సారీ పేరెంట్స్
శ్రీవిద్య స్కూల్ రాధిక స్కూలోనే ఉంది
కాకతీయ పేపర్ లో కథనాలు వస్తుంటే అలా చెప్పాల్సి వచ్చింది
రాధిక స్కూల్ ప్రిన్సిపాల్ మీడియా ముందు చెప్పింది అబద్ధమే
శ్రీవిద్య స్కూల్ బిల్డింగ్ ను ప్రభుత్వ గురుకులం పాఠశాలకు కిరాయికి ఇచ్చాం
ప్రభుత్వం నుంచి నెలకు సుమారు రూ. 3లక్షలు కిరాయి తీసుకుంటున్నాం
అందుకే రాధిక స్కూల్ లో శ్రీవిద్య స్కూల్ ను పెట్టాం
విద్యార్థుల తల్లిదండ్రులకు సర్ది చెబుతున్న యాజమాన్యాలు
కాకతీయ,మణుగూరు : మణుగూరు రాధిక, శ్రీవిద్య స్కూల్ యజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులను నయ వంచనకు గురి చేసింది. వారు చేసిన తప్పులను కప్పి పుచ్చుకోవడానికి ఎన్ని ఎత్తుగడులైన వేయడానికైనా సిద్ధంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. కాకతీయ పత్రిక గత 8రోజుల నుంచి వరుస కథనాలు ద్వారా నిజాలు బయట పెడుతుండటంతో ఏం చేయాలో తెలియక సారీ పేరెంట్స్.. శ్రీవిద్య స్కూల్ రాధిక స్కూలోనే” ఉందని కొంతమంది పేరెంట్స్ కు చెబుతుండటం గమనార్హం. రాధిక స్కూల్ కు గత మూడు, నాలుగు సంవత్సరాలుగా అనుమతులు రాకపోవడంతో శ్రీవిద్య స్కూల్ పేరు మీద ఉన్న అనుమతులతో 8,9,10 తరగతులు నడిపించామని యాజమాన్యాలు కొందరితో మాట్లాడాటం గమనార్హం.
ప్రిన్సిపాల్ చెప్పింది కూడా అబద్ధమే
రాధిక స్కూల్ ప్రిన్సిపాల్ నరేష్ మీడియాతో మాట్లాడుతూ రాధిక స్కూల్ లో శ్రీవిద్య స్కూల్ లేదని, శ్రీవిద్య విద్యార్థులు తమ దగ్గర లేరని ,శ్రీ విద్య పాఠశాల యాజమాన్యంతో రాధిక స్కూల్‌కు ఎలాంటి సంబంధం లేదని మీడియా సాక్షిగా చెప్పారు. మరి ఇదే విషయాన్ని స్థానిక పోలీస్ స్టేషన్ లో రాధిక స్కూల్ యజమాని మధుసూదన్ రెడ్డి సీఐతో రాధిక స్కూల్ లో శ్రీవిద్య స్కూల్ ను మేర్జ్ చేశామని తెలిపారు. దీంతో సీఐ కూడా మెర్జ్ చేసుకున్నట్లు ఏమైనా డాక్యుమెంట్లు ఉన్నాయా అని అడిగారు. అలా ఏమీ లేవని ఇద్దరం కలిసి అనుకోని చేసుకున్నామని సీఐకు రాధిక స్కూల్ యజమాని మధుసూదన్ రెడ్డి చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ప్రిన్సిపాల్ నరేష్ మీడియా ముందు చెప్పింది నిజమా..? లేక సీఐ ముందు చెప్పింది నిజమా..? అంటే రెండు నాల్కల ధోరణియే అక్రమాలను స్పష్టంగా బయటపెడుతోంది. స్థానిక తల్లిదండ్రులను, అధికారులను, విద్యార్థి సంఘాల నాయకులను రెండు స్కూల్స్ కలిసి మోసం చేసినట్టు స్పష్టంగా కనిపిస్తోందని తేటతెల్లమవుతోంది.
శ్రీవిద్య స్కూల్ బిల్డింగ్ ను కిరాయికి ఇచ్చాం
రాధిక, శ్రీవిద్య పాఠశాల యాజమాన్యాల అసలు గుట్టు వెలుగులోకి రావడంతో అబద్దాల మీద అబద్దాలకు తెరలేపుతున్నాయి. మణుగూరు రాజీవ్ గాంధీ నగర్ లో శ్రీవిద్య స్కూల్ ఉండేది. అయితే అప్పట్లో శ్రీవిద్య భాగస్వాములందరూ ఎవరికివారు దూరమై విడిపోయారు. కొన్ని రోజులు స్కూల్ ను నడిపించారు. మరి ఏమైందో తెలవదు గాని కొంతమంది విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. ఈలోపు బయ్యారం నుంచి వచ్చిన రాధిక స్కూల్ మణుగూరులో నూతన స్కూల్ బిల్డింగ్ కట్టి మరోక బ్రాంచ్ స్థాపించారు. అయితే అప్పుడు రాధిక స్కూల్ యాజమాన్యానికి 1వ తరగతి నుంచి 7వ తరగతి మాత్రమే అనుమతి వచ్చింది. ఈలోగా శ్రీ విద్య, రాధిక ఒక్కటై రాధిక స్కూల్ లో శ్రీ విద్య పిల్లలందరిని చేర్చారు తప్ప మెర్జ్ చేయలేదన్నది విశ్వసనీయంగా తెలుస్తున్న విషయం. ఇంకే ముంది శ్రీవిద్యకు ఉన్న అనుమతితో రాధిక స్కూల్ క్యాచ్ చేసుకొని గత ముడు,నాలుగు సంవత్సరాలుగా 8,9,10 తరగతులను అనుమతులు లేకుండానే నడిపించారు. అయితే శ్రీవిద్య స్కూల్ ను ఖాళీగా ఉండనివ్వకుండా ప్రభుత్వ బీసీ గురుకులం బాలుర హాస్టల్‌కు లీజుకు ఇచ్చారు. ప్రభుత్వ గురుకులానికి లీజ్ కు ఇచ్చినందుకు నెలకు సుమారు రూ.3లక్షల వస్తున్నట్లు సమాచారం. ఆ 3లక్షల సొమ్మును దోచుకోవడమే కాకుండా శ్రీ విద్య స్కూల్ విద్యార్థులను రాధిక స్కూల్ బిల్డింగ్ లో పెట్టి నడిపించనందుకు కూడా అక్కడ సంవత్సరానికి కొంత పర్సంటేజీ రూపంలో రాబట్టుకున్నారు. దీంతో రెండు స్కూల్స్ కలిపి అక్రమ దందాకు తెరలేపి నడిపిస్తున్నారు. ఇక్కడ రాధిక స్కూల్ గత మూడు, నాలుగు సంవత్సరాలుగా అనుమతులు లేకపోయిన విద్యార్థుల దగ్గర నుంచి ఫీజుల రూపంలో భారీ మొత్తంలో వసూళ్లు చేశారు. చివరికి తల్లిదండ్రులను తప్పుదారి పట్టించారు. అయితే రాధిక స్కూల్ కు గత ఆరు నెలల క్రితం అనుమతులు రావడం గమనార్హం.
అనుమతులు రాకముందు సర్టిఫికెట్లు ఎవరి పేరు మీద ఉన్నాయో..! ఎవరు సంతకాలు చేసి జారీ చేశారో గత కథనంలో కాకతీయ బయట పెట్టిన విషయం పాఠకులకు విదితమే.
ఎంఈఓ, డీఈఓలకు వాటాలు ఎంత..?
రాధిక,శ్రీ విద్య స్కూల్స్ విద్యార్థులతో పాటు తల్లిదండ్రులను మోసం చేసిన అటు ప్రభుత్వాన్ని మోసం చేసిన ఎంఈఓ, డీఈఓలు చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంఈఓ, డీఈఓల పై స్థానికులు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అక్రమంలో ఎంఈఓ, డీఈఓలకు కొంత వాటా..ఉందన్న చర్చ ఇప్పుడు జనంలో జరుగుతుండటం గమనార్హం. అందుకే స్కూల్స్ పై ఎన్ని కథనాలు వస్తున్నా పట్టించుకోకపోవడానికి ప్రధాన కారణం అదేనని జనాలు చర్చించుకుంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై.. ఎంఈఓ, డీఈఓలపై విజులెన్సు ఎంక్వరీ చేయాలని, రెండు స్కూల్స్ పై జిల్లా కలెక్టర్ కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, స్థానికులు కోరుతున్నారు.

