నేరడలో వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపన
హాజరైన మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు
కాకతీయ, చింతకాని : చింతకాని మండల పరిధిలోని నేరడ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో సీతారామ చంద్రస్వామి, వేణుగోపాలస్వామి, వేంకటేశ్వరస్వామి వారల విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన, స్వామివార్లను దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు కమల్ రాజుకు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో చింతకాని మండల మాజీ వైస్ ఎంపీపీ గురజాల హనుమంతరావు, మండల కార్యదర్శి వెంకట రామారావు, రైతు విభాగం మాజీ కన్వీనర్ పొనుగోటి రత్నాకర్, మండల యువజన విభాగం అధ్యక్షులు పిన్నెల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. వీరితో పాటు మండల నాయకులు గడ్డం శ్రీను, ఆలస్యం శంకర్, చాట్ల సురేష్, ఆలస్యం మధు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని పూజలు నిర్వహించారు.

