epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పోటు రంగారావుపై దేశద్రోహం కేసులు ఎత్తివేయాలి..!

పోటు రంగారావుపై దేశద్రోహం కేసులు ఎత్తివేయాలి..!
ప్రజా సమస్యలపై పోరాటం చేసినందుకే కేసులా..?
తప్పుడు కేసులతో వేధింపులు.. సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ నేతల ఆగ్ర‌హం

కాకతీయ, ఖమ్మం బ్యూరో : సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ కేంద్ర కమిటీ సహాయ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి పోటు రంగారావుపై కేంద్ర ప్రభుత్వం, ఎన్‌ఐఏ నమోదు చేసిన దేశద్రోహం, ఇతర కుట్ర కేసులను వెంటనే ఎత్తివేయాలని పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఖమ్మంలో రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో కేంద్ర కమిటీ నాయకులు కేజీ రామచందర్, కే రమ, కే రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య తదితరులు పాల్గొని మాట్లాడారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న వారిని అణచివేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం దేశద్రోహం కేసులను బనాయిస్తోందని వారు ఆరోపించారు. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించినందుకు నేతలను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు.

ప్రజా ఉద్యమాలను అణచివేత ప్రయత్నమా..?

సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ చట్టబద్ధంగా బహిరంగ కార్యకలాపాలు నిర్వహిస్తూ ప్రజా సమస్యలపై పోరాడుతోందని, అలాంటి పార్టీపై కుట్ర కేసులు నమోదు చేయడం అన్యాయమని నాయకులు పేర్కొన్నారు. ప్రజలను చైతన్య పరుస్తున్నందుకే పాలకవర్గాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయని అన్నారు. ప్రొఫెసర్ సాయిబాబా, ఉమర్ ఖలీదు వంటి పలువురిపై కూడా ఇలాంటి కేసులు పెట్టి తర్వాత ఉపసంహరించుకున్న ఉదాహరణలు ఉన్నాయని గుర్తుచేశారు. జర్నలిస్టులపై కూడా కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు.

తక్షణమే కేసులు ఉపసంహరించుకోవాలి

పోటు రంగారావు దాదాపు యాభై ఏళ్లుగా ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటున్నారని, అలాంటి వ్యక్తిపై తప్పుడు ఆరోపణలు చేయడం సరైంది కాదన్నారు. ప్రజల కోసం పోరాడుతున్న వారిని అణచివేయాలనే ప్రయత్నంగా ఈ కేసులను చూస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే దేశద్రోహం, ఇతర కేసులను ఉపసంహరించుకోవాలని, లేకపోతే పోరాటాన్ని మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు.
ఈ ప్రెస్ మీట్ లో పార్టీ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు కే సూర్యం ఎస్ఎల్ పద్మ, సదానందం ఎం కృష్ణారెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులుగుర్రం అచ్చయ్య, సీ వై పుల్లయ్య, ఆవుల అశోక్, జిరామయ్య, పార్టీ జిల్లా నాయకులు మలీదు నాగేశ్వరరావు, కమ్మ కోమటి నాగేశ్వరరావు,టి ఝాన్సీ, ఎన్ ఆజాద్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.