ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి రక్తదానం
కాకతీయ, హుజురాబాద్ : భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గంలోని హుజురాబాద్, జమ్మికుంట, ఇల్లంతకుంట మండలాల్లో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు అర్పించి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలు దేశానికి చిరస్మరణీయమని పేర్కొన్నారు.అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఐ క్యాంప్, రక్తదాన శిబిరాల్లో ఎమ్మెల్యే పాల్గొని స్వయంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

