epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కరీంనగర్‌లో కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందే

కరీంనగర్‌లో కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందే
సీఎం సభ విజయవంతం చేయాలి
కార్పొరేటర్ అభ్యర్థులతో మంత్రి తుమ్మల కీలక సమావేశం
ప్రతి డివిజన్ నుంచి భారీగా జనసమీకరణకు పిలుపు
అభ్యర్థుల ఎంపిక నిబద్ధత ఆధారంగానే జరిగిందని స్పష్టం

కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఈసారి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాల్సిందేనని జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఎన్నికల పోరులో పార్టీ అభ్యర్థులందరూ సమన్వయంతో పనిచేయాలని, ముఖ్యమంత్రి సభను విజయవంతం చేయడమే గెలుపుకు పునాది అవుతుందని అన్నారు. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ అంజన్ కుమార్ అధ్యక్షతన కార్పొరేటర్ అభ్యర్థులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొని ఎన్నికల వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు.

సీఎం సభే కీలక మలుపు

మానకొండూర్ ఎమ్మెల్యే, పీసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, చొప్పదండి గుమలాపూర్‌లో జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభను ప్రతి ఒక్కరూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని సూచించారు. ఎన్నికలకు మిగిలిన కొద్ది రోజులు అభ్యర్థులు మరింత ఉత్సాహంగా ప్రచారం నిర్వహించాలని, ఈ సభే కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి మార్గం వేస్తుందని అన్నారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి రోజుకు 18 గంటలు ప్రజల కోసమే పనిచేస్తున్నారని తెలిపారు. సుడా పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలని, అవసరమైతే డ్రైనేజీలు, రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కార్పొరేషన్‌లో కాంగ్రెస్ జెండా ఎగరాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
కరీంనగర్ అసెంబ్లీ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్ రావు మాట్లాడుతూ, సీఎం సభకు ప్రతి డివిజన్ నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలను తరలించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. డాక్టర్ అంజన్ కుమార్ మాట్లాడుతూ, సీఎం సభ తర్వాత ఓటర్లలో కాంగ్రెస్ పట్ల మరింత అనుకూల వాతావరణం ఏర్పడుతుందని, పార్టీ విజయావకాశాలు స్పష్టంగా పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, కార్పొరేటర్ అభ్యర్థుల ఎంపిక పూర్తిగా నిబద్ధత, సేవా తత్పరత ఆధారంగానే జరిగిందని స్పష్టం చేశారు. ఎలాంటి పైరవీలు, ఆర్థిక లావాదేవీలకు తావులేకుండా అభ్యర్థులను ఎంపిక చేశామని తెలిపారు. పార్టీ కోసం శ్రమించిన వారికి భవిష్యత్తులో నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ప్రతి డివిజన్‌లో విస్తృత ప్రచారం

ప్రతి అభ్యర్థి తన డివిజన్‌లో ప్రతి ఓటరును నేరుగా కలవాలని, ఇంటింటి ప్రచారం మరింత వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. ముఖ్యమంత్రి సభకు ప్రతి డివిజన్ నుంచి కనీసం 500 మందిని తరలించాలని ఆదేశించారు. రేపటి సభ విజయవంతమైతే కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని తుమ్మల ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, మాజీ హౌస్‌ఫెడ్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, పార్టీ నాయకులు, కార్పొరేటర్ అభ్యర్థులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.