epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మీడియా ముందుకు దేవ్‌జీ

మీడియా ముందుకు దేవ్‌జీ
డీజీపీ బి. శివధర్‌రెడ్డి సమక్షంలో లొంగుబాటు
ఆయ‌న‌తో పాటు మల్లా రాజిరెడ్డి, దామోదర్, నూనె నరసింహారెడ్డి సైతం
గుర్తుపట్టలేనంతగా మారిన మాజీ మావోయిస్టు అగ్రనేతలు
అగ్ర నాయకత్వానికి కోలుకోలేని దెబ్బ

కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ మావోయిస్టు ఉద్యమ చరిత్రలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీపీఐ (మావోయిస్టు) పార్టీ అగ్రనేత, పార్టీ జనరల్ సెక్రటరీగా భావిస్తున్న తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ (62) తన అనుచరులతో కలిసి మంగళవారం హైదరాబాద్‌లో రాష్ట్ర డీజీపీ బి. శివధర్‌రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉన్న అగ్రనేత బహిరంగ వేదికపై ప్రత్యక్షం కావడం భద్రతా వర్గాల్లో చర్చనీయాంశమైంది. దేవ్‌జీతో పాటు సెంట్రల్ కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి (సంగ్రామ్), రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు (దామోదర్), రాష్ట్ర కమిటీ సభ్యుడు నూనె నరసింహారెడ్డి (గంగన్న) కూడా లొంగుబాటు చేసినట్లు పోలీసులు ప్రకటించారు. మావోయిస్టు పార్టీ అగ్రనాయకత్వ నిర్మాణంలో కీలక స్థానాల్లో ఉన్న ఈ నేతల లొంగుబాటు సంస్థకు గట్టి దెబ్బగా విశ్లేషిస్తున్నారు. దాదాపు 44 ఏళ్ల పాటు అండర్‌గ్రౌండ్‌లో కార్యకలాపాలు కొనసాగించిన దేవ్‌జీ వయసు పైబడటం, ఆరోగ్య సమస్యలు, నిరంతర కూంబింగ్ ఆపరేషన్లు, సహచరుల అరెస్టులు వంటి కారణాలతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నట్లు సమాచారం.

మీడియా ముందుకు వచ్చినప్పుడు ఆయనను గుర్తుపట్టలేనంతగా మారిపోయిన రూపం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. డీజీపీ శివధర్‌రెడ్డి మాట్లాడుతూ, “హింసా మార్గాన్ని విడిచి ప్రధాన స్రవంతిలోకి రావాలనుకునే వారికి ప్రభుత్వం పూర్తి భరోసా ఇస్తుంది. పునరావాస పథకం కింద రక్షణ, ఆర్థిక సహాయం, చట్టబద్ధ జీవనానికి అవసరమైన మద్దతు అందించబడుతుంది” అని తెలిపారు. దేవ్‌జీపై సుమారు రూ.1 కోటి రివార్డు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ లొంగుబాటుతో తెలంగాణ రాష్ట్ర కమిటీ దాదాపు నిర్వీర్యమైందని, పార్టీ అగ్రనాయకత్వం కుప్పకూలినట్లేనని భద్రతా వర్గాలు పేర్కొంటున్నాయి. ఆపరేషన్ కగార్–2 నేపథ్యంలో భద్రతా దళాలు పట్టు బిగించడంతో అగ్రనేతలపై ఒత్తిడి పెరిగిన దశలో ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తదుపరి చట్టపరమైన ప్రక్రియల అనంతరం పునరావాస చర్యలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.