epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మున్సిపల్ కౌంటింగ్‌లో కాంగ్రెస్ జోరు..!

మున్సిపల్ కౌంటింగ్‌లో కాంగ్రెస్ జోరు..!
రాష్ట్రవ్యాప్తంగా 345 వార్డుల్లో కాంగ్రెస్ విజయం
90కుపైగా వార్డుల్లో బీఆర్ఎస్ గెలుపు.. గట్టి పోటీ సంకేతాలు
సూర్యాపేటలో వీరజవాన్ల కుటుంబ సభ్యులు వెనుకంజలో
దేవరకద్ర మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలోకి.. స్పష్టమైన మెజార్టీ

కాకతీయ, తెలంగాణ‌ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళ్తోంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా 345 వార్డులను గెలుచుకుని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా గట్టి పోటీ ఇస్తూ ఇప్పటికే 90కుపైగా వార్డులను కైవసం చేసుకుంది. దీంతో పలు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ముందంజలో ఉన్నప్పటికీ, బీఆర్ఎస్ ప్రతిఘటన కూడా స్పష్టంగా కనిపిస్తోంది.

సూర్యాపేటలో వీరజవాన్ల కుటుంబ సభ్యులు వెనుకంజ

సూర్యాపేట మున్సిపాలిటీలో ఆసక్తికర పరిస్థితులు నెలకొన్నాయి. వీరజవాన్ల కుటుంబాలకు చెందిన ఇద్దరు బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రస్తుతం వెనుకంజలో ఉన్నట్లు సమాచారం. 44వ వార్డులో గాలివీరు బీరడు సంతోష్ తల్లి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా, ఆమె ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థిపై వెనుకబడి ఉన్నారు. అలాగే 46వ వార్డులో కార్గిల్ వీరజవాను కుటుంబానికి చెందిన అభ్యర్థి మౌరికా కూడా ప్రస్తుతం
వెనుకంజలో కొనసాగుతున్నారు. వీరజవాన్ల కుటుంబాలకు చెందిన అభ్యర్థులను బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా బరిలోకి దింపినప్పటికీ, ప్రస్తుతం వెలువడుతున్న ట్రెండ్ ప్రకారం కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. తుది ఫలితాల వరకు ఈ వార్డులపై ప్రత్యేక ఉత్కంఠ నెలకొంది.

దేవరకద్ర మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలోకి

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన విజయాన్ని నమోదు చేసింది. మొత్తం 12 వార్డులలో కాంగ్రెస్ పార్టీ 7 వార్డులను గెలుచుకుని మున్సిపాలిటీపై ఆధిపత్యాన్ని సాధించింది. బీఆర్ఎస్ పార్టీ 4 వార్డుల్లో విజయం సాధించగా, బీజేపీ కేవలం ఒక వార్డుకు మాత్రమే పరిమితమైంది.
దీంతో దేవరకద్ర మున్సిపాలిటీ అధికారికంగా కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి చేరింది. ఈ విజయంతో మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో ముందంజలో కొనసాగుతుండగా, బీఆర్ఎస్ పార్టీ కూడా పలు చోట్ల గట్టి పోటీ ఇస్తోంది. మిగిలిన వార్డుల ఫలితాలు వెలువడిన తర్వాతే పూర్తి స్థాయి రాజకీయ దృశ్యం స్పష్టమయ్యే అవకాశం ఉంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.