epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల ఉక్కుపాదం

అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల ఉక్కుపాదం
మూడు ట్రాక్టర్ల స్వాధీనం.. నిందితుల అరెస్ట్
అక్రమ రవాణాకు పాల్పడితే సస్పెక్ట్ షీట్లు తప్పవు
కరీంనగర్ రూరల్ సీఐ ఏ నిరంజన్ రెడ్డి హెచ్చరిక

కాకతీయ, కరీంనగర్ రూరల్ : జిల్లాలో అక్రమ ఇసుక రవాణాపై కరీంనగర్ రూరల్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను బుధవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామాల్లో సాధారణ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఈ అక్రమ రవాణా ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల కథనం ప్రకారం.. సుల్తానాబాద్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన పెందం జంపన్న తన ట్రాక్టర్‌లో అక్రమంగా ఇసుకను లోడ్ చేసి కరీంనగర్ వైపు తరలిస్తుండగా, బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్ద పోలీసులు మాటు వేసి పట్టుకున్నారు. అదేవిధంగా మానకొండూరు మండలం రాఘవపూర్ గ్రామానికి చెందిన దావూ రాజు మానేరు వాగు నుంచి ఇసుకను దొంగతనంగా తరలిస్తుండగా బొమ్మకల్ సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కేసులు నమోదు.. కోర్టుకు తరలింపు
ఈ రెండు ఘటనల్లో పట్టుబడిన మూడు ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. నిందితులపై సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, వారిని కోర్టుకు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. అక్రమ రవాణా ద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే వారిపై నిరంతరం నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడే వారిపై కరీంనగర్ రూరల్ సీఐ ఏ నిరంజన్ రెడ్డి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఎవరైనా చట్టవిరుద్ధంగా ఇసుక తరలిస్తే వారిని తహసీల్దార్ ముందు బైండోవర్ చేస్తామని తెలిపారు. పదేపదే ఇవే చర్యలకు పాల్పడే వారిపై సస్పెక్ట్ షీట్లు తెరుస్తామని, చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ప్రకృతి వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, అక్రమార్కుల సమాచారాన్ని పోలీసులకు అందించాలని కోరారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.