పాలేరు జలాశయం వద్ద సూర్యాపేట జిల్లా వాసి బలవన్మరణం
కాకతీయ , కూసుమంచి : కూసుమంచి మండలం పాలేరు జలాశయం ఫాలింగ్ గేట్ల వద్ద సూర్యాపేట జిల్లా మోతి మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన అబ్దుల్ పాషా (45) అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు.వేపచెట్టుకు తాడుతో ఉరి బిగించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం చేపల పెట్టేందుకు వెళ్లిన మత్స్యకారులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని నేలకొండపల్లి మార్చరీకి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సింది.

