epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ఇప్ప పువ్వు , తేనె సేకరణతో మహిళా సంఘాలకు ఉపాధి
అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు
అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం పంపిణీ
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క

కాకతీయ, ఏటూరునాగారం : పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె, ఇప్ప పువ్వు, తేనె సేకరణ ద్వారా మహిళా సంఘాలకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి గృహ స్వప్నాన్ని సాకారం చేస్తున్నామని, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు పౌష్టికాహారం అందించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. శుక్రవారం గంగారం గ్రామ పంచాయతీ పరిధిలోని అన్నారం గ్రామంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో రూ.15 లక్షల సీఆర్‌ఆర్ నిధులతో చేపట్టనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం అంకంపల్లి గ్రామంలో ఐటిడిఎ నిధులతో సుమారు రూ.83 లక్షల వ్యయంతో ఆర్ అండ్ బి రహదారి నుండి గ్రామం వరకు నిర్మించనున్న బీటీ రహదారికి పునాది వేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఆమె పేర్కొన్నారు. అదే కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహప్రవేశాలను నిర్వహించి, పలువురికి ఇళ్ల మంజూరు పట్టాలను పంపిణీ చేశారు. గూడు లేని ప్రతి పేదవాడికి సొంత ఇల్లు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారం, ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చొరవతో ములుగు నియోజకవర్గానికి 5 వేల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు వెల్లడించారు.

త్వరలోనే రెండో విడత ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు

త్వరలోనే అర్హులైన వారికి రెండో విడతలో మరిన్ని ఇళ్లు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి స్థానిక అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులతో మమేకమయ్యారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని, పౌష్టికాహారం సరఫరాలో ఎటువంటి లోపాలు ఉండకూడదని అధికారులను ఆదేశించారు. మెనూ అమలు పట్ల కచ్చితమైన పర్యవేక్షణ అవసరమని సూచించారు. అంకంపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా ఎంపిక చేసి పైలట్ ప్రాజెక్ట్ కింద అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. గతంలో రహదారి సౌకర్యం లేక ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ఆర్ అండ్ బి రోడ్డు నుండి గ్రామం వరకు బీటీ రహదారి నిర్మాణానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని మంత్రి సీతక్క తెలిపారు. మహిళా సంఘాల ద్వారా ఇప్ప పువ్వు, తేనె సేకరణ వంటి స్థానిక వనరులను ప్రోత్సహించడం ద్వారా మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సంపత్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, పంచాయతీరాజ్ టీఈ అజయ్ కుమార్, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.