మాంటిస్సోరిలో ఫుడ్ ఫెస్టివల్ సందడి
కాకతీయ, నెక్కొండ : నెక్కొండ మండల కేంద్రంలోని మాంటిస్సోరి హై స్కూల్‌లో శనివారం ఫుడ్ ఫెస్టివల్ ఉత్సాహంగా నిర్వహించారు. నర్సరీ నుంచి 6వ తరగతి వరకు విద్యార్థులు పాల్గొని పాఠశాల ఆవరణలో వివిధ రకాల ఆహార పదార్థాలను ప్రదర్శించారు. చిన్నారులు తమ ఇళ్ల నుంచి తెచ్చిన వంటకాలను పరస్పరం పంచుకుంటూ ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో పంచుకునే భావనతో పాటు మంచి అలవాట్లు, ఆరోగ్యకరమైన ఆహారం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. పాఠశాల యాజమాన్యంమాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు.ప్రిన్సిపాల్ కొత్త మధుకర్ రెడ్డి మాట్లాడుతూ ఫుడ్ ఫెస్టివల్‌ల ద్వారా విద్యార్థుల్లో సామాజిక విలువలు, సహకార భావం పెంపొందుతాయని తెలిపారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కరస్పాండెంట్ తాటిపర్తి అంజన్ రెడ్డి పరిశుభ్రతపై విద్యార్థులకు సూచనలు చేశారు. ఆహారం తయారు చేసే ముందు, తినే ముందు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని, శుభ్రమైన పాత్రలు ఉపయోగించాలని, ఆహారాన్ని కప్పి ఉంచాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ట్రెజరర్ డాక్టర్ ఆర్ ఆనందరావు మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉండాలంటే పుష్టికరమైన ఆహారం తీసుకోవడం అవసరమని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

