పాత్రికేయుని కుటుంబానికి అండగా ఉంటాం
ప్రభుత్వం తరఫున వచ్చే పథకాలు అందేలా చూస్తాం
టియూడబ్ల్యూజే ఐజెయూ జిల్లా అధ్యక్షుడు గాండ్ల శ్రీనివాస్
కాకతీయ, కరీంనగర్ : ఇటీవల గుండెపోటుతో మరణించిన సీనియర్ పాత్రికేయులు సంబోజి శేఖర్ కుటుంబానికి అండగా ఉంటామని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టియూ డబ్ల్యూజే ఐజేయూ) జిల్లా అధ్యక్షులు గాండ్ల శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా అధ్యక్షులు, యూనియన్ నాయకులతో కలిసి చొప్పదండి పట్టణంలోని శేఖర్ కుటుంబ సభ్యులను పరామర్శించి యూనియన్ తరపున రూ.10వేలు, జిల్లా పాత్రికేయుల నుండి సేకరించిన రూ.31వేలు మొత్తం రూ.41వేలను ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా టియూ డబ్ల్యూజే ఐజేయూ జిల్లా అధ్యక్షులు గాండ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా పత్రిక రంగానికి అందించారని గుండెపోటుతో మరణించడం పత్రికా రంగానికి తీరని లోటని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శేఖర్ టియూడబ్ల్యూజే ఐజేయూ జిల్లా కార్యవర్గ సభ్యునిగా సంఘానికి ఎనలేని సేవ చేశాడని అన్నారు. సంఘం మంచి పాత్రికేయుని కోల్పోవడం బాధాకరమని అన్నారు. వారి కుటుంబం కడు పేదరికంలో ఉంది పరిస్థితులు చాలా దిన స్థితిలో ఉన్నాయని ఆవేదన చెందారు. శేఖర్ కుటుంబానికి తెలంగాణ మీడియా అకాడమీ ద్వారా 1 లక్ష రూపాయల ఆర్ధిక సహాయాన్ని అదేవిధంగా నెలకు 3 వేల చొప్పున 5 సంవత్సరాలు అందేవిధంగా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో టియూడబ్ల్యూజే ఐజేయూ జిల్లా కార్యదర్శి కొయ్యడ చంద్రశేఖర్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎలగందుల రవీందర్, జిల్లా కోశాధికారి గాజుల వెంకటేష్, ఉపాధ్యాక్షులు గాండ్ల సంపత్, పాత్రికేయులు బొడిగె వెంకటేష్, కందులు స్కైలాబ్ తదితరలు పాల్గొన్నారు.

