రెవెన్యూ డివిజన్‌ ఇస్తానని మాట తప్పుతున్న కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలి

* కాంగ్రెస్‌ సర్కారుకు బుద్ధి చెప్పేలా పోరాడుతున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు

* చేర్యాల మున్సిపల్ పీఠం బిఆర్ఎస్ దే

* సమస్యలపై పోరాటాలు చేసే 3వ వార్డు సీపీఎం అభ్యర్థిని గెలిపించాలి

* జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

కాకతీయ,చేర్యాల: ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడానికి ఓట్ల పేరుతో వస్తున్నా కాంగ్రెస్ నాయకులను ఎక్కడికి అక్కడ నిలదీయ్యాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ పిలుపునిచ్చారు. ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి 12 వార్డులల్లో బరిలో ఉన్న అభ్యర్థిలను గెలిపించేందుకు కారు గుర్తుపై ఓటేయాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఓటర్లను కోరారు. మంగళవారం చేర్యాల మున్సిపాలిటీలోని 1,2,3,10,11,12 వార్డులల్లో కార్యకర్తలతో కలిసి ఇంటింట ప్రచారం చేపట్టారు. అనంతరం పలు పార్టీలకు చెందిన యువకులు, నాయకులు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ. సీఎం కేసీఆర్ హయాంలో చేర్యాల మున్సిపాలిటీని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ప్రధానంగా సీసీ రోడ్ల నిర్మాణం సమస్యను తీర్చడమే కాకుండా అర్హులందరికి పింఛన్లు అందజేయడం, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపచేయడం లాంటి కార్యక్రమాలు చేపట్టిన‌ట్లు తెలిపారు. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం అవినీతి విషయంలో అద్భుత ప్రగతి సాధించిందని పైర్ అయ్యారు. కాంగ్రెస్ బూటకపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ఓట్లు దండుకున్నదే కానీ ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. అభివృద్ధే మా మంత్రం గత పదేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులే మన అభ్యర్థులను గెలిపిస్తాయని ఎమ్మెల్యే పల్లా ధీమా వ్యక్తం చేశారు. చేర్యాల ప్రాంత సమగ్ర అభివృద్ధి కేవలం బిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు. అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి, పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ప్రజా సమస్యలపై పోరాటాలు చేసే సీపీఎం అభ్యర్థిని గెలిపించాలి

* ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి,సిపిఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి

నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటాలు చేసే సీపీఎం పార్టీ అభ్యర్థి ముస్త్యాల లావణ్య-ప్రభాకర్ లను గెలిపించాలని కోరారు. 11న జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్, సీపీఎం పొత్తులో భాగంగా మూడో వార్డు సిపిఎం పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న ముస్త్యాల లావణ్య- ప్రభాకర్ ను గెలిపించి నిరంతరం సమస్యలపై పోరాడుతున్న వారిని గెలిపించాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి పిలుపునిచ్చారు. 3వ వార్డులో ప్రచారం నిర్వహించిన అనంతరం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. కాంగ్రెస్ హామీలను అమలు చేయలేదని చేర్యాల మున్సిపాలిటీకి తీవ్రమైన నష్టం చేకూర్చిందని విమర్శించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీలో అక్రమాలకు పాల్పడ్డ కాంగ్రెస్ ను ఓడించాలని వారు కోరారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ రాజీ లేని పోరాటాలు నిర్వహిస్తున్న సీపీఎం అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎన్నికల సమయంలో మాయ మాటలు చెప్పి అనేక హామీలు ఇచ్చి గెలిచిన తర్వాత ఓటు వేసిన వారికి ముఖం కూడా చూపించకుండా తమ స్వలాభాల కోసం వ్యాపారాలు, కబ్జాలు, సెటిల్మెంట్ ల కోసం తిరిగే కాంగ్రెస్ నాయకులకు ఓటు వేయవద్దని కోరారు. ప్రజల కోసం కొట్లాడుతూ తప్పుడు కేసులు మీదేసుకొని లాఠీ దెబ్బలు తిని జైలుకెళ్ళి తిరిగి మళ్లీ ప్రజల కోసం కొట్లాడుతున్న సీపీఎం అభ్యర్థి లావణ్య-ప్రభాకర్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో, సిపిఎం,బిఆర్ఎస్ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రెవెన్యూ డివిజన్‌ ఇస్తానని మాటాతప్పిన కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలి

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాకముందుకు శాసనసభ ఎన్నికల ముందు జనగామ ఎన్నికల సభలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే రెవెన్యూ డివిజన్‌ ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఏర్పాటు చెయ్యకపోవడం ప్రాంత ప్రజలను మోసం చేస్తున్నారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. భువనగిరి ఎంపీగా గెలిచిన చామల కిరణ్‌కుమార్‌రెడ్డి సైతం తాను విజయం సాధించిన వెంటనే రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చి పట్టించుకోవడం లేదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల కోసం వస్తున్న కాంగ్రెస్ నాయకులకు ఈ మున్సిపల్ ఎన్నికల్లో సరైన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో, సిపిఎం,బిఆర్ఎస్ పార్టీల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

 

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు అందె...

రైతులకు సరిపడా యూరియా అందించాలి

రైతులకు సరిపడా యూరియా అందించాలి ఎరువుల విక్రయాల్లో అవినీతిని అరికట్టాలని డిమాండ్‌ ఎమ్మార్పీ ధరలకే...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి * పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఏబీవీపీ...

జీవో 97 రద్దు చేయాలి

జీవో 97 రద్దు చేయాలి పాలిటెక్నిక్‌ విద్యార్థుల ధర్నా, ర్యాలీ కాకతీయ, చేర్యాల: పాలిటెక్నిక్‌...

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి..

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి.. *ప్రజా సమస్యలపై 11 ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు కాకతీయ,చేర్యాల:...

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ బయోమెట్రిక్‌ హాజరుపై ఆరా.. సిబ్బంది...

కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి ఆరోగ్యం మెరుగయ్యే వరకు మెరుగైన వైద్యం...

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ ఇంటింటా జాతీయ జెండా ఎగురవేయాలి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.