epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

గజ్వేల్ ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీలో 99 రోజుల కార్యక్రమాలకు శ్రీకారం

గజ్వేల్ ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీలో 99 రోజుల కార్యక్రమాలకు శ్రీకారం

– మున్సిపల్ కార్యాలయం నుంచి ఇందిరా పార్క్ చౌరస్తా వరకు ర్యాలీ
– పట్టణ అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేయాలీ
– వార్డు 16లో శిథిల గోడల పరిశీలన – వెంటనే చర్యలకు ఆదేశాలు
– ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలి
– చైర్‌పర్సన్ చందన రవీందర్, కమిషనర్ వెంకట గోపాల్
– మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి

కాకతీయ, గజ్వేల్ : గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పలు కార్యక్రమాలు నిర్వహించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్ అధ్యక్షతన, కమిషనర్ ఆర్. వెంకట గోపాల్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఉదయం 09:00 గంటలకు మున్సిపల్ కార్యాలయం వద్ద తెలంగాణ జాతీయ గీతం ఆలపించిన అనంతరం 99 రోజుల యాక్షన్ ప్లాన్ విజయవంతం చేయుటకు ప్రతిజ్ఞ చేశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం నుంచి ఇందిరా పార్క్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ చందన రవీందర్ మాట్లాడుతూ… పట్టణ అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా పాలకవర్గ సభ్యులందరూ కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు. అనంతరం ర్యాలీగా పాత ఎంపీడీఓ కార్యాలయం వరకు వెళ్లారు. అక్కడ ఉన్న భవనాన్ని వయోవృద్ధుల పెన్షన్ పంపిణీ కేంద్రంగా, యువత కోసం రీడింగ్ రూమ్‌గా ఉపయోగించుకునేలా అందుబాటులోకి తీసుకురావాలని వార్డు ప్రజలు చైర్‌పర్సన్, కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి పట్టణ అభివృద్ధి కోసం తాము ఎప్పుడూ ముందుండి సహకరిస్తామని, ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు.

 

అనంతరం వార్డు నెంబర్ 16లో పాత ఎంపీడీఓ కార్యాలయం వెనుక శిథిలావస్థలో ఉన్న గోడలను పరిశీలించారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని చైర్‌పర్సన్ చందన రవీందర్, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి కమిషనర్ ఆర్. వెంకట గోపాల్‌కు ఆదేశించారు. అదే సమయంలో మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య పనులను ప్రారంభించి శుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. మురికి కాలువల్లో దోమల నివారణ కోసం పీచుకారి చేయడంతో పాటు క్రిమిసంహారక బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. అదేవిధంగా మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో పనికి రాని ఫర్నిచర్, స్క్రాప్ వస్తువులను తొలగించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కళ్యాణ్‌కర్ పద్మాబాయి నర్సింగరావు, కౌన్సిల్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రముఖులు, సెక్షన్ హెడ్లు, మెప్మా సిబ్బంది, ఎస్‌హెచ్‌జీ సభ్యులు, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు అందె...

రైతులకు సరిపడా యూరియా అందించాలి

రైతులకు సరిపడా యూరియా అందించాలి ఎరువుల విక్రయాల్లో అవినీతిని అరికట్టాలని డిమాండ్‌ ఎమ్మార్పీ ధరలకే...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి * పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఏబీవీపీ...

జీవో 97 రద్దు చేయాలి

జీవో 97 రద్దు చేయాలి పాలిటెక్నిక్‌ విద్యార్థుల ధర్నా, ర్యాలీ కాకతీయ, చేర్యాల: పాలిటెక్నిక్‌...

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి..

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి.. *ప్రజా సమస్యలపై 11 ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు కాకతీయ,చేర్యాల:...

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ బయోమెట్రిక్‌ హాజరుపై ఆరా.. సిబ్బంది...

కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి ఆరోగ్యం మెరుగయ్యే వరకు మెరుగైన వైద్యం...

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ ఇంటింటా జాతీయ జెండా ఎగురవేయాలి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.