epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మల్లెపచ్చం వాగుపై బ్రిడ్జి నిర్మాణం ఎప్పుడు?

మల్లెపచ్చం వాగుపై బ్రిడ్జి నిర్మాణం ఎప్పుడు?
500 ఎకరాల వ్యవసాయ భూములకు రాకపోకల సమస్య
ఏళ్లుగా ఎదురుచూపులు.. వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు
ఎన్నిక‌ల వాగ్దానంగా మిగులుతున్న బ్రిడ్జి నిర్మాణం

కాకతీయ,శంకరపట్నం : మండలంలోని కేశవపట్నం గ్రామ పరిధిలో ప్రవహిస్తున్న మల్లెపచ్చం వాగుపై వంతెన నిర్మాణం చేపట్టాలని స్థానిక రైతులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ప్రతిసారీ ఎన్నికల సమయంలో హామీలు ఇస్తున్న నాయకులు, తర్వాత మాత్రం సమస్యను పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాగుపై బ్రిడ్జి లేకపోవడం వల్ల గ్రామీణ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. మల్లెపచ్చం వాగు అవతల వైపున దాదాపు 500 ఎకరాలకు పైగా సస్యశ్యామల వ్యవసాయ భూములు ఉన్నాయి. ఈ భూములకు చేరుకోవాలంటే తప్పనిసరిగా వాగును దాటాల్సిందే. అయితే వర్షాకాలంలో వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో రైతులు తమ పొలాలకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. పంటల సాగు ఆలస్యం కావడం, కోతల సమయంలో నష్టం కలగడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని రైతులు చెబుతున్నారు.

వర్షాల్లో నరకయాతన..

ప్రతి వర్షాకాలంలో పరిస్థితి మరింత విషమంగా మారుతోంది. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న సమయంలో వాగు దాటడం ప్రమాదకరంగా మారుతోంది. అత్యవసర పరిస్థితుల్లో కూడా గ్రామస్తులు సైదాపూర్ రోడ్డుమార్గం ద్వారా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. దీంతో సమయం వృథా కావడమే కాకుండా, ఆటోలు అద్దెకు తీసుకోవాల్సి రావడంతో అదనపు ఖర్చులు భరించాల్సి వస్తోందని మహిళలు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిసార్లు విద్యార్థులు పాఠశాలలకు వెళ్లలేకపోతున్న పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి.

వాగ్దానాలకే పరిమితమైన నాయకులు..

ఇప్పటివరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఈ సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యారని స్థానికులు విమర్శిస్తున్నారు. ప్రతి ఎన్నికల సమయంలో బ్రిడ్జి నిర్మాణంపై హామీలు ఇచ్చినా, వాటి అమలు మాత్రం జరగలేదని ఆరోపిస్తున్నారు. ప్రజల సమస్యలను రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగిస్తున్నారని మండిపడుతున్నారు. గతంలో కమలాపూర్ నియోజకవర్గ పరిధిలో ఉన్నప్పుడు మాజీ మంత్రి ఈటల రాజేందర్, బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఈ ప్రాంతాన్ని సందర్శించి సమస్యను పరిశీలించినప్పటికీ, శాశ్వత పరిష్కారం చూపడంలో విఫలమయ్యారని గ్రామస్తులు గుర్తుచేశారు. పలుమార్లు అధికారులు కూడా పరిశీలించినా, పనులు మాత్రం ప్రారంభం కాలేదని అంటున్నారు.

సాంక్షన్ అయినా పనులు ఎందుకు నిలిచాయి?

టీఆర్‌ఎస్ ప్రభుత్వ కాలంలో మల్లెపచ్చం వాగుపై వంతెన నిర్మాణానికి అనుమతులు మంజూరయ్యాయని సమాచారం ఉన్నప్పటికీ, ఇప్పటివరకు పనులు ప్రారంభం కాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. నిధుల కొరతనా? లేక పరిపాలనా నిర్లక్ష్యమా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనిపై స్పష్టత ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ప్రస్తుత మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కప్పంపల్లి సత్యనారాయణ స్పందించి వెంటనే వంతెన నిర్మాణ పనులు ప్రారంభించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే రాకపోకలు సులభమవడంతో పాటు వ్యవసాయ కార్యకలాపాలు వేగవంతం అవుతాయని, గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్పటికైనా ప్రభుత్వం స్పందించి మల్లెపచ్చం వాగుపై వంతెన నిర్మాణాన్ని తక్షణం ప్రారంభిస్తుందా? లేక మరోసారి హామీలకే పరిమితం అవుతుందా? అన్నది వేచి చూడాల్సి ఉంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.