epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పదేళ్ల సమస్యకు కదలిక..!

పదేళ్ల సమస్యకు కదలిక..!
అద్దె భవనం నుంచి ఆర్టీఏ తరలింపున‌కు చర్యలు
టెక్స్టైల్ పార్క్‌లో తాత్కాలిక కంటైనర్ ఏర్పాటు
మంచినీటి కోసం బోర్.. వేచిచూడటానికి షెడ్లు..
విద్యుత్ లైన్ లేక తరలింపులో ఆలస్యం
శాశ్వత భవనానికి రూ.8.50 కోట్ల ప్రతిపాదనలు
‘కాకతీయ’ కథనానికి స్పందించిన మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌
త‌క్ష‌ణం త‌ర‌లింపున‌కు అధికారుల‌కు ఆదేశాలిచ్చిన మంత్రి

కాకతీయ, రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలో దాదాపు పదేళ్లుగా కొనసాగుతున్న ఆర్టీఏ కార్యాలయ సమస్యకు పరిష్కారం దిశగా కదలిక ప్రారంభమైంది. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌లో అద్దె భవనంలో కొనసాగుతున్న ఆర్టీఏ కార్యాలయాన్ని టెక్స్టైల్ పార్క్‌లోని సొంత స్థలానికి తరలించేందుకు రవాణా శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఇరుకైన గదులు, సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో సిబ్బంది, వాహన వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలను “దూరం… భారం..” అనే కథనం కాకతీయ దినపత్రిక వెలుగులోకి తీసుకువ‌చ్చిన విష‌యం పాఠ‌కుల‌కు విదిత‌మే. అధికారులు స్పందించి కార్యాలయ తరలింపు ప్రక్రియను వేగవంతం చేశారు.

ఆర్టీఏ కార్యాల‌యానికి కేటాయించిన‌ టెక్స్టైల్ పార్క్ స్థ‌లంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక కంటైన‌ర్‌

టెక్స్టైల్ పార్క్‌లో తాత్కాలిక ఏర్పాట్లు

ఆర్టీఏ కార్యాలయాన్ని టెక్స్టైల్ పార్క్‌కు తరలించే ప్రక్రియలో భాగంగా ఆ శాఖకు కేటాయించిన ఐదు ఎకరాల స్థలంలో అధికారులు తాత్కాలికంగా ఒక కంటైనర్ ఏర్పాటు చేశారు. కార్యాలయ అవసరాల కోసం మంచినీటి సౌకర్యం కల్పించేందుకు బోర్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే వాహన వినియోగదారులు వేచి ఉండేందుకు ప్రత్యేక షెడ్ల నిర్మాణానికి పనులు ప్రారంభించారు. అయితే అక్కడ ఇప్పటివరకు విద్యుత్ సరఫరా లేకపోవడం కార్యాలయాన్ని పూర్తిస్థాయిలో తరలించడంలో ప్రధాన అడ్డంకిగా మారింది. సంబంధిత శాఖలతో సమన్వయం చేసి విద్యుత్ లైన్ ఏర్పాటు చేసే ప్రక్రియను అధికారులు ప్రారంభించినట్లు సమాచారం. విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి వచ్చిన వెంటనే కార్యాలయాన్ని పూర్తిగా టెక్స్టైల్ పార్క్‌కు తరలించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

నూత‌న కార్యాల‌యం ఆవ‌ర‌ణ‌లో బోరు వేసిన దృశ్యం

శాశ్వత భవనానికి ప్రతిపాదనలు

ఆర్టీవో కార్యాలయానికి శాశ్వత సొంత భవనం నిర్మాణం కోసం సుమారు రూ.8.50 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపినట్లు జిల్లా రవాణా శాఖ అధికారులు తెలిపారు. రవాణా శాఖకు ఇప్పటికే సొంత స్థలం ఉన్నప్పటికీ భవన నిర్మాణానికి అవసరమైన నిధులు అందకపోవడంతో ఇప్పటివరకు కార్యాలయం అద్దె భవనంలోనే కొనసాగుతోంది. రాబోయే బడ్జెట్‌లో ఈ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా స్పందించారు. రవాణా శాఖకు చెందిన సొంత భవనాల నిర్మాణం కోసం చర్యలు తీసుకుంటామని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా సేవలను అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారుల‌తో చెప్ప‌డం గ‌మ‌నార్హం. ప్రస్తుతం తాత్కాలిక ఏర్పాట్లతో సేవలను ఒకే ప్రాంగణంలో అందుబాటులోకి తీసుకువచ్చి, అనంతరం పూర్తి స్థాయి సొంత భవన నిర్మాణాన్ని చేపట్టాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. అవసరమైన మౌలిక సదుపాయాలు త్వరగా కల్పిస్తే ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులు గణనీయంగా తగ్గుతాయని భావిస్తున్నారు. రవాణా శాఖలో చేపడుతున్న ఈ చర్యలు జిల్లా ప్రజలకు మెరుగైన సేవలకు దారితీసే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఫిబ్ర‌వ‌రి 28న కాక‌తీయ దిన‌ప‌త్రిక‌లో వ‌చ్చిన క‌థ‌నం

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.