పకడ్బందీగా మోడల్ ఎగ్జామ్స్
కాకతీయ,కారేపల్లి: సింగరేణి మండలంలో విద్యార్థుల సౌకర్యార్థం అన్ని చర్యలు తీసుకుని ఎక్కడా చిన్న పొరపాటు కూడా జరగకుండా అధికారులు సమష్టిగా పనిచేశారని మండల విద్యాశాఖ అధికారి దుగ్గిరాల జయరాజు తెలిపారు. కారేపల్లి మండలంలోని సింగరేణి మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షల సందర్భంగా ఆయన ఈ విషయాలు వెల్లడించారు. సింగరేణి మండల కేంద్రంలో నిర్వహించిన మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలకు ముందుగానే మండల విద్యాశాఖ అధికారులు సమగ్ర ఏర్పాట్లు చేసి, పరీక్షలు క్రమశిక్షణతో సాగేందుకు చర్యలు చేపట్టారు. మండలంలోని జడ్పీ ఎస్ ఎస్ హైస్కూల్ మరియు టి జి ఎం ఎస్ పాఠశాలలను పరీక్షా కేంద్రాలుగా ఏర్పాటు చేసి నిబంధనలను కచ్చితంగా అమలు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయడంతో పాటు విద్యార్థులను హాల్ టికెట్ల సమగ్ర పరిశీలన అనంతరం మాత్రమే పరీక్షా గదుల్లోకి అనుమతించారు. ఫోటోలు, వివరాలు సరిచూసి క్రమపద్ధతిలో విద్యార్థులను పంపించడం ద్వారా పారదర్శకతకు పెద్దపీట వేశారు.

