epaper
Wednesday, October 28, 2026
epaper
BREAKING NEWS
Loading News...

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మాదాపూర్ ఎస్‌ఐ

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మాదాపూర్ ఎస్‌ఐ
రూ.50 వేలు డిమాండ్‌… ఏసీబీ ట్రాప్‌లో రెడ్‌హ్యాండెడ్‌గా అరెస్ట్

కాకతీయ, హైదరాబాద్: మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో అవినీతి వ్యవహారం వెలుగుచూసింది. ఓ సివిల్ కేసులో ఫిర్యాదుదారుడికి అనుకూలంగా వ్యవహరించేందుకు రూ.50 వేల లంచం డిమాండ్ చేసిన సబ్‌ ఇన్‌స్పెక్టర్ వినయ్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన నగర పోలీసు వర్గాల్లో కలకలం రేపుతోంది.

ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ

బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు పక్కా వ్యూహంతో ట్రాప్ నిర్వహించారు. సోమవారం ఎస్‌ఐ వినయ్ లంచం మొత్తాన్ని స్వీకరిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. వెంటనే రసాయన పరీక్షలు నిర్వహించగా నగదు తాకిన ఆనవాళ్లు స్పష్టంగా బయటపడినట్లు అధికారులు తెలిపారు. లంచం నగదును స్వాధీనం చేసుకుని ఎస్‌ఐను అదుపులోకి తీసుకున్నారు.

కోర్టులో హాజరు… కఠిన చర్యలు

అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి, నిందిత ఎస్‌ఐను ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచే ప్రక్రియ చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేసిన సందర్భాల్లో ప్రజలు భయపడకుండా వెంటనే ఏసీబీని ఆశ్రయించాలని సూచించారు.

అవినీతికి సంబంధించిన ఫిర్యాదుల కోసం ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వ వ్యవస్థల్లో పారదర్శకత కోసమే ఇలాంటి చర్యలు కొనసాగుతాయని పేర్కొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఓటు చోరీపై సమరభేరి!

ఓటు చోరీపై సమరభేరి! నవంబర్‌ 1న ఢిల్లీ నిరసనకు సన్నాహాలు గల్లీగల్లీలో ఓటు హక్కుల...

బ్రిక్స్‌ వేదికపై తెలంగాణ గొంతు

బ్రిక్స్‌ వేదికపై తెలంగాణ గొంతు ఢిల్లీ సమావేశాలకు బయలుదేరిన శాసనసభాపతి రాష్ట్ర ప్రగతి, కీలక...

నీటి వృథాపై జలమండలి కొరడా

నీటి వృథాపై జలమండలి కొరడా ప్యారడైజ్‌ హోటల్‌కు రూ.20 వేల జరిమానా తనిఖీల్లో తాగునీటి...

నీటి పొదుపే.. భవిష్యత్తుకు భరోసా!

నీటి పొదుపే.. భవిష్యత్తుకు భరోసా! ప్రతి ఇంట్లో 20 శాతం నీటి వినియోగం...

గచ్చిబౌలిలో లెదర్ కామన్ ఫెసిలిటీ సెంటర్

గచ్చిబౌలిలో లెదర్ కామన్ ఫెసిలిటీ సెంటర్ డిజైనింగ్ నుంచి బ్రాండింగ్ వరకు ఆర్టిజన్లకు...

పేదల బియ్యంతో.. మిల్లులో దందా!

పేదల బియ్యంతో.. మిల్లులో దందా! ఇబ్రహీంపట్నం రైస్‌ మిల్లులో 829 బస్తాలు పట్టివేత న్యూ...

భూసార పరిరక్షణకు ‘ఖేత్‌ బచావో అభియాన్‌’

భూసార పరిరక్షణకు ‘ఖేత్‌ బచావో అభియాన్‌’ నేల తల్లిని కాపాడితేనే భవిష్యత్‌ తరాలకు...

హనీట్రాప్‌లో ఏసీపీ, ఇన్‌స్పెక్టర్‌!

హనీట్రాప్‌లో ఏసీపీ, ఇన్‌స్పెక్టర్‌! మాజీ ప్రియురాలి సాయంతో సైబర్‌ నేరగాడి వలపు వల వెయ్యి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.